
పెనమలూరు: క్యాన్సర్ వ్యాధిని తొలిదశలోనే గుర్తిస్తే చికిత్స ద్వారా పూర్తిస్థాయిలో కోలుకోవచ్చని సినీనటి లైప్ అగైన్ ఫౌండేన్ చైర్‌పర్సన్ టి.గౌతమి సూచించారు. ఆమె శనివారం కానూరు అశోక్‌నగర్‌లో రూట్స్ హెల్త్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. రూట్స్ ఉచిత సంరక్షణ కేంద్రంలో క్యాన్సర్ బాధితులను పరామర్శించి పండ్లు, దుప్పట్లు అందజేశారు. క్యాన్సర్ బాధితులకు సేవలు అందిస్తున్న రూట్స్ ఫౌండేషన్‌కు అభినందనలు తెలిపారు. ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ పోలవరపు విజయభాస్కర్ మాట్లాడుతూ పదేళ్లుగా క్యాన్సర్ బాధితులకు సేవచేస్తున్నామని పేర్కొన్నారు. రూట్స్ హాస్పిల్ చైర్మన్ అన్నే శివనాగేశ్వరరావు, డాక్టర్ పద్మజ, రూట్స్ కన్వీనర్ కె.మాధవి, రామకృష్ణప్రసాద్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment