Vani Ganapathy
-
రెండు సార్లు విడాకులు.. మూడోసారి లివ్ ఇన్ రిలేషన్ షిప్.. స్టార్ హీరో లైఫ్ ఇదే!
నాలుగేళ్ల వయసులో బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చిన కమల్ హాసన్.. ఇటీవలే నటుడిగా 64 ఏళ్ల సినీ ప్రయాణం పూర్తి చేసుకున్నారు. ఆరు భాషల్లోని చిత్రాల్లో నటించిన ఏకైక హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. బహుభాషా నటుడిగా పేరు తెచ్చుకున్న కమల్ హాసన్ ఇప్పుడు రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉన్నారు. 960లో ‘కలత్తూరు కన్నమ్మ’ సినిమాలో బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చిన కమల్.. ప్రభాస్ నటిస్తోన్న కల్కి చిత్రంలోనూ కీలక పాత్రలో కనిపించనున్నారు. దక్షిణాదిలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న కమల్ హాసన్.. తన వైవాహిక జీవితంలో మాత్రం గెలవలేకపోయారు. రెండు సార్లు పెళ్లి చేసుకున్న కమల్ హాసన్ ఇద్దరికీ విడాకులు ఇచ్చి.. నటి గౌతమితో దాదాపు 13 ఏళ్ల పాటు లివ్ ఇన్ రిలేషన్ షిప్లో ఉన్నారు. బాలనటుడిగా నటించి సినీ రంగ ప్రవేశం చేసిన కమల్‌హాసన్ .. తమిళ సినిమాకు ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ అందించారు. కేవలం నటుడిగానే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌గా, రచయితగా పేరుపొందారు. కమల్ హాసన్ తమిళంతో పాటు మలయాళం, తెలుగు, హిందీ, కన్నడ, బెంగాలీ సినిమాల్లో కూడా నటించారు. అలా సినీ జీవితంలో ఎన్నో విజయాలను చవిచూసిన కమల్ హాసన్ వ్యక్తిగత జీవితంలో ఓడిపోయారు. శ్రీవిద్యతో పరిచయం కమల్ కెరీర్ తొలినాళ్లలో మొదట నటి శ్రీవిద్యతో ప్రేమాయణం కొనసాగించారు. అతని కంటే రెండేళ్లు పెద్దదైన శ్రీవిద్యతో కమల్ హాసన్ చాలా సినిమాల్లో నటించారు. వీరిద్దరు కలిసిన నటించిన అపూర్వ రాగంగల్ సూపర్ హిట్‌గా నిలిచింది. అయితే కొన్నేళ్లకే వీరిద్దరి బంధం ముగిసింది. ఆ తర్వాత శ్రీవిద్య మలయాళ చిత్రాలలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్న జార్జ్ థామస్‌ను పెళ్లాడింది. 2006లో శ్రీవిద్య ఆసుపత్రిలో ఉండగా పరామర్శించడానికి వెళ్లిన కమల్ మరోసారి వార్తల్లో నిలిచారు. వాణి గణపతితో మొదటి పెళ్లి వాణి గణపతిని ప్రేమించి 1978లో పెళ్లి చేసుకున్నారు కమల్ హాసన్. వాణీ గణపతి శాస్త్రీయ నృత్య కళాకారిణి. అంతా సవ్యంగా సాగుతన్న సమయంలోనే కమల్ హాసన్ జీవితంలోకి సారిక ప్రవేశించింది. దీంతో వాణి గణపతితో 1988లో విడాకులు తీసుకున్నారు. సారికను రెండో పెళ్లి చేసుకున్న కమల్ అదే ఏడాల్లోనే కమల్ హాసన్ సారికను పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు శృతి హాసన్, అక్షర హాసన్ జన్మించారు. కమల్ హాసన్ తన రెండో భార్యతో అంతా సవ్యంగా సాగుతున్న సమయంలోనే సిమ్రాన్ పేరు తెరపైకి వచ్చింది. దీంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో సారిక డిప్రెషన్లోకి వెళ్లిపోయింది. అప్పట్లో సారిక ఆత్మహత్యాయత్నం చేసిందని కూడా కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి. 2002లో వాణితో విడాకుల కోసం దరఖాస్తు చేయగా.. 2004లో అధికారికంగా విడాకులు తీసుకున్నారు. దీంతో 16 ఏళ్ల వివాహాబంధానికి తెరపడింది. ప్రముఖ తమిళ నటి, సిమ్రాన్ బగ్గా సూపర్‌హిట్ చిత్రం పంచతంత్రంతో సహా పలు సినిమాల్లో కమల్ హాసన్‌తో నటించింది. కమల్ వయసులో ఆమె కంటే 22 ఏళ్లు పెద్దవాడు కావడంతో వారిబంధం అప్పట్లో చాలా చర్చనీయాంశమైంది. గౌతమితో లివ్ ఇన్ రిలేషన్ షిప్ సిమ్రాన్‌కు పెళ్లి కావడంతో ఆ తర్వాత కమల్ హాసన్ గౌతమితో లివ్ ఇన్ రిలేషన్లో ఉన్నారు. కాగా.. గౌతమికి అప్పటికే పెళ్లయి ఒక కూతురు ఉంది. గౌతమి కూడా తన భర్తతో విడాకులు తీసుకుంది. రెండుసార్లు వైవాహిక జీవితంలో విఫలమైన కమల్ హాసన్ మూడోసారి పెళ్లి చేసుకోలేదు. దీంతో లివ్-ఇన్ రిలేషన్షిప్ కొనసాగించారు. ఈ జంట కొన్ని సినిమాల్లో కలిసి నటించింది. ఇద్దరూ దాదాపు 13 ఏళ్ల పాటు లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్నారు. ఆ తర్వాత మనస్పర్థలు రావడంతో 2017లో తమ బంధానికు గుడ్ బై చెప్పారు. కాగా.. ఆ తర్వాత కమల్ హాసన్ నటించిన విశ్వరూపం సహ నటి పూజా కుమార్‌తో డేటింగ్ చేస్తున్నట్లు రూమర్స్ వినిపించాయి. -
కమల్ దివాళాకు నేను కారణం కాదు!
‘‘భర్త నుంచి విడాకులు పొందాక దక్కే మనోవర్తి వల్ల ఒక మహిళ జీవితాంతం సకల సౌకర్యాలతో ఉండగలుగుతుందా? అలాగే, మనోవర్తి ఇవ్వడం వల్ల ఆ మగవాడు దివాళా తీసేస్తాడా? దివాళా తీసినా ఫరవాలేదు. ఆ మహిళ సౌకర్యవంతంగా స్థిరపడితే చాలనే విధంగా కోర్టు తీర్పునిస్తుందా? ఆశ్చర్యంగా ఉంది’’ అని వాణీగణపతి అంటున్నారు. స్వతహాగా గొప్ప శాస్త్రీయ నృత్య కళాకారిణి అయిన ఆమె కమల్‌హాసన్ మాజీ భార్య అనే విషయం తెలిసిందే. వారిద్దరూ విడిపోయి పాతికేళ్లకు పైనే అయ్యింది. విడాకుల కారణంగా తాను దివాళా తీసినట్లు ఇటీవల ఓ సందర్భంలో కమల్ పేర్కొనడం చర్చనీయాంశమైంది. ఈ చర్చలు వాణీ గణపతి వరకూ వెళ్లాయి. ‘‘నాకు విడాకులిచ్చాక అద్దె ఇంటికి మారాల్సి వచ్చిందని ఆయన పేర్కొనడం విచిత్రంగా ఉంది. అసలు అప్పట్లో కమల్‌కి సొంత ఇల్లు ఉన్నదెప్పుడు? మేము కూడా అద్దె ఇంట్లోనే ఉండేవాళ్లం’’ అని కమల్‌కి గట్టిగానే జవాబిచ్చారామె. ఒకవేళ కూతుళ్ళ దగ్గర జాలి కబుర్లు చెప్పి, అభిమానం కొట్టేయడానికే ఆయన అలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటారేమోనని కూడా వాణి పేర్కొన్నారు. ఏదైనా జరగకూడనిది జరిగితే ఆ తప్పును ఇతరులపై సులువుగా మోపేయడం ఆయనకు అలవాటనీ, దివాళా తీయడానికి విడాకులు కాకుండా వేరే కారణాలు ఉండి ఉంటాయనీ ఆమె ఘాటుగా స్పందించారు. ఒకవేళ నాకు భారీ ఎత్తున మనోవర్తి దక్కి ఉంటే, ఈపాటికి బెంగళూరులో మంచి లగ్జరీ ఏరియాలో విలాసవంతమైన ఇంట్లో ఉండి ఉండేదాన్ననీ, ఇప్పుడు ఉంటున్న ఇల్లు తన సొంత డబ్బుతో కొనుక్కున్నాననీ వాణి స్పష్టం చేశారు. -
ఫుట్‌పాత్‌లపై డ్రైవింగ్ వద్దు
శాస్త్రీయ నృత్య కళాకారిణి వాణి గణపతి సాక్షి ప్రతినిధి, బెంగళూరు : నగరంలో ఇటీవల ఫుట్‌పాత్‌లపై బైక్‌లను నడుపుకుంటూ వెళ్లడం సాధారణమై పోయిందని, ఈ పోకడను విడనాడాలని ప్రముఖ భరత నాట్య కళాకారిణి వాణి గణపతి కోరారు. ప్రముఖ 3డీ యానిమేషన్ సంస్థ మాయా అకాడమీ ఆఫ్ అడ్వాన్స్డ్ సినిమాటిక్స్ (మ్యాక్) న గర ట్రాఫిక్ పోలీసుల గురించి తీసిన 17 నిముషాల డాక్యుమెంటరీని ఇక్కడి అదనపు కమిషనర్ (ట్రాఫిక్) కార్యాలయంలో బుధవారం సాయంత్రం ప్రదర్శించిన సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ట్రాఫిక్‌లో ఇబ్బందులకు అందరూ పోలీసులనే నిందిస్తారని చెబుతూ, ఎవరికి వారు తాము ముందు వెళ్లిపోవాలనే ఆత్రుతే అన్ని అనర్థాలకు కారణమవుతోందని తెలిపారు. కనుక ప్రజలు మేల్కొని ట్రాఫిక్‌లో ఇబ్బందులు తలెత్తకుండా చూడాల్సి ఉందన్నారు. నగరంలో రాజకీయ పార్టీల బహిరంగ సభల సందర్భంగా ట్రాఫిక్ అస్తవ్యస్తమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశాల వేదికలను నగర శివార్లలోకి మార్చుకోవాలని ఆమె కోరారు. నగర పోలీసు కమిషనర్ రాఘవేంద్ర ఔరాద్కర్ మాట్లాడుతూ పోలీసు ఉద్యోగం పెద్ద సవాలు లాగా తయారైందని అన్నారు. ట్రాఫిక్ ప్రధాన సవాలుగా మారుతోందని తెలిపారు. నగరంలో ప్రస్తుతం 53 లక్షల వరకు రిజిస్టరైన వాహనాలున్నాయని వెల్లడించారు. వీటికి తోడు ఇతర జిల్లాల నుంచి కూడా వాహనాలు వస్తుంటాయన్నారు. దేశంలో ఇంత పెద్ద సంఖ్యలో వాహనాలు ఏ నగరంలోనూ లేవని తెలిపారు. అసలు..ఆసియాలో కూడా ఏ నగరంలోనూ ఇన్ని వాహనాలు లేవని చెబుతుంటారని, అయితే దీనికి కచ్చితమైన ఆధారాలు లేవని చెప్పారు. పోలీసులు రోజుకు 14 నుంచి 16 గంటలు అలుపెరగక విధులు నిర్వర్తించాల్సి వస్తోందని ఆయన వాపోయారు. అదనపు కమిషనర్ (ట్రాఫిక్) బీ. దయానంద్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మ్యాక్‌కు చెందిన 14 మంది విద్యార్థులు మూడు నెలల పాటు శ్రమించి ఈ డాక్యుమెంటరీని రూపొందించారు.