సాక్షి ఇండియా స్పెల్ బీ చాంపియన్ చిరెక్
హైదరాబాద్: ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ‘సాక్షి ఇండియా స్పెల్ బీ–2016 పోటీల్లో హైదరాబాద్‌లోని చిరెక్ ఇంటర్నేషనల్ స్కూల్ చాంపియన్‌గా నిలిచింది. స్పెల్ బీ ఇండియా సంస్థతో కలిసి ‘సాక్షి’మీడియా గ్రూప్ నిర్వహించిన ఈ పోటీల్లో వివిధ పాఠశాలల నుంచి వేలాది మంది విద్యార్థులు ఉత్సాహంగా పోటీపడ్డారు.
చిరెక్ స్కూల్ కోఆర్డినేటర్ రాణితో పాటు విజేతలకు స్పెల్ బీ ఇండియా సీఈవో శంకర్‌నారాయణ, బీ మాస్టర్ విక్రమ్ ఆదివారం ట్రోఫీని అందజేశారు. దీంతో పాటు సాక్షి ఇండియా స్పెల్ బీ–2016 కేటగిరీ–3, 4 (తెలంగాణ) విజేతలను కూడా ప్రకటించారు. కార్యక్రమంలో సాక్షి డైరెక్టర్ (కార్పొరేట్ కమ్యూనికేషన్స్) రాణిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ పోటీలతో తమ పిల్లలకు ఇంగ్లిష్ భాషపై ఉన్న భయాలు తొలగిపోయి, ఆత్మవిశ్వాసం పెరిగిందని విద్యార్థుల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. వారిలో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీయడానికి దోహదపడ్డాయన్నారు. ఇలాంటి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్న సాక్షి యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు.
సాక్షి స్పెల్ బీ ఇండియా కేటగిరీ–3 (తెలంగాణ) విజేతలు
స్వర్ణ పతకం: పాహి శ్రీవాస్తవ, చిరెక్ ఇంటర్నేషనల్ స్కూల్, హైదరాబాద్. విజేతకు స్వర్ణ పతకంతో పాటు రూ.15వేల చెక్, సర్టిఫికెట్, డ్యూక్ గిఫ్ట్ ప్యాక్ అందజేశారు.
రజత పతకం: సిద్ధార్థ వీరపనేని, శ్రీనిధి ఇంటర్నేషనల్ స్కూల్, హైదరాబాద్. పతకంతో పాటు రూ.10వేల చెక్, సర్టిఫికెట్, డ్యూక్ గిఫ్ట్ ప్యాక్ అందించారు.
కాంస్య పతకం: డి.వేగ, ది అగాఖాన్ అకాడమీ, హైదరాబాద్. పతకంతో పాటు రూ.5 వేల చెక్, సర్టిఫికెట్, డ్యూక్ గిఫ్ట్‌ప్యాక్ బహూకరించారు.
సాక్షి స్పెల్ బీ ఇండియా కేటగిరీ –4 (తెలంగాణ) విజేతలు
స్వర్ణ పతకం: ఎస్.ఉదయశ్రీ, నీరజ్ పబ్లిక్ స్కూల్, హైదరాబాద్. పతకంతో పాటు రూ.15వేల చెక్, సర్టిఫికెట్, డ్యూక్ గిఫ్ట్‌ప్యాక్ అందించారు.
రజత పతకం: మృణాల్ కుట్టేరి, గీతాంజలి దేవశాల స్కూల్, హైదరాబాద్. పతకంతో పాటు రూ.10 వేల చెక్, సర్టిఫికెట్, డ్యూక్ గిఫ్ట్‌ప్యాక్ అందించారు.
కాంస్య పతకం: గౌతమ్ వీరపనేని, శ్రీనిధి ఇంటర్నేషనల్ స్కూల్, హైదరాబాద్. విజేతకు పతకంతో పాటు రూ.5 వేల చెక్, సర్టిఫికెట్, డ్యూక్ గిఫ్ట్‌ప్యాక్ అందజేశారు.