అప్పటివరకు ఆ ఇంట సందడి వాతావరణం. ఇంతలోనే గ్రామదేవతను చూసేందుకు చిన్నారిని తీసుకుని ఇద్దరు మహిళలు బయలుదేరారు. అమ్మవారిని దర్శించుకునే ముందు కాళ్లు కడుక్కునేందుకు బావి వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలో ప్రమాదం బారిన పడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు మృతి చెందారు. ఏడాది వయస్సున్న చిన్నారి ఆచూకీ లభించలేదు. ఈ విషాదకర సంఘటన రేణిగుంట మండలం అల్లిమిట్ట వేమాలమ్మ గుడి ప్రాంతంలో ఆదివారం మధ్యాహ్నం చోటు చేసుకుంది.
రేణిగుంట, న్యూస్‌లైన్: అల్లిమిట్టకు చెందిన రంగనాథం కుమా ర్తె సరళ(20)ను తిరుపతి రూరల్ మండలం చెర్లోపల్లె వాసి రాజాకు ఇచ్చి వివాహం చేశా రు. ఆదివారం కావడంతో సరళ తన భర్త రాజా, ఇద్దరు కుమార్తెలు దీప్తి(3), సారిక(1) లతో అల్లిమిట్టకు వచ్చింది. బిడ్డ ఇంటికి రావడంతో రంగనాథం ఇంట సందడి వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో సరళ తన చిన్నకుమార్తె సారిక, పెదనాన్న కుమార్తె చిట్టె మ్మ అలియాస్ కృష్ణకుమారి(18)తో కలిసి సమీపంలోని వేమాలమ్మ ఆలయానికి ఆదివారం మధ్యాహ్నం బయలుదేరింది.
కాళ్లు కడుక్కునేందుకు ఆలయ సమీపంలోని బావి వద్దకు చేరుకున్నారు. నీరు నిండుగా ఉండడంతో పాచి పట్టి ఉండడాన్ని గుర్తించలేదు. చిన్నారి సహా సరళ, కృష్ణకుమారి బావిలో పడిపోయారు. వీరు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆలయం వద్దకు చేరుకున్నారు. సమీప పొలాల వద్దనున్న రైతులను వివరాలు అడిగారు. ఇద్దరు మహిళలు బిడ్డను తీసుకుని బావి వద్దకు వెళుతుండగా చూశామని వారు తెలిపారు.
దీంతో కుటుంబసభ్యులు బావి వద్దకు చేరుకున్నారు. సరళ, కృష్ణకుమారి మృతదేహాలను బావి నుంచి వెలికితీశారు. ఎంతకీ సారిక ఆచూకీ లభించలేదు. సంఘటన స్థలా న్ని పోలీసులు పరిశీ లించారు. బాధిత కుటుం బాలను సర్పంచ్ పేరూరు మునిరెడ్డి భాగ్యలక్ష్మి, వైఎస్‌ఆర్‌సీపీ నాయకుడు పేరూరు పురుషోత్తంరెడ్డి, మునిరత్నం పరామర్శించారు.
విషాదం
Published Mon, Jan 27 2014 4:20 AM | Last Updated on Sat, Sep 2 2017 3:02 AM
Advertisement
Advertisement