
కేంద్రమంత్రిని కలిసిన నటి గౌతమి
సాక్షి, న్యూఢిల్లీ: నటి గౌతమి బుధవారం సాయంత్రం కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్‌ను కలిశారు. అయితే, భేటీలో ఏ విషయంపై చర్చించారన్న దానిపై క్లారిటీ లేదు. కాగా, గౌతమి బీజేపీలో చేరుతారనే ఊహాగానాలు ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె జవదేకర్‌తో సమావేశం కావడం ఆసక్తికరంగా మారింది.