షార్ప్ షూటర్స్ గెలుపు | santosh achieves 20 points helps to sharp victory in basket ball league | Sakshi
Sakshi News home page

షార్ప్ షూటర్స్ గెలుపు

Published Fri, Jul 22 2016 3:02 PM | Last Updated on Mon, Sep 4 2017 5:51 AM

santosh achieves 20 points helps to sharp victory in basket ball league

క్లబ్ లీగ్ బాస్కెట్‌బాల్


హైదరాబాద్: క్లబ్ లీగ్ బాస్కెట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో షార్ప్ షూటర్స్, సనత్‌నగర్ బాస్కెట్‌బాల్ క్లబ్ జట్లు గెలుపొందాయి. వైఎంసీఏ సికింద్రాబాద్ బాస్కెట్‌బాల్ క్లబ్‌లో గురువారం జరిగిన మ్యాచ్‌లో షార్ప్ షూటర్స్ 75-56తో రైజింగ్ స్టార్స్‌పై గెలిచింది. షూటర్స్ జట్టులో సంతోష్ 20, రోజ్ ఖాన్ 16 పాయింట్లు చేశారు. రైజింగ్ జట్టు తరఫున రాహుల్ (17), కిరణ్ రెడ్డి (14) రాణించారు. సనత్‌నగర్ జట్టు 68-63 స్కోరుతో నేషనల్ పోలీస్ అకాడమీ జట్టును ఓడించింది.

 

సనత్‌నగర్ జట్టులో బసంత్ (21), పృథ్వి (16) ఆకట్టుకున్నారు. ఎన్‌పీఏ జట్టులో రవి 20, మనోజ్ 8 పాయింట్లు చేశారు. మిగతా మ్యాచ్‌ల్లో వైఎంసీఏ సికింద్రాబాద్ 62-28 స్కోరుతో వీజేఐటీపై, గెవిన్ బాస్కెట్‌బాల్ అకాడమీ 48-28తో బెల్లి బాయ్స్ జట్టుపై, యంగ్‌మెన్స్ గిల్డ్ 68-42తో ఫిబా క్లబ్‌పై గెలుపొందాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement