మహారాష్ట్రలోని యూవత్‌మాడ్ జిల్లా పూసద్‌లోని కాసోడ గ్రామానికి చెందిన రెవారే సంతోష్(45) నాలుగేళ్లుగా జైనథ్ మండలం కోరట గ్రామంలో వ్యవసాయకూలీగా పనిచేస్తున్నాడు.Santosh
జైనథ్, న్యూస్‌లైన్ : మహారాష్ట్రలోని యూవత్‌మాడ్ జిల్లా పూసద్‌లోని కాసోడ గ్రామానికి చెందిన రెవారే సంతోష్(45) నాలుగేళ్లుగా జైనథ్ మండలం కోరట గ్రామంలో వ్యవసాయకూలీగా పనిచేస్తున్నాడు. స్వగ్రామం నుంచే నిత్యం వచ్చిపోయేవాడు. నాలుగు నెలల క్రి తం గ్రామానికి చెందిన రైతు గోస్కుల నర్సింగ్ చేన్లో పనికి కుదిరాడు. రైతుకు చెందిన రేకుల కొట్టంలోనే భార్య సునందాబాయి, కొడుకు నగేశ్ కలిసి ఉంటున్నాడు. భార్యాభర్తలు తరచూ గొడవపడుతుండేవారు. దీంతో సంతోష్ నిత్యం తాగి వచ్చేవాడు. ఈ క్రమం లో సోమవారం రాత్రి భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది.
ఆ తర్వాత సంతోష్ కనిపిం చలేదు. మంగళవారం ఉదయం సునందాబా రుు కొడుకును తీసుకుని ఎటో వెళ్లిపోరుుంది. బుధవారం ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో అనుమానం వచ్చిన గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు గది తెరిచి చూడగా దుప్పట్లో చుట్టి, మీద తడకలు వేసి బట్టలు ఆరేసి ఉన్న మూట కనిపించింది. విప్పి చూడగా సంతోష్ మృతదేహం ఉంది. తలపై బలమైన గాయూలు కావడంతో రక్తస్రావం జరిగి చనిపోరుునట్లు సంఘటన స్థలాన్ని సందర్శించిన బోథ్ సీఐ రాంగోపాల్‌రావు పేర్కొన్నారు. ఇది పథకంప్రకారం చేసిన హత్యలా ఉందని తెలిపారు. సునందాబారుు ఇల్లు విడిచి వెళ్లడం ఇందుకు బలం చేకూరుస్తోందని పేర్కొన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు. కాగా, సంతోష్ నిద్రించి ఉన్న సమయంలో అతడి తలపై కొట్టి చంపి, ఆపై మృతదేహాన్ని దాచి సునందాబారుు వెళ్లిపోరుునట్లు స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.