ముంబై: జయశెట్టి హత్య కేసులో గ్యాంగ్‌స్టర్ ఛోటా రాజన్‌కు ఉపశమనం లభించింది. 2001 సంవత్సరం నాటి జయశెట్టి హత్య కేసులో చోటా రాజన్‌కు బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ ఏడాది ప్రారంభంలో ఈ కేసులో ఆయనకు జీవిత ఖైదు పడింది. ఈ కేసుపై విచారణ చేపట్టిన జస్టిస్ రేవతి మోహితే డేరే, జస్టిస్ పృథ్వీరాజ్ చవాన్‌లతో కూడిన డివిజనల్ బెంచ్ జీవిత ఖైదు శిక్షను రద్దు చేసి.. లక్ష రూపాయల పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేశారు. మే 30, 2024న ముంబైలోని ప్రత్యేక మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ (MCOCA) కోర్టు రాజన్‌కు జీవిత ఖైదు విధించింది.
Bombay High Court has given bail to Gangster Chhota Rajan in the 2001 Jaya Shetty murder case. He was convicted and sentenced to life in this case earlier this year. Divisional bench of Justice Revati Mohite Dere and Justice Prithviraj Chavan has given him bail for Rs 1 lakh. pic.twitter.com/pCzVYHY8IJ
— ANI (@ANI) October 23, 2024
సెంట్రల్ ముంబైలోని గామాదేవి ప్రాంతంలో గోల్డెన్ క్రౌన్ హోటల్‌ను జయాశెట్టి అనే మహిళ నిర్వహిచేవారు. అయితే.. 2001, మే 4న హోటల్‌లో ఉన్న సమయంలో ఆమెను గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్యచేసి పారిపోయారు. ఈ హత్య కేసు విచారణలో చోటా రాజన్ చేయించినట్లు తేలింది.
ఆమెను హత్య చేయడానకి ముందు చోటా రాజన్ ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడినట్ల వెలుగులోకి వచ్చింది. దీంతో తనకు చోటా రాజన్ నుంచి ప్రాణహాని ఉందని జయా శెట్టి పోలీసులను ఆశ్రయించారు. ఆమె ఫిర్యాదు మేరకు సెక్యూరిటీ కల్పించారు. ఎలాంటి హాని లేదని పోలీసులు కొన్ని సెక్యూరిటీ ఉపసంహరించుకున్నారు. సెక్యూరిటీని తొలగించిన రెండు నెలలకే జయా శెట్టి హత్యకు గురికావటం తీవ్ర కలకలం రేపింది.
చదవండి: 2006 Fake Encounter Case: 18 ఏళ్ల నాటి కేసులో ముంబై హైకోర్టు సంచలన తీర్పు
Comments
Please login to add a commentAdd a comment