వారసుడు పన్నీరు సెల్వమే..!
పన్నీర్ సెల్వమే నా తదనంతర ముఖ్యమంత్రి అని అమ్మే చెప్పారు. సెల్వంను అమ్మ దూరం పెట్టడం, పార్టీ నుంచి గెంటేయడం, తన దరిదాపుల్లోకి రాకూడదని చెప్పడం లాంటివి ఒక్కసారైనా జరిగాయా?
తమిళనాడు రాజకీయాల్లో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ఏమాత్రం మంచివి కాదని, జయలలిత రాజ కీయ ఎంపిక ఇప్పటికీ పన్నీరు సెల్వమేనని, ఆయన ముఖ్యమంత్రిగా ఉంటేనే రాష్ట్ర ప్రజలు జయలలితకు ఇచ్చిన తీర్పునకు గౌరవం ఉంటుందని ప్రముఖ నటి గౌతమి తేల్చి చెబుతున్నారు. శశికళ రాజకీయాలు, ముఖ్యంగా ఎమ్మెల్యేల తరలింపు అనేవి తమిళనాడుకు సంబంధించినంతవరకు మంచి సంప్రదాయం కాదని ఆమె చెబుతున్నారు. తమిళ ప్రజలు గతంలో ఎన్నడూ చూడని సంక్షోభంలో తమిళ రాజకీయాలు చిక్కుకున్న నేపథ్యంలో ఒకవైపు శశికళ, మరోవైపు పన్నీర్ సెల్వం మధ్య అన్నాడీఎంకేలో జరుగుతున్న ఈ కుమ్ములాట గురించి సాక్షి పత్రికకు గౌతమి ఇచ్చిన ఇంటర్వూ్యలోని ముఖ్యాంశాలు....
తమిళనాడు ప్రస్తుత పరిణామాలకు కారణం ఎవరు?
నేటి తమిళనాడు రాజకీయ పరిస్థితులకు కారణం ఒకరిపై పెట్టి చూపలేం. రాజకీయం చాలా అరుదైన పరిస్థితుల్లోనే ఏకముఖంగా నడుస్తుంటుంది. చాలా బాధాకరమైన విషయం ఏమిటంటే ఇన్ని విష యాలు ఇంతవరకు ప్రజలకు తెలీకుండా పోవటం. ప్రజాస్వామ్యంలో ఇంత స్పష్టత లేకపోవడం చాలా బాధ కలిగిస్తోంది. అయిదేళ్ల పాలనా కాలంలో ప్రతి క్షణం ప్రజలకు బాధ్యత పడాలనేది గుర్తుంచుకో వాలి. అయితే చాలా కాలంగా ప్రభుత్వాలు ఈ విషయం మర్చిపోయినట్లనిపిస్తుంది.
పార్టీలో సంక్షోభానికి కారణం శశికళా? సెల్వమా?
తమిళనాడు చరిత్రలో పదవిలో ఉన్నవారు వరు సగా రెండోసారి మళ్లీ అధికారంలోకి రావడం చాలా అరుదు. అమ్మ అలా రెండోసారి గెలిచారు. పెద్ద మార్జిన్‌తో గెలిచారామె. ప్రజలకు ఆమెపట్ల ఉన్న నమ్మకం అలాంటిది. రాష్ట్రంలోని ప్రజలందరి మేలు కోరే భరోసా ఆమె మీద పెట్టామన్న ఆలోచనతోటే ప్రజలు తిరుగులేని విధంగా తీర్పు చెప్పారు. అలాంటి అమ్మే ఇప్పుడు లేరు. తన తర్వాత ఆమె ఎవరిని చూపించారు. మీకోసం నేను చేయాలనుకు న్నది నా మార్గంలో చేయగలిగేవారు వీరు అని చాలాసార్లు ఆమె పన్నీరు సెల్వంనే చూపించారు. తన విజన్‌ని సాధ్యం చేయగల వ్యక్తి ఎవరో అమ్మే తేల్చిచెప్పాక దాన్ని కొనసాగించడమే ధర్మం.
సెల్వంను శశికళ తప్పించిన విధానం సరైందేనా?
ఈరోజు మనం చూస్తున్న పరిణామాలు సరైన పద్ధతిలో జరిగాయి అని ఎవరైనా చెప్పగలుగు తారా? పార్టీ ప్రధాన కార్యదర్శి ఎంపిక కూడా తాత్కాలిక ప్రాతిపదికనే జరిగింది అని ఇవ్వాళ తెలు స్తోంది. ఇలాంటి రహస్యాలు ఇంకా ఎన్ని ఉన్నా యి? పార్టీవరకు మాత్రమే అయితే అది అంతర్గత విషయం. కానీ ప్రజలను పాలించవలసిన సంద ర్భం వచ్చేసరికి అది అంతర్గత విషయంగా ఉండ దు. అది మన రోజువారీ జీవితాన్ని ప్రతి క్షణమూ ప్రభావితం చేసే నిర్ణయం. అలాంటి నిర్ణయం తీసు కునే హక్కు ప్రజలకు మాత్రమే ఉంది. వారు తమ నిర్ణయాన్ని చెప్పేశారు. ఆ నిర్ణయాన్ని మార్చే అధి కారం ప్రజలకే తప్ప మరెవరికీ లేదు.
జయలలిత వారసురాలు శశికళేనా?
అమ్మ అన్నిసార్లు చేయెత్తి చూపి మరీ పన్నీర్ సెల్వమే నా తదనంతర సీఎం అని చెప్పిన తర్వాత ఆమె వారసురాలు వీరు, వారు, మరొకరు అని ఎలా అనుకుంటాం? ఇన్నేళ్లుగా సెల్వం అమ్మతో ఉన్నారు. ఆయన్ని అమ్మ దూరం చేయడం, పార్టీ నుంచి బయటకు గెంటడం, తన దరిదాపుల్లోకి రాకూడదని చెప్పడం.. ఒక్కసారైనా జరిగిందా.. ఆయన స్థిరత్వం, విశ్వాసం, ముక్కుసూటితనమే కదా అమ్మ ఆయన్ని నమ్మడానికి కారణం.
మీ మద్దతు పన్నీరు సెల్వంకేనా?
తప్పకుండా. అది అమ్మ నిర్ణయం. ఓటు అమ్మకు వేశారు. అందరి నమ్మకం ఆమె మీదే ఉంది.
ఎమ్మెల్యేలు నాతోటే ఉన్నారని శశికళ చెబుతున్నారే?
మనస్సాక్షి అనేది ఉంటే దాని మాట మనం విని, ఆ ప్రకారం నడిస్తేనే.. మనల్ని మనం మనిషి అని చెప్పుకునే హక్కు ఉంటుంది. అర్హత ఉంటుంది మనకు. డబ్బు ప్రభావాలు చాలా వస్తుంటాయి. పోతుంటాయి. కానీ మనిషిగా, మానవత్వంతో ఆలోచించి నిర్ణయించుకోవడమే జీవితంలో అతి పెద్ద విశ్వసనీయత.
ఎమ్మెల్యేలను బస్సుల్లో తరలించడం ఏమిటి?
విషాదకరం. అత్యంత విషాదకరం. ఇలాంటి కథలు మనం ఎక్కడో, ఎప్పుడో విని ఉండవచ్చు. ఇతర రాష్ట్రాల్లో ఇలా జరిగింది అని విన్నాం. కాని తమిళనాడులో ఈరోజు అదే జరుగుతోంది అని ఒక రూమర్ వచ్చినా అది బాధాకరమండి. దీనిగురించి ఆలోచించాలన్నా బాధ కలుగుతోంది.
ఎమ్మెల్యేల మద్దతుతో శశికళే సీఎం అయితే?
అలా జరగదని నేను నమ్ముతున్నాను. మానవత్వం మీద నాకు చాలా నమ్మకం ఉంది. ఒకవేళ దానికి భిన్నంగా జరిగితే, ఎమ్మెల్యేల దన్నుతో శశికళ సీఎం అయితే అది కచ్చితంగా అమ్మమీద ఉన్న తీర్పు కాదు. ప్రజలు ఇచ్చిన తీర్పు కాదది.
పన్నీర్ సెల్వమే నెగ్గితే.. పరిస్థితి ఎలా ఉంటుంది?
ఇప్పటివరకూ ఆయన పాలించిన తీరు, అన్న మాటలు చూస్తే.. తప్పకుండా ఆయన అమ్మ వార సత్వాన్ని కొనసాగిస్తారు, అమ్మ విజన్‌కి ఆయన కట్టుబడి ఉంటారన్న నమ్మకం ఉంది.
ఇంటర్వూ: ఇస్మాయిల్, సాక్షి ప్రతినిధి