నాలుగేళ్ల వయసులో బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చిన కమల్ హాసన్.. ఇటీవలే నటుడిగా 64 ఏళ్ల సినీ ప్రయాణం పూర్తి చేసుకున్నారు. ఆరు భాషల్లోని చిత్రాల్లో నటించిన ఏకైక హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. బహుభాషా నటుడిగా పేరు తెచ్చుకున్న కమల్ హాసన్ ఇప్పుడు రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉన్నారు. 960లో ‘కలత్తూరు కన్నమ్మ’ సినిమాలో బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చిన కమల్.. ప్రభాస్ నటిస్తోన్న కల్కి చిత్రంలోనూ కీలక పాత్రలో కనిపించనున్నారు. దక్షిణాదిలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న కమల్ హాసన్.. తన వైవాహిక జీవితంలో మాత్రం గెలవలేకపోయారు. రెండు సార్లు పెళ్లి చేసుకున్న కమల్ హాసన్ ఇద్దరికీ విడాకులు ఇచ్చి.. నటి గౌతమితో దాదాపు 13 ఏళ్ల పాటు లివ్ ఇన్ రిలేషన్ షిప్‌లో ఉన్నారు.
బాలనటుడిగా నటించి సినీ రంగ ప్రవేశం చేసిన కమల్‌హాసన్ .. తమిళ సినిమాకు ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ అందించారు. కేవలం నటుడిగానే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌గా, రచయితగా పేరుపొందారు. కమల్ హాసన్ తమిళంతో పాటు మలయాళం, తెలుగు, హిందీ, కన్నడ, బెంగాలీ సినిమాల్లో కూడా నటించారు. అలా సినీ జీవితంలో ఎన్నో విజయాలను చవిచూసిన కమల్ హాసన్ వ్యక్తిగత జీవితంలో ఓడిపోయారు.
శ్రీవిద్యతో పరిచయం
కమల్ కెరీర్ తొలినాళ్లలో మొదట నటి శ్రీవిద్యతో ప్రేమాయణం కొనసాగించారు. అతని కంటే రెండేళ్లు పెద్దదైన శ్రీవిద్యతో కమల్ హాసన్ చాలా సినిమాల్లో నటించారు. వీరిద్దరు కలిసిన నటించిన అపూర్వ రాగంగల్ సూపర్ హిట్‌గా నిలిచింది. అయితే కొన్నేళ్లకే వీరిద్దరి బంధం ముగిసింది. ఆ తర్వాత శ్రీవిద్య మలయాళ చిత్రాలలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్న జార్జ్ థామస్‌ను పెళ్లాడింది. 2006లో శ్రీవిద్య ఆసుపత్రిలో ఉండగా పరామర్శించడానికి వెళ్లిన కమల్ మరోసారి వార్తల్లో నిలిచారు.
వాణి గణపతితో మొదటి పెళ్లి
వాణి గణపతిని ప్రేమించి 1978లో పెళ్లి చేసుకున్నారు కమల్ హాసన్. వాణీ గణపతి శాస్త్రీయ నృత్య కళాకారిణి. అంతా సవ్యంగా సాగుతన్న సమయంలోనే కమల్ హాసన్ జీవితంలోకి సారిక ప్రవేశించింది. దీంతో వాణి గణపతితో 1988లో విడాకులు తీసుకున్నారు.
సారికను రెండో పెళ్లి చేసుకున్న కమల్
అదే ఏడాల్లోనే కమల్ హాసన్ సారికను పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు శృతి హాసన్, అక్షర హాసన్ జన్మించారు. కమల్ హాసన్ తన రెండో భార్యతో అంతా సవ్యంగా సాగుతున్న సమయంలోనే సిమ్రాన్ పేరు తెరపైకి వచ్చింది. దీంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో సారిక డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది. అప్పట్లో సారిక ఆత్మహత్యాయత్నం చేసిందని కూడా కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి. 2002లో వాణితో విడాకుల కోసం దరఖాస్తు చేయగా.. 2004లో అధికారికంగా విడాకులు తీసుకున్నారు. దీంతో 16 ఏళ్ల వివాహాబంధానికి తెరపడింది. ప్రముఖ తమిళ నటి, సిమ్రాన్ బగ్గా సూపర్‌హిట్ చిత్రం పంచతంత్రంతో సహా పలు సినిమాల్లో కమల్ హాసన్‌తో నటించింది. కమల్ వయసులో ఆమె కంటే 22 ఏళ్లు పెద్దవాడు కావడంతో వారిబంధం అప్పట్లో చాలా చర్చనీయాంశమైంది.
గౌతమితో లివ్ ఇన్ రిలేషన్ షిప్
సిమ్రాన్‌కు పెళ్లి కావడంతో ఆ తర్వాత కమల్ హాసన్ గౌతమితో లివ్ ఇన్ రిలేషన్‌లో ఉన్నారు. కాగా.. గౌతమికి అప్పటికే పెళ్లయి ఒక కూతురు ఉంది. గౌతమి కూడా తన భర్తతో విడాకులు తీసుకుంది. రెండుసార్లు వైవాహిక జీవితంలో విఫలమైన కమల్ హాసన్ మూడోసారి పెళ్లి చేసుకోలేదు. దీంతో లివ్-ఇన్ రిలేషన్‌షిప్ కొనసాగించారు. ఈ జంట కొన్ని సినిమాల్లో కలిసి నటించింది. ఇద్దరూ దాదాపు 13 ఏళ్ల పాటు లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్నారు. ఆ తర్వాత మనస్పర్థలు రావడంతో 2017లో తమ బంధానికు గుడ్ బై చెప్పారు. కాగా.. ఆ తర్వాత కమల్ హాసన్ నటించిన విశ్వరూపం సహ నటి పూజా కుమార్‌తో డేటింగ్ చేస్తున్నట్లు రూమర్స్ వినిపించాయి.
Comments
Please login to add a commentAdd a comment