chirec International School
-
174 మంది విద్యార్థులు.. రూ. 61.27 లక్షలు
రాయదుర్గం: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే గ్రామీణ విద్యార్థులకు చేయూత ఇచ్చేందుకు కొండాపూర్‌లోని చిరేక్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు నడుం బిగించారు. అందుకోసం ‘క్లౌడ్ ఫండింగ్ ఫ్లాట్‌ఫాం ఫ్యూయల్ ఎ డ్రీమ్ డాట్‌కామ్’ద్వారా నిధులను సేకరించారు. పాఠశాలకు చెందిన 174 మంది విద్యార్థులు స్వచ్చందంగా ముందుకొచ్చి మూడు వారాల్లోనే రూ.61.27 లక్షలు సేకరించడం విశేషం. తెలంగాణ, మహారాష్ట్రలోని అన్ని ప్రాంతాలలో చదివే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు బ్యాక్–టు–స్కూల్ కిట్‌ను అందించడమే లక్ష్యంగా వారు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కిట్కోసం సంవత్సరానికి రూ.900 ఖర్చవుతుంది. గ్రీన్‌సోల్ అనే ఎన్జీఓ సహకారంతో ఈ కిట్‌ను తయారు చేయించారు. చిరేక్ ఇంటర్నేషనల్ స్కూల్లో ప్రతి విద్యార్థి రూ.27వేలు సేకరించడం లక్ష్యం. దీంతో 30 మంది గ్రామీణ విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుంది. అయితే 174 మంది విద్యార్థులు రూ.61.27 లక్షలను సేకరించడంతో 6,800 మంది విద్యార్థులకు మేలు జరగనుంది. -
సాక్షి ఇండియా స్పెల్ బీ చాంపియన్ చిరెక్
హైదరాబాద్: ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ‘సాక్షి ఇండియా స్పెల్ బీ–2016 పోటీల్లో హైదరాబాద్‌లోని చిరెక్ ఇంటర్నేషనల్ స్కూల్ చాంపియన్‌గా నిలిచింది. స్పెల్ బీ ఇండియా సంస్థతో కలిసి ‘సాక్షి’మీడియా గ్రూప్ నిర్వహించిన ఈ పోటీల్లో వివిధ పాఠశాలల నుంచి వేలాది మంది విద్యార్థులు ఉత్సాహంగా పోటీపడ్డారు. చిరెక్ స్కూల్ కోఆర్డినేటర్ రాణితో పాటు విజేతలకు స్పెల్ బీ ఇండియా సీఈవో శంకర్‌నారాయణ, బీ మాస్టర్ విక్రమ్ ఆదివారం ట్రోఫీని అందజేశారు. దీంతో పాటు సాక్షి ఇండియా స్పెల్ బీ–2016 కేటగిరీ–3, 4 (తెలంగాణ) విజేతలను కూడా ప్రకటించారు. కార్యక్రమంలో సాక్షి డైరెక్టర్ (కార్పొరేట్ కమ్యూనికేషన్స్) రాణిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ పోటీలతో తమ పిల్లలకు ఇంగ్లిష్ భాషపై ఉన్న భయాలు తొలగిపోయి, ఆత్మవిశ్వాసం పెరిగిందని విద్యార్థుల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. వారిలో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీయడానికి దోహదపడ్డాయన్నారు. ఇలాంటి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్న సాక్షి యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు. సాక్షి స్పెల్ బీ ఇండియా కేటగిరీ–3 (తెలంగాణ) విజేతలు స్వర్ణ పతకం: పాహి శ్రీవాస్తవ, చిరెక్ ఇంటర్నేషనల్ స్కూల్, హైదరాబాద్. విజేతకు స్వర్ణ పతకంతో పాటు రూ.15వేల చెక్, సర్టిఫికెట్, డ్యూక్ గిఫ్ట్ ప్యాక్ అందజేశారు. రజత పతకం: సిద్ధార్థ వీరపనేని, శ్రీనిధి ఇంటర్నేషనల్ స్కూల్, హైదరాబాద్. పతకంతో పాటు రూ.10వేల చెక్, సర్టిఫికెట్, డ్యూక్ గిఫ్ట్ ప్యాక్ అందించారు. కాంస్య పతకం: డి.వేగ, ది అగాఖాన్ అకాడమీ, హైదరాబాద్. పతకంతో పాటు రూ.5 వేల చెక్, సర్టిఫికెట్, డ్యూక్ గిఫ్ట్‌ప్యాక్ బహూకరించారు. సాక్షి స్పెల్ బీ ఇండియా కేటగిరీ –4 (తెలంగాణ) విజేతలు స్వర్ణ పతకం: ఎస్.ఉదయశ్రీ, నీరజ్ పబ్లిక్ స్కూల్, హైదరాబాద్. పతకంతో పాటు రూ.15వేల చెక్, సర్టిఫికెట్, డ్యూక్ గిఫ్ట్‌ప్యాక్ అందించారు. రజత పతకం: మృణాల్ కుట్టేరి, గీతాంజలి దేవశాల స్కూల్, హైదరాబాద్. పతకంతో పాటు రూ.10 వేల చెక్, సర్టిఫికెట్, డ్యూక్ గిఫ్ట్‌ప్యాక్ అందించారు. కాంస్య పతకం: గౌతమ్ వీరపనేని, శ్రీనిధి ఇంటర్నేషనల్ స్కూల్, హైదరాబాద్. విజేతకు పతకంతో పాటు రూ.5 వేల చెక్, సర్టిఫికెట్, డ్యూక్ గిఫ్ట్‌ప్యాక్ అందజేశారు. -
వెంకన్న కుటుంబానికి ఆర్థిక సహాయం
- రూ.10 లక్షల పరిహారం ఇచ్చేందుకు అంగీకరించిన చిరెక్ స్కూల్ యాజమాన్యం - సిరిపూర్ ఎమ్మెల్యే కోనప్ప రూ.2 లక్షలు, ప్రభుత్వం రూ.2 లక్షలు - ఇద్దరి కూతుళ్లకు ఉద్యోగాలు గచ్చిబౌలి(హైదరాబాద్‌సిటీ) స్కూల్ బస్సు ఢీకొట్టి మృతి చెందిన వెంకన్న కుటుంబానికి ఆర్థిక సహాయం అందించేందుకు చిరెక్ ఇంటర్నేషనల్ స్కూల్ యాజమాన్యం అంగీకరించింది. సిరిపూర్ ఎమ్మెల్యే కోనప్ప రూ.2 లక్షలు, తెలంగాణ ప్రభుత్వం మరో రెండు లక్షలు ఇవ్వనుందని ఎమ్మెల్యేలు తెలిపారు. సోమవారం ఉదయం పెద్ద ముప్పారం వరంగల్‌కు చెందిన గంగినేని వెంకన్న(49) మాదాపూర్‌లో కూతురును ఇంటర్వ్యూకు బైక్‌పై వదిలి తిరిగి వెళుతూ చిరెక్ స్కూల్ బస్సు ఢీ కొని మృతి చెందిన విషయం తెలిసిందే. బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం ప్రకటించడంలో జాప్యం జరగడంతో సిరిపూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ మంగళవారం సాయంత్రం చిరెక్ స్కూల్ యాజమాన్యంతో చర్చలు జరిపారు. రూ.10 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించిందని వారు చెప్పారు. చర్చల అనంతరం వెంకన్న కూతురు సారిక మా నాన్న ఇక తిరిగిరాడని విలిపించడం అక్కడి వారిని కలిచివేసింది.