bombai high court
-
హత్య కేసు: గ్యాంగ్‌స్టర్ చోటా రాజన్‌కు బెయిల్
ముంబై: జయశెట్టి హత్య కేసులో గ్యాంగ్‌స్టర్ ఛోటా రాజన్‌కు ఉపశమనం లభించింది. 2001 సంవత్సరం నాటి జయశెట్టి హత్య కేసులో చోటా రాజన్‌కు బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ ఏడాది ప్రారంభంలో ఈ కేసులో ఆయనకు జీవిత ఖైదు పడింది. ఈ కేసుపై విచారణ చేపట్టిన జస్టిస్ రేవతి మోహితే డేరే, జస్టిస్ పృథ్వీరాజ్ చవాన్లతో కూడిన డివిజనల్ బెంచ్ జీవిత ఖైదు శిక్షను రద్దు చేసి.. లక్ష రూపాయల పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేశారు. మే 30, 2024న ముంబైలోని ప్రత్యేక మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ (MCOCA) కోర్టు రాజన్‌కు జీవిత ఖైదు విధించింది.Bombay High Court has given bail to Gangster Chhota Rajan in the 2001 Jaya Shetty murder case. He was convicted and sentenced to life in this case earlier this year. Divisional bench of Justice Revati Mohite Dere and Justice Prithviraj Chavan has given him bail for Rs 1 lakh. pic.twitter.com/pCzVYHY8IJ— ANI (@ANI) October 23, 2024సెంట్రల్ ముంబైలోని గామాదేవి ప్రాంతంలో గోల్డెన్ క్రౌన్ హోటల్‌ను జయాశెట్టి అనే మహిళ నిర్వహిచేవారు. అయితే.. 2001, మే 4న హోటల్లో ఉన్న సమయంలో ఆమెను గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్యచేసి పారిపోయారు. ఈ హత్య కేసు విచారణలో చోటా రాజన్ చేయించినట్లు తేలింది. ఆమెను హత్య చేయడానకి ముందు చోటా రాజన్ ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడినట్ల వెలుగులోకి వచ్చింది. దీంతో తనకు చోటా రాజన్ నుంచి ప్రాణహాని ఉందని జయా శెట్టి పోలీసులను ఆశ్రయించారు. ఆమె ఫిర్యాదు మేరకు సెక్యూరిటీ కల్పించారు. ఎలాంటి హాని లేదని పోలీసులు కొన్ని సెక్యూరిటీ ఉపసంహరించుకున్నారు. సెక్యూరిటీని తొలగించిన రెండు నెలలకే జయా శెట్టి హత్యకు గురికావటం తీవ్ర కలకలం రేపింది.చదవండి: 2006 Fake Encounter Case: 18 ఏళ్ల నాటి కేసులో ముంబై హైకోర్టు సంచలన తీర్పు -
మహిళా ప్రజాప్రతినిధులంటే అలుసా?
న్యూఢిల్లీ: ప్రజలు ఓట్లు వేసి గెలిపించిన ప్రజాప్రతినిధిని పదవి నుంచి తొలగించడాన్ని సాధారణ విషయంగా తీసుకోవద్దని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజాప్రతినిధిగా గెలిచిన మహిళలను ఇష్టారాజ్యంగా పదవుల నుంచి తొలగించడం సరైంది కాదని పేర్కొంది. మహారాష్ట్రలో ఓ గ్రామ మహిళా సర్పంచిని పదవి నుంచి తప్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వును న్యాయస్థానం కొట్టివేసింది. మహిళలు గ్రామ సర్పంచి కావడాన్ని చాలామంది తట్టుకోలేకపోతున్నారని సుప్రీంకోర్టు ఆక్షేపించింది. దేశమంతటా ఇలాంటి పరిస్థితి ఉందని పేర్కొంది. నిర్ణయాలు తీసుకొనే సామర్థ్యం మహిళల్లో ఉండదన్న అభిప్రాయం ప్రజల్లో ఉందని వెల్లడించింది. నిజానికి మహిళల్లో చక్కటి పరిపాలనా సామర్థ్యాలు ఉంటాయని, వారిని తక్కువ అంచనా వేయొద్దని సూచించింది. మనీశ్ రవీంద్రపన్ పాటిల్ అనే మహిళ మహారాష్ట్రలో జలగావ్ జిల్లా విచ్ఖేడ్ గ్రామ సర్పంచిగా ఎన్నికయ్యారు. ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మించిన భవనంలో ఆమె తన అత్తతో కలిసి నివసిస్తున్నారని గ్రామస్థులు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఒక ప్రజాప్రతినిధి కబ్జా చేసిన స్థలంలో కట్టిన ఇంట్లో నివసించడం చట్టవిరుద్ధమని ఆమెపై అనర్హత వేటు వేయాలని కోరారు. ఈ ఆరోపణలను మనీశ్ రవీంద్రపన్ పాటిల్ ఖండించారు. తాను భర్త, పిల్లలతో కలిసి అద్దె ఇంట్లో ఉంటున్నానని స్పష్టంచేశారు. కలెక్టర్ సరైన విచారణ చేయకుండా తెలుసుకోకుండా పాటిల్‌ను సర్పంచి పదవి నుంచి తొలగించారు. దీన్ని ఆమె బాంబే హైకోర్టులో సవాలు చేశారు. హైకోర్టు కూడా కలెక్టర్ నిర్ణయాన్ని సమర్థించడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. బాంబే హైకోర్టు ఉత్తర్వును తోసిపుచ్చింది. పాటిల్ సర్పంచిగా విధులు నిర్వర్తించవచ్చంటూ తీర్పు వెలువరించింది. దేశంలో లింగ సమానత్వం కోసం, మహిళా సాధికారత కోసం ఒకవైపు కృషి కొనసాగుతుండగా, మరోవైపు వారిని నిరుత్సాహపర్చే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని ఆవేదన వెలిబుచ్చింది. ప్రజల ఆలోచనా ధోరణిలో మార్పు రావాలని, మహిళలను ప్రోత్సహించాలని స్పష్టం చేసింది. వారిని కింపచర్చడం, అలుసుగా తీసుకోవడం తగదని హితవు పలికింది. పేర్కొంది. -
నటి దారుణ హత్య.. 13 ఏళ్ల తర్వాత దోషిని తేల్చిన కోర్టు
దాదాపు 13 ఏళ్ల క్రితం కనిపించకుండా పోయిన ప్రముఖ నటి కేసులో సంచలన నిజాలు బయటపడ్డాయి. ఆమెని దారుణంగా హత్య చేసింది ఎవరో తెలిసిపోయింది. ఈ క్రమంలోనే విచారణ పూర్తవగా.. తాజాగా కోర్టు తీర్పు ఇచ్చింది. సవతి తండ్రి ఈ దారుణానికి పాల్పడినట్లు తెలిసి అందరూ షాకవుతున్నారు. ఇంతకీ అసలేం జరిగింది?1978లో ముంబయిలో పుట్టి పెరిగిన రేష్మా పటేల్.. సినిమాల్లోకి వచ్చేటప్పుడు లైలా ఖాన్ అని తన పేరు మార్చుకుంది. 2002లో కన్నడ మూవీతో హీరోయిన్ అయ్యింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించినప్పటికీ రాజేశ్ ఖన్నాతో చేసిన 'వాఫా'.. ఈమెకు ఓ మాదిరి గుర్తింపు తీసుకొచ్చింది. 2011లో 'జిన్నాత్' అనే సినిమా చేస్తుండగా.. విరామం రావడంతో కుటుంబంతో కలిసి ట్రిప్‌కి వెళ్లింది. ఆ తర్వాత కనిపించకుండా పోయింది.(ఇదీ చదవండి: రొమాంటిక్ సీన్స్.. నాకు ఒళ్లంతా దద్దుర్లు వచ్చేశాయి: టాలీవుడ్ హీరోయిన్)దీంతో లైలా తండ్రి నాదిర్ పటేల్.. తన కుటుంబ సభ్యులు కనిపించట్లేదని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ మొదలుపెట్టారు. నటి మొబైల్ సిగ్నల్ చివరగా నాసిక్‌లో ఉన్నట్లు గుర్తించారు. లైలాకు అక్కడ ఫామ్ హౌస్ ఉందని తెలిసి పోలీసులు వెళ్లగా.. అది కాస్త కొంతవరకు అగ్ని ప్రమాదానికి గురై ఉంది. కొన్నాళ్ల తర్వాత జమ్ము కశ్మీర్లో వీళ్ల వాహనం దొరకడంతో కేసు క్లిష్టంగా మారింది. అయితే లైలాతో పాటు ఆమె కుటుంబ సభ్యుల ఆచూకీ మాత్రం దొరకలేదు.లైలా సవతి తండ్రి పర్వేజ్ తక్‌పై ఎందుకో పోలీసులకు అనుమానమొచ్చింది. దీంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా.. సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఆస్తి విషయంలో గొడవ జరిగిందని.. దీంతో భార్య షెలీనాను చంపి ఆ తర్వాత లైలా-ఆమె అక్క అమీనా, కవలలు జారా-ఇమ్రాన్, కజిల్ రేష్మాని హత్య చేసినట్లు ఒప్పుకొన్నాడు. ఆ తర్వాత బంగ్లా నుంచి కుళ్లిన స్థితిలో ఉన్న మృతదేహాలని వెలికి తీశారు. మొత్తంగా 40 మందిని విచారించారు. ఈ క్రమంలోనే తాజాగా ముంబై సెషన్స్ కోర్టు.. పర్వేజ్ని ఈ కేసులో దోషిగా తేల్చింది. మే 14న శిక్ష ఖరారు చేయనుంది.(ఇదీ చదవండి: 20 ఏళ్లకే పెళ్లి.. 'బిగ్‌బాస్' స్టార్ షాకింగ్ నిర్ణయం) -
పుణే ఉప ఎన్నికపై సుప్రీం స్టే
న్యూఢిల్లీ: పుణే ఎంపీ గిరీశ్ బాపత్ మృతితో తొమ్మిది నెలలుగా ఖాళీగా ఉన్న ఆ ఎంపీ స్థానానికి వెంటనే ఉప ఎన్నికలు నిర్వహించాలంటూ ఈసీని ఆదేశిస్తూ బాంబే హైకోర్టు ఇచి్చన ఉత్తర్వులను సుప్రీంకోర్టు పక్కనబెట్టింది. ప్రస్తుత లోక్‌సభ కాలపరిమితి జూన్ 16వ తేదీతో ముగుస్తున్న కారణంగా ఆ ఒక్క స్థానానికి ఉప ఎన్నిక నిర్వహణ వృథా అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం వ్యాఖ్యానించింది. ‘‘ ఈ స్థానం ఖాళీగా ఉంటే ఈసీ ఇన్ని రోజులు ఈసీ ఏం చేస్తున్నట్లు?. ఇలాంటి సందర్భాల్లో ఉప ఎన్నికలు నిర్వహించాల్సి వస్తే పాటించాల్సిన విధివిధానాలపై మార్గదర్శకాలను త్వరలో వెలువరిస్తాం’ అని బెంచ్ పేర్కొంది. గత ఏడాది మార్చి 29వ తేదీన ఇక్కడి బీజేపీ ఎంపీ గిరీశ్ బాపత్ కన్నుమూశారు. ఈ స్థానానికి ఉపఎన్నికలు ఉండవని ఈసీ చెప్పడంతో పుణేకు చెందినన సుఘోష్ జోషి గతంలో బాంబే హైకోర్టును ఆశ్రయించారు. పుణే స్థానం ఖాళీ అయినప్పటి నుంచీ పలు అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు ఈసీ ఉప ఎన్నికలు నిర్వహించింది. పుణే విషయంలో ఈసీ గతంలో ఇచ్చిన వివరణ హేతుబద్ధంగా లేదు. అందుకే అక్కడ తక్షణం ఉప ఎన్నిక నిర్వహించండి’’ అంటూ ఈసీని బాంబే హైకోర్టు ఆదేశించింది. వాటిని ఈసీ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. -
రూ.5.3 కోట్ల ఫ్లాట్ కేవలం రూ.11లక్షలే.. ఎలా సాధ్యం?
ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో చందా కొచ్చర్ వీడియోకాన్ ముడుపుల వ్యవహారంలో బాంబే హైకోర్ట్‌లో విచారణ జరిగింది. ఈ విచారణ సందర్భంగా చందా కొచ్చర్‌పై తాము దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌ను పరిగణలోకి తీసుకోవాలని కోర్ట్‌ను కోరింది. కొచ్చర్ రూ.64 కోట్ల బ్యాంక్ నిధుల్ని వ్యక్తిగత అవసరాల కోసం వినియోగించుకున్నారని కోర్ట్‌కు సీబీఐ తెలిపింది. చట్టవిరుద్ధంగా బ్యాంక్ సొమ్మును దుర్వినియోగం చేశారనే ఆధారాలున్నాయని పేర్కొంది. అంతేకాదు, తమ విచారణలో రూ.64 కోట్లను కొచ్చర్ ఆమె భర్త దీపక్ కొచ్చర్‌కు చెందిన న్యూ పవర్ రెన్యూవబుల్తో పాటు వీడియోకాన్ కంపెనీలోకి మళ్లించినట్లు ఆధారాలున్నాయని తెలిపింది. ఈ సందర్భంగా సీబీఐ తరపున ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎ లిమోసిన్.. చందా కొచ్చర్ కొంతమంది వ్యక్తులతో కుమ్మక్కై రుణాలకు అనర్హమైన వీడియోకాన్ కంపెనీకి లోన్స్ ఇచ్చేలా తన పదవిని దుర్వినియోగం చేసినట్లు కోర్ట్ ఎదుట వాదించారు. దీంతో పాటు, 2016లో కొచ్చార్ ముంబైలోని చర్చ్‌గేట్ ప్రాంతంలో ఉన్న సీసీఐ చాంబర్స్‌లోని రూ.5.3 కోట్ల విలువైన ఫ్లాట్‌కు కేవలం రూ.11లక్షలే చెల్లించారని అన్నారు. 2021 నవంబర్ నెలలో అదే బిల్డింగ్‌లో ఓ ఫ్లోర్‌కు చందా కొచ్చర్ కుమారుడు అర్జున్ కొచ్చర్ రూ.19.11 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసినట్లు సీబీఐ కోర్టుకు వివరించింది. 11,000 పేజీల ఛార్జ్ షీట్ ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి రూ.3,250 కోట్ల రుణాన్ని వీడియోకాన్ గ్రూపు పొందిన తర్వాత.. అందులో కోట్లాది రూపాయలను దీపక్ కొచ్చర్ నిర్వహించే న్యూపవర్‌లో, వీడియోకాన్ ప్రమోటర్ వేణుగోపాల్ ధూత్ పెట్టుబడులుగా పెట్టినట్లు సీబీఐ ఆరోపిస్తోంది. కేసులో భాగంగా ఈ ఏడాది ఏప్రిల్‌లో చందా కొచ్చర్, దీపక్ కొచ్చర్, వేణుగోపాల్ ధూత్‌లపై సీబీఐ 11,000 చార్జిషీట్ దాఖలు చేసింది. జులై 3కి వాయిదా తాజాగా,ఆ చార్జిషీట్‌పై విచారణ జరిగింది. విచారణలో కొచ్చర్‌పై తాము దాఖలు చేసిన ఛార్జిషీట్‌ను పరిగణలోకి తీసుకోవాలని సీబీఐ కోర్ట్‌ను కోరింది. ఇరువురి వాదనలు విన్న బాంబే హైకోర్ట్ కేసు తదుపరి విచారణను జూలై 3కి వాయిదా వేసింది. సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి ఎస్పీ నాయక్ నింబాల్కర్ ఎదుట లిమోసిన్ తన వాదనలు కొనసాగించనున్నారు. 2017లోనే తెరపైకి క్విడ్ ప్రో కో వివాదం.. వీడియోకాన్ గ్రూప్‌నకు రుణాల మంజూరుకు చందా కొచ్చర్ తోడ్పడినందుకు గాను ప్రతిగా ఆమె భర్త దీపక్ కొచర్‌కు చెందిన న్యూపవర్‌లో తన సుప్రీం ఎనర్జీ సంస్థ ద్వారా ధూత్ రూ.64 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్లు ఆరోపణలున్నాయి. 2017 డిసెంబర్లో సీబీఐ ఈ వివాదంపై ప్రాథమిక విచారణ ప్రారంభించింది. బ్యాంక్ నియమ, నిబంధనలకు విరుద్ధంగా ఈ రుణాలు మంజూరైనట్లు ఆరోపణలు ఉన్నాయని సీబీఐ వర్గాలు పేర్కొన్నాయి. ఇలా వీడియోకాన్ గ్రూప్‌నకు ఇచ్చిన రుణాల్లో అధిక భాగం లోన్లు మొండిబాకీలుగా మారడంతో బ్యాంక్‌కు దాదాపు రూ.1,730 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు సీబీఐ వర్గాలు వివరించాయి. చివరిగా :: సీబీఐ నివేదికల ప్రకారం..ఆగస్ట్ 6, 2009లో వీడియోకాన్ ఎలక్ట్రానిక్స్ ఇంటర్నేషనల్ లిమిటెడ్‌కు ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవోగా ఉన్న చందా కొచ్చార్ లోన్లు ఇచ్చారని, అదే ఏడాది సెప్టెంబర్ 7 ఆ రుణాల్ని వీడియోకాన్‌కు చెల్లించినట్లు తేలింది. చదవండి👉 ‘అప్పుడు మెగాస్టార్.. ఇప్పుడు ఆర్థిక నేరాలతో అరెస్ట్’ -
టీ చేయను అనడం భర్తను రెచ్చగొట్టడం కాదు: కోర్టు
ముంబై : భార్య టీ పెట్టననడం భర్తను రెచ్చగొట్టడం కాదని.. దాన్ని సాకుగా చూపి.. భర్త ఆమెపై దాడి చేయడం సమంజసం కాదని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. తన భార్యపై దాడి చేసినందుకు 35 ఏళ్ల వ్యక్తికి కింది కోర్టు విధించిన శిక్షను సమర్థించిన బాంబే హైకోర్టు, భర్తకు టీ తయారు చేయడానికి భార్య నిరాకరించడాన్ని ఆమెపై దాడి చేయడానికి రెచ్చగొట్టే చర్యగా అంగీకరించలేమని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా జస్టిస్ రేవతి మోహితే దేరే మాట్లాడుతూ ‘‘భార్య అంటే చరాస్తి.. వస్తువు కాదు. వివాహం అనేది సమానాత్వం మీద ఆధారపడిన స్నేహం. వాస్తవంగా మాత్రం అలా ఉండటం లేదు. ఇలాంటి కేసులు సహజమైనవి కావు. ఇది లింగం - వక్రీకృత పితృస్వామ్య వ్యవస్థని సూచిస్తోంది. ఇది తరచూ వైవాహిక సంబంధంలోకి వస్తుంది. సమాజంలోని పితృస్వామ్య భావనల వల్ల, స్త్రీ పురుషుడి ఆస్తి అనే ఆలోచన సమాజంలో ఇప్పటికీ ప్రబలంగా ఉంది. ఈ భావన ఒక వ్యక్తి తన భార్యను అతడి చరాస్థిగా భావించడానికి దారి తీస్తోంది’’ అని కోర్టు అభిప్రాయపడింది. ‘‘సమాజంలోని లింగ వివక్షత వల్ల ఇంటి పని బాధ్యత భార్యదే అనే భావం పాతుకుపోయింది. ఈ లింగ వివక్షత వల్ల భార్య ఇంటి పనికే పరిమితం అయ్యింది. ఆ పనులన్ని ఆమెకు కేటాయించినవే అనే భావం పాతుకుపోయింది. ఇక వివాహంలో భార్య నుంచి భావోద్వేగ శ్రమను కూడా ఆశిస్తున్నారు. సామాజిక పరిస్థితులు కూడా మహిళను తన అత్తారింటికి అంకితం అయ్యేలా ప్రేరేపిస్తున్నాయి. దాంతో మగవారు భార్యలను తమ స్తిరాస్తిగా భావిస్తున్నారు’’ అని కోర్టు అభిప్రాయపడింది. ఈ కేసుకు సంబంధించి దంపతుల కుమార్తె చెప్పిన సాక్ష్యాన్ని బాంబే హైకోర్టు పరిగణలోకి తీసుకుంది. దీనిపై పూర్తి విశ్వాసం ఉందని స్పష్టం చేసింది. ఆమెను క్రాస్ ఎగ్జామినేషన్ చేయాల్సిన అవసరం లేదని తెలిపింది. భర్తకు కింది కోర్టు విధించిన శిక్షను కొనసాగించాలని కోర్టు ఆదేశించింది. కేసు ఏంటంటే.. సోలాపూర్ జిల్లాలోని పంధర్పూర్ ప్రాంతానికి చెందిన సంతోష్ అక్తర్ అనే వ్యక్తికి భార్యతో తరచు ఏదో ఓ గొడవ జరుగుతుండేది. ఈ క్రమంలో 2013 డిసెంబర్లో వీరి మధ్య వివాదం చోటు చేసుకుంది. అక్తర్ తన భార్యను అతడికి ఒక కప్పు టీ పెట్టి ఇవ్వాల్సిందిగా కోరాడు. ఆమె అదేం పట్టించుకోకుండా బయటకు వెళ్లిపోయింది. దాంతో ఆగ్రహానికి గురైన అక్తర్ భార్యపై సుత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపరిచాడు. ఈ గొడవకు ఇంట్లో నిద్రపోతున్న ఆరేళ్ల కుమార్తె బయటకు వచ్చి చూడగా.. తండ్రి తల్లిని దారుణంగా కొట్టడం కంట పడింది. ఆ తర్వాత అక్తర్ ఘటన జరిగిన ప్రాంతాన్ని శుభ్రం చేసి.. భార్యను ఆస్పత్రికి తీసుకెళ్లాడు అక్తర్. ఆమె స్పృహలోకి రావడానికి వారం రోజులు పట్టింది. అనంతరం ఆమె తన భర్తపై ఫిర్యాదు చేసింది. భార్య టీ పెట్టడానికి నిరాకరించి తనను రెచ్చగొట్టిందని.. అందుకే దాడి చేశానని తెలిపాడు అక్తర్. ఇందుకు గాను స్థానిక కోర్టు 2016లో అక్తర్‌కి పదేళ్ల జైలు శిక్ష విధించింది. నరహత్య ఆరోపణలపై అతడికి ఈ శిక్ష విధించింది. దాంతో అతడు బాంబే హై కోర్టును ఆశ్రయించాడు. కింది కోర్టు తీర్పును హై కోర్టు సమర్థించింది. చదవండి: నిరసన: జడ్జికి కండోమ్‌లు పంపిన మహిళ.. న్యాయాన్యాయాల విచికిత్స -
విరసం నేత వరవరరావుకు ఎట్టకేలకు బెయిల్
సాక్షి, హైదరాబాద్: విరసం నేత, విప్లవ కవి వరవరరావుకు ఎట్టకేలకు బెయిల్ లభించింది. భీమా కొరేగావ్ కేసుకు సంబంధించి జైల్లో ఉన్న ఆయనకు సోమవారం బొంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రత్యేక షరతులతో ఆరునెలల మెడికల్ బెయిల్ మంజూరు చేసింది. స్పెషల్ ఎన్ఐఏ కోర్టు పరిధిలోనే (ముంబైలోనే) ఉండాలని, అలాగే గత ఎఫ్ఐఆర్కు దారి తీసిన కార్యకలాపాలు చేయగూడదంటూ షరతులు విధించింది. దీంతో వరవరరావు ఆరోగ్యంపై ఇప్పటికే తీవ్ర ఆందోళనలో ఉన్న కుటుంబ సభ్యులు, పౌర హక్కుల సంఘాల ప్రతినిధులకు భారీ ఊరట లభించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం తన భర్తకు బెయిల్ ఇవ్వాలన్న వరవరావు భార్య పిటీషన్‌పై కోర్టు సానుకూలంగా స్పందించింది. ఈ పరిస్థితుల్లో ఆయనను జైలుకు పంపడం సరికాదని భావించిన కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అవసరమైనప్పుడు రావు విచారణకు హాజరుకావాలని, అయితే భౌతిక హాజరునుంచి మినహాయింపు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని కోర్టు పేర్కొంది. మరోవైపు ఈ ఉత్తర్వుపై మూడు వారాల పాటు స్టే విధించాలని కోరిన అదనపు సొలిసిటర్ జనరల్ అనిల్ సింగ్ అభ్యర్ధనను కోర్టు తిరస్కరించింది. ఇటీవల కరోనా సోకడంతోపాటు, తీవ్ర అనారోగ్యంతో ఉన్న తన భర్త వరవరావును బెయిల్‌పై విడుదల చేయాలని కోరుతూ భార్య హేమలత బొంబే హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. -
వివాదాస్పద తీర్పుపై సుప్రీంకోర్టు స్టే
సాక్షి, న్యూఢిల్లీ : పన్నెండేళ్ల బాలికపై లైంగిక వేధింపుల కేసులో బాంబే హైకోర్టు ఇచ్చిన వివాదాస్పద తీర్పుపై దేశ అత్యున్నత న్యాయస్థానం స్టే విధించింది. నాగపూర్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై దేశ వ్యాప్తంగా నిరసన స్వరాలు వినిపిస్తున్న నేపథ్యంలో అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ ఆ తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై బుధవారం విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బాబ్డే హైకోర్టు ఇచ్చిన తీర్పును నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. వివాదాస్పదంగా మారిన అంశంపై తుది విచారణ ముగిసే వరకు స్టే విధిస్తున్నట్లు తెలిపారు. బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పు ఆందోళనకరంగా ఉందని, దీనిపై మరోసారి సమీక్ష చేయాల్సిన అవసరం ఉందని కేకే వేణుగోపాల్ తన పిటిషన్లో పేర్కొన్నారు. కాగా మహారాష్ట్రకు చెందిన 12 ఏళ్ల మైనర్ బాలికపై లైంగిక వేధింపుల కేసులో విచారణ జరిపిన జస్టిస్ పుష్పా గనేడివాలా ఏకసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పు పెను దుమారానికి దారితీసింది. ఈ తీర్పుపై వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు తీవ్ర అసహనం వ్యక్తం చేయడంతో పాటు తీర్పుపై ఆందోళన సైతం వ్యక్తం చేశారు. (వివాదాస్పదం: అక్కడ తాకితే నేరం కాదు) కేసు పూర్వపరాలు.. 39 ఏళ్లు ఓ వ్యక్తి 12 ఏళ్ల బాలికను పండు ఆశచూపు ఇంట్లోకి తీసుకెళ్లాడు. అనంతరం తలుపులన్నీ మూసి ఆమె ఛాతీభాగాన్ని నొక్కాడు. అంతేకాకుండా బాలికపై లైంగిక దాడికి ప్రయత్నించాడు. కామాంధుడి కోరికను పసిగట్టిన బాలిక పెద్దగా అరవడంతో చుట్టుపక్కల వారు వచ్చి అతనికి దేహశుద్ధి చేశారు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోక్సో (ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్) చట్టం-2012 కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. దిగువ న్యాయస్థానంలో నిందితుడిని ప్రవేశపెట్టారు. ఐపీసీ సెక్షన్ 354 కేసు కింద కూడా అతడిపై మరో కేసు నమోదైంది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం నిందితుడికి మూడేళ్ల జైలు శిక్షను విధించింది. దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును దోషిగా తేలిన వ్యక్తి బాంబే హైకోర్టు నాగపూర్ బెంచ్‌లో తీర్పును సవాలు చేస్తూ రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ పుష్ప ఈనెల 19న తుది తీర్పును వెలువరించారు. (చర్మాన్ని చర్మం తాకలేదు గనుక..) ఈ సందర్భంగా న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. ‘దుస్తుల పై నుంచి చిన్నారి ఒంటిని తాకినంత మాత్రాన అది పోక్సో చట్టం ప్రకారం నేరంగా పరిగణించలేం. చర్మాన్ని చర్మం తాకాలి, కానీ ఈ కేసులో అలా జరగలేదు. స్కిన్–టు–స్కిన్ కాంటాక్టు లేదు. దుస్తుల లోపల చేతులు పెట్టినట్టి కూడా ఆధారాలు లేవు. పోక్సో చట్టం కింద నమోదైయ్యే కేసుల్లో ఆధారాలు పక్కాగా ఉండాలి’ అని జస్టిస్ పుష్ప తన తీర్పు సందర్భంగా పేర్కొన్నారు. చిన్నారుల ఒంటిని తాకకూడని చోట తాకడం పోక్సో చట్టం కింద నేరం అవుతాయి కనుక, అతడు ఆ పని చేయలేదని ఈ చట్టం ప్రకారం అతడు నిర్దోషే అని తీర్పును వెలువరించారు. ఐపీసీ సెక్షన్ 354 కింద మాత్రమే అతడిని నేరస్థుడిగా గుర్తిస్తామని పేర్కొన్నారు. ఈ తీర్పుపై సినీ నటి తాప్సితో పాటు గాయని చిన్మయి వంటి వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుత సమయంలో ఇలాంటి తీర్పులు రావడం ఆందోళనకరమని అభిప్రాయపడ్డారు. దీనిపై యూత్ బార్ అసోషియేషన్ ఆఫ్ ఇండియా సైతం సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. -
‘సోహ్రాబుద్దీన్’ కేసులో సీబీఐకి అక్షింతలు
ముంబై: సోహ్రాబుద్దీన్ ఎన్కౌంటర్ కేసులో సీనియర్ ఐపీఎస్ అధికారులను నిర్దోషులుగా విడుదల చేస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును ఎందుకు సవాల్ చేయలేదని సీబీఐని బాంబే హైకోర్టు ప్రశ్నించింది. ట్రయల్ కోర్టు ఉత్తర్వులను సవాలుచేస్తూ సోహ్రాబుద్దీన్ సోదరుడు రుబాబుద్దీన్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన న్యాయమూర్తి జస్టిస్ రేవతి మెహితే దెరే.. పిటిషనర్‌తోపాటు సీబీఐ కూడా ట్రయల్ కోర్టు తీర్పుపై నిరాశ చెంది ఉండాల్సిందని వ్యాఖ్యానించారు. సోహ్రాబుద్దీన్ కేసులో ఐపీఎస్ అధికారులు రాజ్‌కుమార్ పాండియన్, డీజీ వంజరా, ఎంఎన్ దినేశ్‌లను నిర్దోషులుగా విడిచిపెట్టడాన్ని సీబీఐ సవాలు చేయబోతుందా? లేదా? అని ప్రశ్నించారు. ఈ కేసులో ఐపీఎస్ అధికారులను కాకుండా కేవలం ఇన్స్పెక్టర్లు, కానిస్టేబుళ్ల విడుదలను మాత్రమే సీబీఐ వ్యతిరేకించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టం అందరికీ ఒకేలా వర్తిస్తుందన్నారు. ఈ కేసులో మొత్తం 15 మంది ఐపీఎస్ అధికారుల్లో 14 మంది విడుదల అయ్యారన్నారు. నిందితులపై ఎలాంటి అభియోగాలు నమోదు చేయొద్దన్న న్యాయమూర్తి.. తదుపరి విచారణను అక్టోబర్ 12కు వాయిదా వేశారు. -
జనస్వామ్యంలో రాజద్రోహం!
రాజులు పోయారు... రాజరికాలూ పోయాయి. దేశం ప్రజాతంత్ర రిపబ్లిక్‌గా మారి 66 ఏళ్లవుతోంది. కానీ ‘రాజద్రోహం’ సెక్షన్ (124 ఏ) మాత్రం భారత శిక్షాస్మృతిలో ఉండిపోయింది. అది నిరసన తెలిపేవారినీ, భిన్నాభిప్రాయాన్ని ప్రకటించేవారినీ వేధిస్తూనే ఉంది. ఎందరినో జైలుపాలు చేస్తూనే ఉంది. ఒకపక్క ఈ సెక్షన్‌ను శిక్షాస్మృతి నుంచి తొలగించాలన్న డిమాండ్ వస్తుండగా...దాని అమలులో అనుసరించాల్సిన విధానాలను పొందుపరుస్తూ ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఒక సర్క్యులర్ ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఎలాంటివారిపై ఈ సెక్షన్ కింద కేసు పెట్టవచ్చునో, ఎవరి చర్యలు దాని పరిధిలోకి వస్తాయో ఆ సర్క్యులర్ ఏకరువు పెట్టింది. మూడేళ్లక్రితం కాన్పూర్‌కు చెందిన కార్టూనిస్టు అసిమ్ త్రివేదీని రాజద్రోహం నేరంకింద అరెస్టు చేయడం చెల్లదని బొంబాయి హైకోర్టు తీర్పునిచ్చింది. అంతేకాక ఎలాంటి సందర్భాల్లో ఈ సెక్షన్ కింద కేసు పెట్టవచ్చునో వివరిస్తూ పోలీసులకు మార్గదర్శకాలు జారీచేయమని ప్రభుత్వాన్ని ఆదేశించింది. పర్యవసానంగానే ఈ సర్క్యులర్ వెలువడింది. హైకోర్టు ఆదేశాల్లో సదుద్దేశం ఉంది. అయినదానికీ, కానిదానికీ ఈ సెక్షన్‌కింద కేసులు పెట్టడం అలవాటుగా మార్చుకున్న పోలీసుల తీరును సరిచేయడానికి ఇది అవసర మని న్యాయస్థానం భావించింది. బహుశా ఈ సర్క్యులర్‌ను చూశాక లోపం పోలీ సుల్లో కాదు... పాలకుల్లోనే ఉందని న్యాయస్థానానికి కూడా అర్ధమై ఉంటుంది. సర్క్యులర్‌లోని అంశాల్లోకి వెళ్లేముందు అసలు అసీమ్ త్రివేదీ కేసు నేపథ్యమేమిటో తెలుసుకోవాలి. అన్నా హజారే నేతృత్వంలో నడిచిన అవినీతి వ్యతిరేక పోరాటంలో త్రివేదీ కార్యకర్తగా పనిచేశారు. పాలకుల అవినీతి పోకడలను నిశితంగా విమర్శిస్తూ కుంచె ఆయుధంగా, ఇంటర్నెట్ వాహికగా కార్టూన్ల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. ప్రభుత్వం దృష్టిలో అదే పెద్ద నేరమైంది. త్రివేదీపై రాజద్రోహం నేరం కింద కేసు పెట్టి అరెస్టు చేశారు. ఈ ఉదంతంపై జాతీయంగా, అంతర్జాతీయంగా నిరసనలు వెల్లువెత్తడం...బొంబాయి హైకోర్టు జోక్యం పరిణామాల కారణంగా త్రివేదీకి వెనువెంటనే బెయిల్ లభించింది. నిజానికి ఆ సెక్షన్ అత్యంత కఠినమైనది. నేరం చేసినట్టు రుజువైతే ఆ సెక్షన్‌కింద యావజ్జీవ శిక్ష పడే అవకాశం ఉంటుంది. అలాంటి సెక్షన్‌ను ఎడాపెడా ఉపయోగించి ఎవరిని పడితే వారిని ‘రాజద్రోహులు’గా పరిగణించడం అలవాటుగా మారింది. ఆ సెక్షన్‌కింద ఆదివాసీలు, దళితులు, రచయితలు, కళాకారులు ఎందరో అరెస్టవుతు న్నారు. ఈ సమస్య మహారాష్ట్రకు పరిమితమైనది కాదు. దేశమంతా ఇలాగే ఉంది. ఛత్తీస్‌గఢ్‌లో ఆదివాసీ ప్రాంతాల్లో అంకిత భావంతో వైద్య సేవలందించిన డాక్టర్ బినాయక్ సేన్‌ను అక్కడి ప్రభుత్వం రాజద్రోహ నేరం కింద అరెస్టు చేయగా... ఆయనకు యావజ్జీవ శిక్ష పడింది. సుప్రీంకోర్టు జోక్యంతో ఆయన బెయిల్‌పై బయటికొచ్చారు. యూపీలో మైనింగ్ మాఫియా కార్యకలాపాలను బయటపెట్టిన జర్నలిస్టు సీమా ఆజాద్, ఆమె భర్త ఈ సెక్షన్‌కిందే జైల్లో మగ్గారు. తమిళనాడులోని కూదంకుళంలో అణు విద్యుత్ ప్రాజెక్టు వద్దన్న ఉద్యమకారులు కూడా ఈ సెక్షన్‌కిందే అరెస్టయ్యారు. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకునే దీని అమలు విషయంలో ప్రభుత్వం కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరమని న్యాయస్థానం భావించి ఉంటుంది. తీరా మహారాష్ట్ర సర్కారు వెలువరించిన సర్క్యులర్ దాన్ని మరింత జటిలం చేసింది. ప్రభుత్వంపై చేసే సహేతుక విమర్శను కూడా అది నేరంగా పరిగణిస్తున్నది. ఏ విమర్శ అయినా ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేసేలా ఉన్నా, అగౌరవపరిచేలా ఉన్నా, కూలదోసేలా ఉన్నా అలాంటి విమర్శ నేరమే అవుతుందని, అలాంటి విమర్శ చేసిన వారిపై ఈ సెక్షన్‌కింద కేసు పెట్టొచ్చునంటున్నది. మాట్లాడటం ద్వారా, రాయడం ద్వారా లేదా ఇతరత్రా రూపాల్లో ప్రభుత్వానికి చెందిన రాజకీయ నాయకులపై, ఎన్నికైన ప్రజా ప్రతినిధులపై విమర్శలు చేసినప్పుడు ఈ సెక్షన్ వర్తిస్తుందని మార్గదర్శకాలు చెబుతున్నాయి. అయితే విద్వేషం, ధిక్కారం వంటివి లేకుండా చట్ట బద్ధమైన విధానాల ద్వారా ప్రభుత్వంలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నించి నప్పుడు ఈ సెక్షన్ వర్తించదని ముక్తాయించారు. ఏతా వాతా రాజద్రోహం సెక్షన్ అమలును ఇది మరింత విస్తృతపరిచింది. దాన్ని మరింత కఠినం చేసింది. రాజ్యాంగంలో భావ ప్రకటనా స్వేచ్ఛకు వీలు కల్పిస్తున్న 19వ అధికరణ స్ఫూర్తినే ఇది దెబ్బతీస్తున్నది. తమకు ముందున్న కాంగ్రెస్-ఎన్సీపీ ప్రభుత్వ హయాంలో ఈ సర్క్యులర్ రూపకల్పన జరిగిందని ఒకసారి... హోం మంత్రిత్వ శాఖలోని సిబ్బంది అనువాదంలో చేసిన పొరపాటు వల్లే ఇలా జరిగిందని మరోసారి ప్రభుత్వం ఇస్తున్న సంజాయిషీ నిజాన్ని కప్పెట్టలేదు. అసలు ఇలాంటి సెక్షన్‌ను శిక్షాస్మృతిలో ఇంకా కొనసాగిస్తున్నందుకు మన పాలకులు సిగ్గుపడాలి. బ్రిటిష్ వలసపాలకులు ఈ దేశంలో తమ పాలనను సుస్థిరం చేసుకునేందుకూ, ప్రజా ఉద్యమాలను అణగదొక్కేందుకూ 1870లో దీన్ని శిక్షా స్మృతిలో చేర్చారు. బాలగంగాధర్ తిలక్, అనీ బిసెంట్, మహాత్మా గాంధీ తదితర స్వాతంత్య్ర సమర యోధులను బ్రిటిష్ పాలకులు నిర్బంధించారు. మన దేశ పౌరులను ఏళ్ల తరబడి నిర్బంధించి, జాతీయోద్యమాన్ని అణగదొక్కిన అలాంటి సెక్షన్‌ను ఉంచడం ఆ ఉద్యమ స్ఫూర్తికే విరుద్ధమని తొలి తరం పాలకులకు తట్టక పోవడమే ఆశ్చర్యకరం. విచిత్రమేమంటే ఈ తరహా సెక్షన్‌ను బ్రిటన్ పాలకులు దశా బ్దాల క్రితమే తమ శిక్షాస్మృతి నుంచి తొలగించారు. అమెరికా 200 సంవత్సరాల క్రితమే ఈ మాదిరి చట్టాన్ని రద్దు చేసింది. అందరినీ హడలెత్తించి, దబాయించి పాలించవచ్చుననుకుంటే... నిరసన గళాలను అణిచేయొచ్చుననుకుంటే ప్రజాస్వా మ్యంలో చెల్లదని పాలకులు గ్రహించాలి. సర్క్యులర్ సంగతలా ఉంచి అసలు ‘రాజ ద్రోహం’ శిక్షాస్మృతిలోనే ఉండరాదని అందరూ ఉద్యమించాల్సిన అవసరం ఉంది.