gowthami
-
రెండు సార్లు విడాకులు.. మూడోసారి లివ్ ఇన్ రిలేషన్ షిప్.. స్టార్ హీరో లైఫ్ ఇదే!
నాలుగేళ్ల వయసులో బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చిన కమల్ హాసన్.. ఇటీవలే నటుడిగా 64 ఏళ్ల సినీ ప్రయాణం పూర్తి చేసుకున్నారు. ఆరు భాషల్లోని చిత్రాల్లో నటించిన ఏకైక హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. బహుభాషా నటుడిగా పేరు తెచ్చుకున్న కమల్ హాసన్ ఇప్పుడు రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉన్నారు. 960లో ‘కలత్తూరు కన్నమ్మ’ సినిమాలో బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చిన కమల్.. ప్రభాస్ నటిస్తోన్న కల్కి చిత్రంలోనూ కీలక పాత్రలో కనిపించనున్నారు. దక్షిణాదిలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న కమల్ హాసన్.. తన వైవాహిక జీవితంలో మాత్రం గెలవలేకపోయారు. రెండు సార్లు పెళ్లి చేసుకున్న కమల్ హాసన్ ఇద్దరికీ విడాకులు ఇచ్చి.. నటి గౌతమితో దాదాపు 13 ఏళ్ల పాటు లివ్ ఇన్ రిలేషన్ షిప్లో ఉన్నారు. బాలనటుడిగా నటించి సినీ రంగ ప్రవేశం చేసిన కమల్‌హాసన్ .. తమిళ సినిమాకు ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ అందించారు. కేవలం నటుడిగానే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌గా, రచయితగా పేరుపొందారు. కమల్ హాసన్ తమిళంతో పాటు మలయాళం, తెలుగు, హిందీ, కన్నడ, బెంగాలీ సినిమాల్లో కూడా నటించారు. అలా సినీ జీవితంలో ఎన్నో విజయాలను చవిచూసిన కమల్ హాసన్ వ్యక్తిగత జీవితంలో ఓడిపోయారు. శ్రీవిద్యతో పరిచయం కమల్ కెరీర్ తొలినాళ్లలో మొదట నటి శ్రీవిద్యతో ప్రేమాయణం కొనసాగించారు. అతని కంటే రెండేళ్లు పెద్దదైన శ్రీవిద్యతో కమల్ హాసన్ చాలా సినిమాల్లో నటించారు. వీరిద్దరు కలిసిన నటించిన అపూర్వ రాగంగల్ సూపర్ హిట్‌గా నిలిచింది. అయితే కొన్నేళ్లకే వీరిద్దరి బంధం ముగిసింది. ఆ తర్వాత శ్రీవిద్య మలయాళ చిత్రాలలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్న జార్జ్ థామస్‌ను పెళ్లాడింది. 2006లో శ్రీవిద్య ఆసుపత్రిలో ఉండగా పరామర్శించడానికి వెళ్లిన కమల్ మరోసారి వార్తల్లో నిలిచారు. వాణి గణపతితో మొదటి పెళ్లి వాణి గణపతిని ప్రేమించి 1978లో పెళ్లి చేసుకున్నారు కమల్ హాసన్. వాణీ గణపతి శాస్త్రీయ నృత్య కళాకారిణి. అంతా సవ్యంగా సాగుతన్న సమయంలోనే కమల్ హాసన్ జీవితంలోకి సారిక ప్రవేశించింది. దీంతో వాణి గణపతితో 1988లో విడాకులు తీసుకున్నారు. సారికను రెండో పెళ్లి చేసుకున్న కమల్ అదే ఏడాల్లోనే కమల్ హాసన్ సారికను పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు శృతి హాసన్, అక్షర హాసన్ జన్మించారు. కమల్ హాసన్ తన రెండో భార్యతో అంతా సవ్యంగా సాగుతున్న సమయంలోనే సిమ్రాన్ పేరు తెరపైకి వచ్చింది. దీంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో సారిక డిప్రెషన్లోకి వెళ్లిపోయింది. అప్పట్లో సారిక ఆత్మహత్యాయత్నం చేసిందని కూడా కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి. 2002లో వాణితో విడాకుల కోసం దరఖాస్తు చేయగా.. 2004లో అధికారికంగా విడాకులు తీసుకున్నారు. దీంతో 16 ఏళ్ల వివాహాబంధానికి తెరపడింది. ప్రముఖ తమిళ నటి, సిమ్రాన్ బగ్గా సూపర్‌హిట్ చిత్రం పంచతంత్రంతో సహా పలు సినిమాల్లో కమల్ హాసన్‌తో నటించింది. కమల్ వయసులో ఆమె కంటే 22 ఏళ్లు పెద్దవాడు కావడంతో వారిబంధం అప్పట్లో చాలా చర్చనీయాంశమైంది. గౌతమితో లివ్ ఇన్ రిలేషన్ షిప్ సిమ్రాన్‌కు పెళ్లి కావడంతో ఆ తర్వాత కమల్ హాసన్ గౌతమితో లివ్ ఇన్ రిలేషన్లో ఉన్నారు. కాగా.. గౌతమికి అప్పటికే పెళ్లయి ఒక కూతురు ఉంది. గౌతమి కూడా తన భర్తతో విడాకులు తీసుకుంది. రెండుసార్లు వైవాహిక జీవితంలో విఫలమైన కమల్ హాసన్ మూడోసారి పెళ్లి చేసుకోలేదు. దీంతో లివ్-ఇన్ రిలేషన్షిప్ కొనసాగించారు. ఈ జంట కొన్ని సినిమాల్లో కలిసి నటించింది. ఇద్దరూ దాదాపు 13 ఏళ్ల పాటు లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్నారు. ఆ తర్వాత మనస్పర్థలు రావడంతో 2017లో తమ బంధానికు గుడ్ బై చెప్పారు. కాగా.. ఆ తర్వాత కమల్ హాసన్ నటించిన విశ్వరూపం సహ నటి పూజా కుమార్‌తో డేటింగ్ చేస్తున్నట్లు రూమర్స్ వినిపించాయి. -
దృశ్యం రీమేక్: కమల్ హాసన్ ‘పాపనాశం’ సీక్వెల్‌కు ప్లాన్!
జీతూ జోసెఫ్ దర్శకత్వంలో మలయాళంలో ఘనవిజయం సాధించిన థ్రిల్లర్ ‘దృశ్యం’. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో రీమేక్ అయి, మంచి హిట్ అందుకున్న విషయం తెలిసిందే. తెలుగు ‘దృశ్యం’కి శ్రీప్రియ దర్శకత్వం వహించగా, వెంకటేశ్-మీనా జోడీగా నటించారు. తమిళంలో ‘పాపనాశం’ పేరుతో కమల్‌హాసన్-గౌతమి జంటగా జీతూ జోసెఫ్ తెరకెక్కించారు. కాగా ‘దృశ్యం’ చిత్రానికి సీక్వెల్‌గా జీతూ జోసెఫ్ దర్శకత్వంలో మలయాళ, తెలుగు భాషల్లో ‘దృశ్యం 2’ రూపొందింది. మలయాళంలో ఇప్పటికే విడుదలైంది. తెలుగు ‘దృశ్యం 2’ రీమేక్ పూర్తయి, విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పుడు జీతూ తమిళ రీమేక్‌ని ప్లాన్ చేస్తున్నారట. రెండో భాగంలోనూ కమల్‌హాసన్ కథానాయకుడిగా నటించనున్నారట. అయితే మొదటి భాగంలో ఆయనకు భార్యగా నటించిన గౌతమి సీక్వెల్లో నటిస్తారా? అనే చర్చ ఆరంభమైంది. కమల్–గౌతమి తమ స్నేహానికి ఫుల్స్టాప్ పెట్టిన విషయం, కమల్ ఇంట్లోనే ఉంటూ వచ్చిన గౌతమి ఆ ఇంటి నుంచి బయటకు రావడం తెలిసిందే. ఈ నేపథ్యంలో గౌతమి నటిస్తారా? అసలు దర్శకుడికి ఆమెను తీసుకోవాలని ఉందా? అనే ప్రశ్నలకు త్వరలోనే సమాధానం దొరుకుతుంది. చదవండి: కరోనాపై వరలక్ష్మి శరత్‌కుమార్ అవగాహన -
క్యాన్సర్ రోగులకు గౌతమి పరామర్శ
పెనమలూరు: క్యాన్సర్ వ్యాధిని తొలిదశలోనే గుర్తిస్తే చికిత్స ద్వారా పూర్తిస్థాయిలో కోలుకోవచ్చని సినీనటి లైప్ అగైన్ ఫౌండేన్ చైర్పర్సన్ టి.గౌతమి సూచించారు. ఆమె శనివారం కానూరు అశోక్‌నగర్‌లో రూట్స్ హెల్త్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. రూట్స్ ఉచిత సంరక్షణ కేంద్రంలో క్యాన్సర్ బాధితులను పరామర్శించి పండ్లు, దుప్పట్లు అందజేశారు. క్యాన్సర్ బాధితులకు సేవలు అందిస్తున్న రూట్స్ ఫౌండేషన్‌కు అభినందనలు తెలిపారు. ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ పోలవరపు విజయభాస్కర్ మాట్లాడుతూ పదేళ్లుగా క్యాన్సర్ బాధితులకు సేవచేస్తున్నామని పేర్కొన్నారు. రూట్స్ హాస్పిల్ చైర్మన్ అన్నే శివనాగేశ్వరరావు, డాక్టర్ పద్మజ, రూట్స్ కన్వీనర్ కె.మాధవి, రామకృష్ణప్రసాద్ పాల్గొన్నారు. -
గౌతమి హత్య కేసా.. తెలీదే ! : నన్నపనేని
సాక్షి, ఏలూరు : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన సంఘటన గౌతమి హత్య. పోలీసులు తమకు న్యాయం చేయట్లేదంటూ గౌతమి తల్లిదండ్రలు పోరాడటంతో కేసును విచారించిన సీఐడీ సంచలన విషయాలను వెల్లడించింది. కేసులను తప్పుదారి పట్టించబోయిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకునేందుకు ఆ శాఖ ఉన్నతాధికారులు సిద్దమైనట్లు జోరుగా వార్తలు సైతం వచ్చాయి. అయితే ఈ సంఘటన గురించి మహిళా కమీషన్ ఛైర్పర్సన్ నన్నపనేని రాజకుమారికి తెలియదంట. గౌతమి హత్యకు గురౌందన్న విషయం తనకు ఇప్పటి వరకూ తెలియదని నన్నపనేని అనడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. వివరాల్లోకి వెళ్తే.. శుక్రవారం ఆమె ఏలూరు పట్టణంలో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికి జిల్లా పరిషత్ అతిథి గృహంలో ఆమె విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో మహిళలపై జరుగుతున్న దారుణాలపై ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమయంలోనే విలేకర్లు గౌతమి హత్య గురించి ప్రస్తావించగా ఆమె చెప్పిన విషయం అందరినీ విస్మయ పరిచింది. పైగా ఏం జరిగిందంటూ నన్నపనేని తిరిగి వాళ్లనే ప్రశ్నించారు. దీంతో అక్కడ ఉన్నవాళ్లు ఒక్కసారిగా విస్తుపోయారు. మీడియా ప్రతినిథులు విషయాన్ని వివరించడంతో స్పందించిన ఆమె.. ఇప్పటికైనా ఎవరైనా ఫిర్యాదు చేస్తే కచ్చితంగా విచారణ చేస్తామని, లేని పక్షంలో ఎవరూ ఏమీ చేయలేరంటూ చేతులెత్తేశారు. -
మేం విడిపోవడానికి శ్రుతీహాసన్ కారణం కాదు
కమల్‌హాసన్–శ్రీదేవి బ్రేక్ కే బాద్ మళ్లీ కలిశారా? కమల్ పొలిటికల్ లైఫ్‌లో గౌతమికి స్థానం ఉందా? కమల్ ఆరంభించిన పొలిటికల్ పార్టీ ‘మక్కళ్ నీది మయమ్’కి గౌతమి సపోర్ట్ చేయబోతున్నారా? అటు చెన్నై ఇటు హైదరాబాద్ ఫిల్మ్‌నగర్‌లో ఒకటే చర్చ. ఈ చర్చకు గౌతమి ఫుల్స్టాప్ పెట్టారు. కమల్‌తో ఇప్పుడు తనకెలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారామె. సోషల్ మీడియా ద్వారా గౌతమి తన మనోభావాలను పంచుకున్నారు. ‘‘పాస్ట్ ఈజ్ పాస్ట్ అండ్ దేర్ ఆర్ రీజన్స్ ఫర్ ఇట్’’ అంటూ ఈ నెల 24న ఓ లెటర్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారామె. ‘‘ఎవరి గురించైనా నేను ఏదైనా చెబుతున్నానంటే తప్పకుండా ఓ కారణం ఉంటుంది. 30 ఏళ్లుగా నన్ను తెలిసినవారికి నేనేంటో బాగా తెలుసు’’ అంటూ ‘ప్రూఫ్ అండ్ జడ్జ్మెంట్స్’ అంటూ మరో లెటర్‌ను మంగళవారం పోస్ట్ చేశారు గౌతమి. ఈ రెండు ఉత్తరాల ద్వారా ఆమె తన జీవితంలోని కొన్ని విషయాలను చెప్పుకొచ్చారు. వాటిలో కొన్ని సంగతులు.. ►మిస్టర్ కమల్‌హాసన్‌కు నా సపోర్ట్ లభిస్తుందన్న వార్తల్లో నిజం లేదు. ఆల్మోస్ట్ మా 13ఏళ్ల రిలేషన్‌షిప్‌కు 2016లో ఫుల్స్టాప్ పడింది. ప్రస్తుతం పర్శనల్‌గా కానీ ప్రొఫెషనల్‌గా కానీ మరే విధంగా కానీ మిస్టర్ కమల్‌హాసన్‌తో నాకు ఎటువంటి సంబంధాలు లేవు. ప్రస్తుతం నా కూతురి (సుబ్బలక్ష్మి) భవిష్య , ఆర్థిక వనరులపైనే దృష్టిపెట్టాను ►మిస్టర్ కమల్‌హాసన్‌తో నా రిలేషన్షిప్ బ్రేక్ అవ్వడానికి మూడో వ్యక్తి ఎవరూ కారణం కాదు. మా బంధం చెడిపోవడానికి శ్రుతీహాసన్ కారణం అని చాలామంది చెప్పుకుంటున్నారని విన్నాను. అదేం లేదు. మేం విడిపోవడానికి పిల్లలెవరూ కారణం కాదు. శ్రుతి, అక్షరలను నేనిప్పటికీ పిల్లలుగానే చూస్తాను. అయినా.. ఇద్దరు పెద్దవాళ్లు ఒక రిలేషన్షిప్ నుంచి విడిపోవడానికి పిల్లలు కారణం కారనే నేను నమ్ముతాను. మిస్టర్ కమల్‌హాసన్ కొన్ని కొత్త కమిట్మెంట్స్ తీసుకున్నారు. అవి నా ఆలోచనలకు సరిపడలేదు. పైగా నా ఆత్మగౌరవం దెబ్బతింటుందన్న భావన కలిగింది. ఆత్మాభిమానాన్ని వదులుకోదలచుకోలేదు. మా రిలేషన్ చెడిపోవడానికి ఇదొక్కటే కారణం. ►రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ (కమల్‌హాసన్ సొంత నిర్మాణ సంస్థ) నిర్మించిన సినిమాలకు, మిస్టర్ కమల్‌హాసన్ బయట సంస్థల్లో నటించిన సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా వర్క్ చేశాను. అప్పట్లో నా ఇన్కమ్ సోర్స్‌లో మేజర్ ఇదే. అయితే ‘దశావతారం, విశ్వరూపం’.. మరికొన్ని సినిమాలకు సంబంధించిన కొంత పారితోషికం ఇంకా రావాల్సి ఉంది. ►ప్రస్తుతం నా దృష్టంతా నేను నిర్వహిస్తున్న ‘లైఫ్ ఎగైన్ ఫౌండేషన్’, నా కూతురు భవిష్యత్ మీదే. నన్ను సపోర్ట్ చేస్తున్న అందరికీ ధన్యవాదాలు. -
గౌతమి గోదావరిలో ఇద్దరు గల్లంతు
సాక్షి, ఆలమూరు: స్నానం కోసం గౌతమి గోదావరి నదిలో దిగిన ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలంలో జరిగింది. మండలంలోని జొన్నాడ గ్రామానికి చెందిన తలారి ధర్మేంద్ర, గంటా వికాస్ అనే యువకులు గౌతమి గోదావరి నదిలో స్నానానికి దిగారు. అయితే లోతు ఎక్కువ ఉండడం, ఈత రాకపోవడంతో వారు గల్లంతయ్యారు. వీరి కోసం స్థానికులు, పోలీసులు గజ ఈతగాళ్ల సాయంతో గాలిస్తున్నారు. -
కేంద్రమంత్రిని కలిసిన నటి గౌతమి
సాక్షి, న్యూఢిల్లీ: నటి గౌతమి బుధవారం సాయంత్రం కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్‌ను కలిశారు. అయితే, భేటీలో ఏ విషయంపై చర్చించారన్న దానిపై క్లారిటీ లేదు. కాగా, గౌతమి బీజేపీలో చేరుతారనే ఊహాగానాలు ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె జవదేకర్‌తో సమావేశం కావడం ఆసక్తికరంగా మారింది. -
వారసుడు పన్నీరు సెల్వమే..!
పన్నీర్ సెల్వమే నా తదనంతర ముఖ్యమంత్రి అని అమ్మే చెప్పారు. సెల్వంను అమ్మ దూరం పెట్టడం, పార్టీ నుంచి గెంటేయడం, తన దరిదాపుల్లోకి రాకూడదని చెప్పడం లాంటివి ఒక్కసారైనా జరిగాయా? తమిళనాడు రాజకీయాల్లో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ఏమాత్రం మంచివి కాదని, జయలలిత రాజ కీయ ఎంపిక ఇప్పటికీ పన్నీరు సెల్వమేనని, ఆయన ముఖ్యమంత్రిగా ఉంటేనే రాష్ట్ర ప్రజలు జయలలితకు ఇచ్చిన తీర్పునకు గౌరవం ఉంటుందని ప్రముఖ నటి గౌతమి తేల్చి చెబుతున్నారు. శశికళ రాజకీయాలు, ముఖ్యంగా ఎమ్మెల్యేల తరలింపు అనేవి తమిళనాడుకు సంబంధించినంతవరకు మంచి సంప్రదాయం కాదని ఆమె చెబుతున్నారు. తమిళ ప్రజలు గతంలో ఎన్నడూ చూడని సంక్షోభంలో తమిళ రాజకీయాలు చిక్కుకున్న నేపథ్యంలో ఒకవైపు శశికళ, మరోవైపు పన్నీర్ సెల్వం మధ్య అన్నాడీఎంకేలో జరుగుతున్న ఈ కుమ్ములాట గురించి సాక్షి పత్రికకు గౌతమి ఇచ్చిన ఇంటర్వూ్యలోని ముఖ్యాంశాలు.... తమిళనాడు ప్రస్తుత పరిణామాలకు కారణం ఎవరు? నేటి తమిళనాడు రాజకీయ పరిస్థితులకు కారణం ఒకరిపై పెట్టి చూపలేం. రాజకీయం చాలా అరుదైన పరిస్థితుల్లోనే ఏకముఖంగా నడుస్తుంటుంది. చాలా బాధాకరమైన విషయం ఏమిటంటే ఇన్ని విష యాలు ఇంతవరకు ప్రజలకు తెలీకుండా పోవటం. ప్రజాస్వామ్యంలో ఇంత స్పష్టత లేకపోవడం చాలా బాధ కలిగిస్తోంది. అయిదేళ్ల పాలనా కాలంలో ప్రతి క్షణం ప్రజలకు బాధ్యత పడాలనేది గుర్తుంచుకో వాలి. అయితే చాలా కాలంగా ప్రభుత్వాలు ఈ విషయం మర్చిపోయినట్లనిపిస్తుంది. పార్టీలో సంక్షోభానికి కారణం శశికళా? సెల్వమా? తమిళనాడు చరిత్రలో పదవిలో ఉన్నవారు వరు సగా రెండోసారి మళ్లీ అధికారంలోకి రావడం చాలా అరుదు. అమ్మ అలా రెండోసారి గెలిచారు. పెద్ద మార్జిన్‌తో గెలిచారామె. ప్రజలకు ఆమెపట్ల ఉన్న నమ్మకం అలాంటిది. రాష్ట్రంలోని ప్రజలందరి మేలు కోరే భరోసా ఆమె మీద పెట్టామన్న ఆలోచనతోటే ప్రజలు తిరుగులేని విధంగా తీర్పు చెప్పారు. అలాంటి అమ్మే ఇప్పుడు లేరు. తన తర్వాత ఆమె ఎవరిని చూపించారు. మీకోసం నేను చేయాలనుకు న్నది నా మార్గంలో చేయగలిగేవారు వీరు అని చాలాసార్లు ఆమె పన్నీరు సెల్వంనే చూపించారు. తన విజన్‌ని సాధ్యం చేయగల వ్యక్తి ఎవరో అమ్మే తేల్చిచెప్పాక దాన్ని కొనసాగించడమే ధర్మం. సెల్వంను శశికళ తప్పించిన విధానం సరైందేనా? ఈరోజు మనం చూస్తున్న పరిణామాలు సరైన పద్ధతిలో జరిగాయి అని ఎవరైనా చెప్పగలుగు తారా? పార్టీ ప్రధాన కార్యదర్శి ఎంపిక కూడా తాత్కాలిక ప్రాతిపదికనే జరిగింది అని ఇవ్వాళ తెలు స్తోంది. ఇలాంటి రహస్యాలు ఇంకా ఎన్ని ఉన్నా యి? పార్టీవరకు మాత్రమే అయితే అది అంతర్గత విషయం. కానీ ప్రజలను పాలించవలసిన సంద ర్భం వచ్చేసరికి అది అంతర్గత విషయంగా ఉండ దు. అది మన రోజువారీ జీవితాన్ని ప్రతి క్షణమూ ప్రభావితం చేసే నిర్ణయం. అలాంటి నిర్ణయం తీసు కునే హక్కు ప్రజలకు మాత్రమే ఉంది. వారు తమ నిర్ణయాన్ని చెప్పేశారు. ఆ నిర్ణయాన్ని మార్చే అధి కారం ప్రజలకే తప్ప మరెవరికీ లేదు. జయలలిత వారసురాలు శశికళేనా? అమ్మ అన్నిసార్లు చేయెత్తి చూపి మరీ పన్నీర్ సెల్వమే నా తదనంతర సీఎం అని చెప్పిన తర్వాత ఆమె వారసురాలు వీరు, వారు, మరొకరు అని ఎలా అనుకుంటాం? ఇన్నేళ్లుగా సెల్వం అమ్మతో ఉన్నారు. ఆయన్ని అమ్మ దూరం చేయడం, పార్టీ నుంచి బయటకు గెంటడం, తన దరిదాపుల్లోకి రాకూడదని చెప్పడం.. ఒక్కసారైనా జరిగిందా.. ఆయన స్థిరత్వం, విశ్వాసం, ముక్కుసూటితనమే కదా అమ్మ ఆయన్ని నమ్మడానికి కారణం. మీ మద్దతు పన్నీరు సెల్వంకేనా? తప్పకుండా. అది అమ్మ నిర్ణయం. ఓటు అమ్మకు వేశారు. అందరి నమ్మకం ఆమె మీదే ఉంది. ఎమ్మెల్యేలు నాతోటే ఉన్నారని శశికళ చెబుతున్నారే? మనస్సాక్షి అనేది ఉంటే దాని మాట మనం విని, ఆ ప్రకారం నడిస్తేనే.. మనల్ని మనం మనిషి అని చెప్పుకునే హక్కు ఉంటుంది. అర్హత ఉంటుంది మనకు. డబ్బు ప్రభావాలు చాలా వస్తుంటాయి. పోతుంటాయి. కానీ మనిషిగా, మానవత్వంతో ఆలోచించి నిర్ణయించుకోవడమే జీవితంలో అతి పెద్ద విశ్వసనీయత. ఎమ్మెల్యేలను బస్సుల్లో తరలించడం ఏమిటి? విషాదకరం. అత్యంత విషాదకరం. ఇలాంటి కథలు మనం ఎక్కడో, ఎప్పుడో విని ఉండవచ్చు. ఇతర రాష్ట్రాల్లో ఇలా జరిగింది అని విన్నాం. కాని తమిళనాడులో ఈరోజు అదే జరుగుతోంది అని ఒక రూమర్ వచ్చినా అది బాధాకరమండి. దీనిగురించి ఆలోచించాలన్నా బాధ కలుగుతోంది. ఎమ్మెల్యేల మద్దతుతో శశికళే సీఎం అయితే? అలా జరగదని నేను నమ్ముతున్నాను. మానవత్వం మీద నాకు చాలా నమ్మకం ఉంది. ఒకవేళ దానికి భిన్నంగా జరిగితే, ఎమ్మెల్యేల దన్నుతో శశికళ సీఎం అయితే అది కచ్చితంగా అమ్మమీద ఉన్న తీర్పు కాదు. ప్రజలు ఇచ్చిన తీర్పు కాదది. పన్నీర్ సెల్వమే నెగ్గితే.. పరిస్థితి ఎలా ఉంటుంది? ఇప్పటివరకూ ఆయన పాలించిన తీరు, అన్న మాటలు చూస్తే.. తప్పకుండా ఆయన అమ్మ వార సత్వాన్ని కొనసాగిస్తారు, అమ్మ విజన్‌కి ఆయన కట్టుబడి ఉంటారన్న నమ్మకం ఉంది. ఇంటర్వూ: ఇస్మాయిల్, సాక్షి ప్రతినిధి -
ప్రపంచీకరణతో పెట్టుబడిదారీ వ్యవస్థ బలోపేతం
సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత శివశంకర్ రాజమహేంద్రవరం కల్చరల్ (రామమహేంద్రవరం సిటీ) : ప్రపంచీకరణతో పెట్టుబడీదారి వ్యవస్థ బలోపేతమై సామాజిక జీవితం ధ్వంసమైందని సాహిత్య అకాడమీ పురస్కారగ్రహీత డాక్టర్ పాపినేని శివశంకర్ అన్నారు. సాహితీగౌతమి ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రపంచీకరణపై ప్రసంగించారు. దీంతో అంతటా నైతిక అంధత్వం వ్యాపించిందన్నారు. మీటనొక్కితే విశ్వవ్యాప్త సమాచారం లభిస్తోందని అయితే సమాచారం, విజ్ఞానం వేర్వేరన్నారు. రాజధాని నిర్మాణం పేరిట వేలాది పంట పొలాలను సేకరిస్తోన్న ప్రభుత్వం ఉద్యోగాలు వస్తాయని చెబుతోందని, కొన్ని ఉద్యోగాలు రావచ్చేమో కాని పరిశ్రమల వల్ల వచ్చే రూ.కోట్ల ఆదాయం ఎవరి జేబులోకి వెడుతోందని ప్రశ్నించారు. సజ్జ, జొన్నరొట్టె, రాగి సంగడికి బదులు వచ్చిన జంక్ ఫుడ్‌తో ఆరోగ్యాలు ధ్వంసమవుతున్నాయన్నారు. ప్రపంచీకరణ వలన ఉద్యోగ భద్రత, స్థిరత్వం పోయాయని, అతి పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ ఉద్యోగికి తెల్లారేటప్పటికి ఉద్వాసన వచ్చే పరిస్థితి ఏర్పడందని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగం తీసేస్తే కోర్టుకు వెళ్లే హక్కు ఉంటుందన్నారు. అమెరికాలో ఉద్యోగి జీవితకాలంలో కనీసం 11 ఉద్యోగాలు మారతాడన్నారు. ప్రపంచం ఎట్లా ఉంది? ఎలా ఉండాలి? అనే అంశంపై దృష్టి సారించాలని ఆయన కోరారు. సాహితీ గౌతమి వ్యవస్ధాపకుడు పి.విజయకుమార్, ఆదిత్య విద్యాసంస్థల డైరెక్టర్ ఎస్పీ గంగిరెడ్డి, కమ్యూనిస్టు, హేతువాది వెలమాటి సత్యనారాయణ, అరసం జాతీయ కార్యదర్శి పెనుగొండ లక్ష్మీనారాయణ, ప్రముఖ పర్యావరణ వేత్త తల్లావఝుల పతంజలి శాస్త్రి, రాష్ట్రపతి పురస్కార గ్రహీత చింతలపాటి శర్మ, విద్యార్థులు హాజరయ్యారు. -
నిలిచిన గౌతమి ఎక్స్‌ప్రెస్
సామర్లకోట : కాకినాడ నుంచి బయలుదేరిన గౌతమి ఎక్్సప్రెస్ రైలు సర్పవరం వద్ద సుమారు అరగంటపాటు నిలిచిపోయింది. ఎస్–1 బోగీలో అంధకారం ఏర్పడడంతో ప్రయాణికులు చైన్‌లాగి రైలును నిలిపివేశారు. ఏం జరిగిందో తెలియక వారు అయోమయానికి గురై బంధువులకు సమాచారం ఇవ్వడంతో వారు కూడా అక్కడకు చేరుకున్నారు. స్థానిక రైల్వే గార్డు పరిశీలించగా ఎస్–1 బోగీ దిగువ భాగంలో ఉన్న డైనమెట్ బెల్ట్‌లు తెగిపోయినట్టు గుర్తించారు. దాంతో ఆ బోగీలో విద్యుత్ సరఫరా నిలిచిపోయి అంధకారం ఏర్పడిందన్నారు. -
పిల్లల్ని బావిలో తోసేసిన తల్లి
కుందుర్పి (అనంతపురం): తన కుమార్తెను కాన్వెంట్లో చదివించడం లేదన్న ఆవేదనతో ఓ తల్లి హృదయం కఠినంగా మారింది. ఇద్దరు కుమార్తెలను బావిలో తోసేసింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. హృదయాన్ని కదలించే ఈ ఘటన అనంతపురం జిల్లా కుందుర్పి మండలం పరిధిలో బుధవారం సాయంత్రం జరిగింది. స్థానికుల కథనం మేరకు.. మండలంలోని కరిగానిపల్లి గ్రామానికి చెందిన ఆనంద్, ప్రమీల దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె గౌతమి (5) ని సమీపంలోని ప్రభుత్వ స్కూల్లో చదివిస్తున్నారు. ప్రమీల భర్త ఏ పని చేయకుండా ఖాళీగా ఉంటున్నాడు. కుటుంబ పోషణ ఆనంద్ సోదరుడే చూసుకుంటున్నాడు. అయితే, ఆనంద్ సోదరుడు తన పిల్లలను కాన్వెంట్లో చదివిస్తున్నాడు. ఈ నేపథ్యంలో తన కుమార్తె గౌతమిని కూడా కాన్వెంట్లో చదివించాలని ప్రమీల కోరింది. అందుకు వారు తిరస్కరించారు. దీంతో మనస్తాపం చెందిన ప్రమీల తనకు పిల్లలే అక్కర్లేదని భావించింది. ఎనుములదొడ్డిలోని పుట్టింటికి వెళుతున్నానని చెప్పి ఇద్దరు పిల్లల్ని తీసుకుని బుధవారం ఇంటి నుంచి బయటకు వచ్చింది. కరిగానిపల్లి, ఎనుముల దొడ్డి మధ్యలో ఓ గుట్టపైనున్న బావిలో ఇద్దరు పిల్లల్ని తోసేసింది. పశువుల కాపర్లు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికితీసే చర్యలు చేపట్టారు. -
థ్రిల్లర్ కథాంశంతో...
రణధీర్, గౌతమి జంటగా శివమణిదీప్ ప్రొడక్షన్స్ పతాకంపై ఓ చిత్రం రూపొందుతోంది. సంపత్‌రాజ్ దర్శకుడు. త్రిపురం సత్యనారాయణ నిర్మాత. 80 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రచార చిత్రాలను దర్శకుడు మారుతి చేతుల మీదుగా హైదరాబాద్‌లో విడుదల చేశారు. థ్రిల్లర్ నేపథ్యంలో సాగే సినిమా ఇదని, అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి మార్చిలో చిత్రాన్ని విడుదల చేస్తామని దర్శకుడు చెప్పారు. వైజాగ్, అరకు, హైదరాబాద్ పరిసరాల్లో చిత్రీకరణ జరిపామని నిర్మాత తెలిపారు. ఈ చిత్రంలో భాగం కావడం పట్ల చిత్రం యూనిట్ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ చిత్రానికి రచన: భాషాశ్రీ, సంగీతం: నవనీత్ చారి.