టొరంటో: క్యాండిడేట్స్ చెస్ టోర్నీ ఆరో రౌండ్ ఓపెన్ విభాగంలో భారత గ్రాండ్‌మాస్టర్లు ప్రజ్ఞానంద, విదిత్ సంతోష్ గుజరాతీ విజయాలు అందుకోగా... దొమ్మరాజు గుకేశ్ ‘డ్రా’ నమోదు చేశాడు. నిజాత్ అబసోవ్ (అజర్‌బైజాన్)తో జరిగిన గేమ్‌లో తమిళనాడు కుర్రాడు ప్రజ్ఞానంద 45 ఎత్తుల్లో... అలీరెజా ఫిరూజా (ఫ్రాన్స్)తో జరిగిన గేమ్‌లో మహారాష్ట్రకు చెందిన విదిత్ 40 ఎత్తుల్లో గెలుపొందారు.
హికారు నకముర (అమెరికా)తో జరిగిన గేమ్‌ను గుకేశ్ 40 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. ఆరో రౌండ్ తర్వాత గుకేశ్ నాలుగు పాయింట్లతో నిపోమ్‌నిషితో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాడు. మహిళల విభాగం ఆరో రౌండ్‌లో భారత గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, వైశాలి ఓటమి పాలయ్యారు. హంపి 48 ఎత్తుల్లో లె టింగ్జీ (చైనా) చేతిలో... వైశాలి 29 ఎత్తుల్లో కాటరీనా లాగ్నో (రష్యా) చేతిలో ఓడిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment