- రూ.10 లక్షల పరిహారం ఇచ్చేందుకు అంగీకరించిన చిరెక్ స్కూల్ యాజమాన్యం
- సిరిపూర్ ఎమ్మెల్యే కోనప్ప రూ.2 లక్షలు, ప్రభుత్వం రూ.2 లక్షలు
- ఇద్దరి కూతుళ్లకు ఉద్యోగాలు
గచ్చిబౌలి(హైదరాబాద్‌సిటీ)
స్కూల్ బస్సు ఢీకొట్టి మృతి చెందిన వెంకన్న కుటుంబానికి ఆర్థిక సహాయం అందించేందుకు చిరెక్ ఇంటర్నేషనల్ స్కూల్ యాజమాన్యం అంగీకరించింది. సిరిపూర్ ఎమ్మెల్యే కోనప్ప రూ.2 లక్షలు, తెలంగాణ ప్రభుత్వం మరో రెండు లక్షలు ఇవ్వనుందని ఎమ్మెల్యేలు తెలిపారు. సోమవారం ఉదయం పెద్ద ముప్పారం వరంగల్‌కు చెందిన గంగినేని వెంకన్న(49) మాదాపూర్‌లో కూతురును ఇంటర్వ్యూకు బైక్‌పై వదిలి తిరిగి వెళుతూ చిరెక్ స్కూల్ బస్సు ఢీ కొని మృతి చెందిన విషయం తెలిసిందే. బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం ప్రకటించడంలో జాప్యం జరగడంతో సిరిపూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ మంగళవారం సాయంత్రం చిరెక్ స్కూల్ యాజమాన్యంతో చర్చలు జరిపారు. రూ.10 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించిందని వారు చెప్పారు. చర్చల అనంతరం వెంకన్న కూతురు సారిక మా నాన్న ఇక తిరిగిరాడని విలిపించడం అక్కడి వారిని కలిచివేసింది.
వెంకన్న కుటుంబానికి ఆర్థిక సహాయం
Published Tue, Aug 30 2016 7:50 PM | Last Updated on Tue, Sep 4 2018 5:21 PM
Advertisement
Advertisement