Sakshi India Spell bee
-
సాక్షి ఇండియా స్పెల్‌బీ సెమి ఫైనల్ కేటగిరీ–4
-
సాక్షి ఇండియా స్పెల్‌బీ, మ్యాథ్‌బీ కేటగిరీ–4 విజేతలు వీరే
హైదరాబాద్ : ‘సాక్షి’ మీడియా గ్రూప్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సాక్షి ఇండియా స్పెల్‌బీ, మ్యాథ్‌బీ–2017 (కేటగిరీ–4, తెలంగాణ రాష్ట్రం) విజేతలను ప్రకటించారు. వేలాది మంది విద్యార్థులు పాల్గొన్న ఈ పోటీలు ఎంతో ఉత్కంఠగా కొనసాగాయి. చివరగా నిర్వహించిన ఫైనల్స్‌లో ప్రథమ, ద్వితీయ, తృతీయ విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందించారు. ఈ సందర్భంగా విజేతలు, వారి తల్లిదండ్రులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. విద్యార్థుల్లో ఇంగ్లీష్ భాషపై, మ్యాథ్స్ విషయంలో అంతర్గతంగా ఉన్న భయాలు పోగొట్టి, వారిలో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీయడంతో పాటు గొప్ప ఆత్మవిశ్వాసాన్ని ఈ పోటీలు కలిగించాయని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సాక్షి యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు. స్పెల్‌బీ ప్రథమ బహుమతి: హైదరాబాద్‌లోని నీరజ్ పబ్లిక్ స్కూల్లో చదువుతున్న ఎస్. ఉదయశ్రీ కైవసం చేసుకున్నారు. విజేతకు బంగారు పతకంతో పాటు రూ. 15వేలు, సర్టిఫికెట్, డ్యూక్ గిప్ట్ హాంపర్ అందజేశారు. మ్యాథ్‌బీ ప్రథమ బహుమతి: హైదరాబాద్‌లోని వికాస్ ది కాన్సెప్ట్ స్కూల్ బాచుపల్లిలో చదువుతున్న సాయి శ్రీరామ్ కార్తీక్ బి కైవసం చేసుకున్నారు. విజేతకు బంగారు పతకంతో పాటు రూ. 15వేలు, సర్టిఫికెట్, డ్యూక్ గిప్ట్ హాంపర్ అందజేశారు. స్పెల్‌బీ ద్వితీయ బహుమతి: హైదరాబాద్‌లోని గీతాంజలి దేవశాలలో చదువుతున్న మ్రినల్ కుటేరి కైవసం చేసుకున్నారు. విజేతకు రజత పతకంతో పాటు రూ. 10వేలు, సర్టిఫికెట్, డ్యూక్ గిప్ట్ హాంపర్ అందజేశారు. మ్యాథ్‌బీ ద్వితీయ బహుమతి: హైదరాబాద్‌లోని ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్న ఆశ్రిత్ రెడ్డి బిరదవోలు కైవసం చేసుకున్నారు. విజేతకు రజత పతకంతో పాటు రూ. 10వేలు, సర్టిఫికెట్, డ్యూక్ గిప్ట్ హాంపర్ అందజేశారు. స్పెల్‌బీ తృతీయ బహుమతి: హైదరాబాద్‌లోని భారతీయ విద్యాభవన్ పబ్లిక్ స్కూల్, జూబ్లీహిల్స్‌లో చదువుతున్న వి. కృష్ణ సాయి గాయిత్రి కైవసం చేసుకున్నారు. విజేతకు కాంస్య పతకంతో పాటు రూ. 5,000లు, సర్టిఫికెట్, డ్యూక్ గిఫ్ట్ హాంపర్ అందజేశారు. మ్యాథ్‌బీ తృతీయ బహుమతి: హైదరాబాద్‌లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్, నాచారం బ్రాంచ్‌లో చదువుతున్న కావేరి ప్రియా పుట్టి కైవసం చేసుకున్నారు. విజేతకు కాంస్య పతకంతో పాటు రూ. 5,000లు, సర్టిఫికెట్, డ్యూక్ గిఫ్ట్ హాంపర్ అందజేశారు. -
సాక్షి ఇండియా స్పెల్ బీ చాంపియన్ చిరెక్
హైదరాబాద్: ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ‘సాక్షి ఇండియా స్పెల్ బీ–2016 పోటీల్లో హైదరాబాద్‌లోని చిరెక్ ఇంటర్నేషనల్ స్కూల్ చాంపియన్‌గా నిలిచింది. స్పెల్ బీ ఇండియా సంస్థతో కలిసి ‘సాక్షి’మీడియా గ్రూప్ నిర్వహించిన ఈ పోటీల్లో వివిధ పాఠశాలల నుంచి వేలాది మంది విద్యార్థులు ఉత్సాహంగా పోటీపడ్డారు. చిరెక్ స్కూల్ కోఆర్డినేటర్ రాణితో పాటు విజేతలకు స్పెల్ బీ ఇండియా సీఈవో శంకర్‌నారాయణ, బీ మాస్టర్ విక్రమ్ ఆదివారం ట్రోఫీని అందజేశారు. దీంతో పాటు సాక్షి ఇండియా స్పెల్ బీ–2016 కేటగిరీ–3, 4 (తెలంగాణ) విజేతలను కూడా ప్రకటించారు. కార్యక్రమంలో సాక్షి డైరెక్టర్ (కార్పొరేట్ కమ్యూనికేషన్స్) రాణిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ పోటీలతో తమ పిల్లలకు ఇంగ్లిష్ భాషపై ఉన్న భయాలు తొలగిపోయి, ఆత్మవిశ్వాసం పెరిగిందని విద్యార్థుల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. వారిలో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీయడానికి దోహదపడ్డాయన్నారు. ఇలాంటి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్న సాక్షి యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు. సాక్షి స్పెల్ బీ ఇండియా కేటగిరీ–3 (తెలంగాణ) విజేతలు స్వర్ణ పతకం: పాహి శ్రీవాస్తవ, చిరెక్ ఇంటర్నేషనల్ స్కూల్, హైదరాబాద్. విజేతకు స్వర్ణ పతకంతో పాటు రూ.15వేల చెక్, సర్టిఫికెట్, డ్యూక్ గిఫ్ట్ ప్యాక్ అందజేశారు. రజత పతకం: సిద్ధార్థ వీరపనేని, శ్రీనిధి ఇంటర్నేషనల్ స్కూల్, హైదరాబాద్. పతకంతో పాటు రూ.10వేల చెక్, సర్టిఫికెట్, డ్యూక్ గిఫ్ట్ ప్యాక్ అందించారు. కాంస్య పతకం: డి.వేగ, ది అగాఖాన్ అకాడమీ, హైదరాబాద్. పతకంతో పాటు రూ.5 వేల చెక్, సర్టిఫికెట్, డ్యూక్ గిఫ్ట్‌ప్యాక్ బహూకరించారు. సాక్షి స్పెల్ బీ ఇండియా కేటగిరీ –4 (తెలంగాణ) విజేతలు స్వర్ణ పతకం: ఎస్.ఉదయశ్రీ, నీరజ్ పబ్లిక్ స్కూల్, హైదరాబాద్. పతకంతో పాటు రూ.15వేల చెక్, సర్టిఫికెట్, డ్యూక్ గిఫ్ట్‌ప్యాక్ అందించారు. రజత పతకం: మృణాల్ కుట్టేరి, గీతాంజలి దేవశాల స్కూల్, హైదరాబాద్. పతకంతో పాటు రూ.10 వేల చెక్, సర్టిఫికెట్, డ్యూక్ గిఫ్ట్‌ప్యాక్ అందించారు. కాంస్య పతకం: గౌతమ్ వీరపనేని, శ్రీనిధి ఇంటర్నేషనల్ స్కూల్, హైదరాబాద్. విజేతకు పతకంతో పాటు రూ.5 వేల చెక్, సర్టిఫికెట్, డ్యూక్ గిఫ్ట్‌ప్యాక్ అందజేశారు. -
సాక్షి ఇండియా స్పెల్ బీ:క్యాటగిరి 1
-
ఉత్సాహంగా ‘సాక్షి’ స్పెల్ బీ సెమీ ఫైనల్స్
-
ఉత్సాహంగా ‘సాక్షి’ ఇండియా స్పెల్ బీ సెమీ ఫైనల్స్
పోటీలో చురుగ్గా పాల్గొన్న 400 మంది విద్యార్ధులు ఉత్తీర్ణులైన వారికి డిసెంబర్లో ఫైనల్స్ హైదరాబాద్: ‘సాక్షి’ ఇండియా స్పెల్ బీ సెమీ ఫైనల్స్ ఆదివారం హైదరాబాద్‌లోని (బంజరాహిల్స్) ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఉత్సాహభరిత వాతావరణంలో సాగాయి. క్వార్టర్ ఫైనల్స్‌లో క్వాలిఫై అయిన సుమారు 400 మందికిపైగా విద్యార్థులు సెమీ ఫైనల్స్‌లో పాల్గొని తమ మెదడుకు పదును పెట్టారు. సాక్షి టీవీ ప్రత్యక్ష ప్రసారం ద్వారా ‘బీ మాస్టర్’ విక్రమ్ అడిగిన ప్రతి ఆంగ్ల పదానికీ విద్యార్థులు చురుకుగా స్పెల్లింగ్ రాశారు. పోటీలను స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు కల్యాణి చౌదరి పర్యవేక్షించారు. సెమీ ఫైనల్స్‌లో క్వాలిఫై వారికి డిసెంబర్లో ఫైనల్స్ జరుగుతాయి. కాగా, అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్న ‘సాక్షి’ ఇండియా స్పెల్ బీ పోటీలు తమ స్కూల్లో జరగడం ఆనందంగా ఉందని ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రిన్సిపాల్ టి.వీణామూర్తి, ప్రధానోపాధ్యాయురాలు కళ్యాణి చౌదరి తెలిపారు. తమ స్కూల్ సిబ్బంది, విద్యార్థులకు ఈ పోటీ కొత్త అనుభూతిని కలిగించిందన్నారు. విద్యార్థులు కమ్యునికేషన్ స్కిల్స్‌ను పెంపుందించుకోవడానికి ‘సాక్షి’ ఈ విధమైన కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. స్పెల్ బీ విధానాన్ని తమ స్కూల్లో నిరంతరం అమలు చేస్తామని చెప్పారు. -
స్పెల్ బి ఫైనల్: తెలంగాణ క్యాటగిరి - 4
-
‘సాక్షి ఇండియా స్పెల్‌బీ’ ఫైనల్స్‌లో ‘తూర్పు’ సుమాల గుబాళింపు
ఆల్కాట్‌తోట (రాజమండ్రి) :హైదరాబాద్‌లో రాష్ర్టస్థాయిలో శుక్రవారం జరిగిన ‘సాక్షి ఇండియా స్పెల్‌బీ’ పోటీల్లో మన జిల్లా విద్యార్థులు విజేతలుగా నిలిచారు. కేటగిరి-1లో శ్రీగౌతమి స్మార్ట్ స్కూల్ విద్యార్థిని జి.యోషిత ద్వితీయ స్థానంలో నిలిచి రూ.15 వేలు, ది ఫ్యూచర్ కిడ్స్ స్కూల్ రెండో తరగతి విద్యార్థిని బి.నిత్యాన్విత తృతీయ స్థానం సాధించి రూ.10 వేలు, కేటగిరి-2లో ట్రిప్స్ ఇంటర్నేషనల్ స్కూల్ నాలుగో తరగతి విద్యార్థి వి.వందిత్ తృతీయ స్థానంతో రూ.10 వేలు, కేటగిరి-3లో అదే స్కూల్ ఐదో తరగతి విద్యార్థిని తితిక్ష శివప్రియ ప్రథమ స్థానంతో రూ.25 వేలు, ది ఫ్యూచర్ కిడ్స్ స్కూల్ తొమ్మిదో తరగతి విద్యార్థిని కె.చూడామణి కేటగిరి-4లో ప్రథమ స్థానం సాధించి రూ.25 వేలు ప్రైజ్‌మనీ గెలుచుకున్నారు. ఆ మొత్తాలకు సంబంధించిన చెక్కులను ‘సాక్షి’ ఎడిటోరియల్ డెరైక్టర్ కె.రామచంద్రమూర్తి, డెరైక్టర్ల చేతులమీదుగా అందుకున్నారు. విజేతలకు అభినందనలు ‘సాక్షి ఇండియా స్పెల్‌బీ’ పోటీల్లో విజేతలుగా నిలిచిన తమ విద్యార్థులు తితిక్ష శివప్రియ, వి.వందిత్లను ట్రిప్స్ ఇంటర్నేషనల్ స్కూల్ అధినేత బాలాత్రిపురసుందరి, డెరైక్టర్లు వంశీకృష్ణ, రూపాదేవి, నారాయణరావు, వైస్ ప్రిన్సిపాల్ ప్రసాదరెడ్డి, మృణాళిని అభినందించారు. ది ఫ్యూచర్ కిడ్స్ స్కూల్లో విజేతలుగా నిలిచిన కె.చూడామణి, బి.నిత్యాన్వితలను డెరైక్టర్ వై.రవిబాబు, చైర్పర్సన్ వై.విజయకుమారి, ప్రిన్సిపాల్ ఆర్.రవీంద్రనాథ్, ఉపాధ్యాయులు అభినందించారు. శ్రీగౌతమి స్మార్ట్ స్కూల్లో విజేతగా నిలిచిన జి.యోషితను డెరైక్టర్ సుంకర రవికుమార్, ఉపాధ్యాయులు అభినందించారు. -
ఉత్సాహంగా సాక్షి స్పెల్‌బీ సెమీ ఫైనల్స్
5న హైదరాబాద్‌లో ఫైనల్ పరీక్ష నెట్వర్క్: ‘సాక్షి’ ఇండియా స్పెల్‌బీ జోనల్ సెమీఫైనల్స్ ఆదివారం ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి. హైదరాబాద్, వైజాగ్, తిరుపతి, విజయవాడల్లో ఏకకాలంలో ఈ పోటీలు నిర్వహించారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని సుల్తాన్-ఉల్-ఉలూమ్ కళాశాలలో జరిగిన ఈ పోటీలు నాలుగు కేటగిరీల్లో నిర్వహించగా వెయ్యి మంది విద్యార్థులు హాజరయ్యారు. విశాఖపట్నంలో సీతంపేటలోని వి.టి హైస్కూల్లో ఉదయం 10.15 నుంచి మధ్యాహ్నం 1.45 వరకు నాలుగు బ్యాచ్‌లుగా పరీక్ష నిర్వహించారు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, రాజమండ్రి, కాకినాడ ప్రాంతాలకు చెందిన విద్యార్థులుహాజరయ్యారు. తిరుపతిలోని తిరుచానూరు రోడ్డు శ్రీనివాసపురంలోని రామిరెడ్డి రాయలసీమ విద్యాసంస్థలు వేదికగా పరీక్ష నిర్వహించారు. చిత్తూరు, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, కర్నూలు, అనంతపురం, వైఎస్ఆర్ జిల్లాల నుంచి సుమారు 250 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో ఉత్తీర్ణులైన విద్యార్థులు డిసెంబర్ 5న హైదరాబాద్‌లో జరిగే సాక్షి స్పెల్‌బీ ఫైనల్ పరీక్షకు హాజరవుతారని నిర్వాహకులు తెలిపారు. -
‘సాక్షి ఇండియా స్పెల్ బీ’
రెండో విడత ఫలితాల విడుదల 23వ తేదీన మూడో విడత పోటీలు సాక్షి, హైదరాబాద్: ‘సాక్షి ఇండియా స్పెల్ బీ 2014’ రెండో విడత పోటీల ఫలితాలు విడుదలయ్యాయి. www.indiaspellbee.inవెబ్సైట్లో విజేతల వివరాలను చూడవచ్చు. నవంబర్ 23వ తేదీన మూడో విడత పోటీలు జరుగుతాయి. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిలలో ఈ పోటీలను నిర్వహిస్తారు. -
20వ తేదీలోగా సాక్షి స్పెల్‌బీకి దరఖాస్తు చేసుకోవాలి
విజయనగరం టౌన్: సాక్షి ఇండియా స్పెల్ బీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘స్పెల్‌బీ’ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా అనూహ్య స్పందన లభిస్తోంది. పాఠశాలల యాజమాన్యాలు, విద్యార్థులు స్పెల్‌బీలో పాల్గొనేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఈ నేపథ్యంలో దసరా, విజయనగరం పైడితల్లి అమ్మవారి పండగల సెలవులు రావడంతో రిజిస్ట్రేషన్ల గడువును పెంపుదల చేయాలంటూ ఆయా పాఠశాలల యాజమాన్యాలు, విద్యార్థుల కోరిక మేరకు ఈ నెల 20 వరకూ గడువు పొడిగిస్తున్నట్లు సంస్థ నిర్వాహకులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రిజిస్ట్రేషన్లను త్వరితగతిన చేయించుకునేందుకు పాఠశాలల యజమానులు సిద్ధం కావాలని కోరారు. రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిన వారు 9951602843 నంబరును సంప్రదించాలని నిర్వాహకులు సూచించారు. -
‘సాక్షి ఇండియా స్పెల్‌బీ’కి సెప్టెంబర్ 4 ఆఖరి గడువు
హైదరాబాద్: దేశంలోనే ప్రతిష్టాత్మకమైన ‘సాక్షి ఇండియా స్పెల్ బీ’ పోటీలకు రిజిస్ట్రేషన్లు జోరుగా సాగుతున్నాయి. ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకూ విద్యార్థుల్లో ఆంగ్ల భాషా పదాల స్పెల్లింగ్ సామర్థ్యాన్ని పరీక్షించే ఈ పోటీలకు ఆగస్టు 1 నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. రిజిస్ట్రేషన్ల నమోదుకు చివరి తేదీ సెప్టెంబర్ 4. ఈ పోటీలకు www.indiaspellbee.in వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. లేదా 9505551099, 9705199924, 040-23322330/23256134 నంబర్లలో సంప్రదించవచ్చు. రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి ఇంగ్లిషు పదాలు, వ్యాకరణంతో కూడిన రిఫరెన్స్ బుక్‌ను అందజేస్తారు. నాలుగు కేటగిరీల్లో జరిగే ఈ పోటీల్లో మొదటి కేటగిరీలో ఒకటి, రెండో తరగతులు.. రెండో కేటగిరీలో మూడు, నాలుగు తరగతులు.. మూ డో కేటగిరీలో ఐదు, ఆరు, ఏడు తరగతులు.. నాల్గో కేటగిరీలో 8, 9, 10 తరగతుల విద్యార్థులకు పోటీ జరుగుతుంది. ఈ పోటీలు నాలుగు దశల్లో జరుగుతాయి. మూడు దశలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంయుక్తంగా నిర్వహిస్తుండగా.. నాలుగో దశ అయిన ఫైనల్స్‌ను ఇరు రాష్ట్రాలకు వేర్వేరుగా నిర్వహిస్తారు. తొలిదశలో పాఠశాలల స్థాయిలో ‘ఇండియా స్పెల్లింగ్ బీ’ ప్రశ్నపత్రంతో అక్టోబర్ 15న రాత పరీక్ష ఉంటుంది. ఇందులో ఎంపికైన విద్యార్థులతో రెండో దశ (క్వార్టర్ ఫైనల్స్)లో నవంబర్ 9న జిల్లా కేంద్రాల్లో రాత పరీక్ష ఉంటుంది. ఇందులో సాక్షి టీవీ ద్వారా నిపుణులు లైవ్‌లో ఆంగ్ల పదాలను విద్యార్థులకు చెబుతుంటే.. సమాధాన పత్రంపై రాయాల్సి ఉంటుంది. మూడో దశ (సెమీ ఫైనల్స్)లో కూడా రెండో దశ తరహాలోనే పరీక్ష ఉంటుంది. ఎంపికైన విద్యార్థులతో హైదరాబాద్, విశాఖ, విజయవాడ, తిరుపతి కేంద్రాల్లో పోటీ నిర్వహిస్తారు. ఇక నాలుగో దశ అయిన ఫైనల్స్ కోసం ఒక్కో కేటగిరీ నుంచి పది మంది విద్యార్థులను ఎంపిక చేసి.. తెలంగాణ, ఏపీలకు వేర్వేరుగా హైదరాబాద్‌లో పోటీ నిర్వహిస్తారు. ఫైనల్ విజేతలకు ఇరు రాష్ట్రాలకు వేర్వేరుగా.. మొదటి బహుమతి కింద బంగారు పతకం, రూ. 25 వేల నగదు అందజేస్తారు. రెండో బహుమతిగా రజత పతకం, రూ. 15 వేల నగదు.. మూడో బహుమతిగా కాంస్య పతకం, రూ. 10 వేల నగదు అందజేస్తారు. రెండు, మూడో దశల్లో లైవ్‌గా నిర్వహించే ఈ పోటీల్లో ప్రేక్షకులు కూడా స్పెల్లింగ్‌లను వెంటనే ఎస్సెమ్మెస్ చేసి బహుమతులు పొందవచ్చు. -
సాక్షి స్పెల్ బీ 2014 కాంటెస్ట్ ప్రోమో.
-
ఇండియా స్పెల్‌బి జోనల్ ఫైనల్స్ కేటగిరీ - 2
-
సాక్షి ఇండియా స్పెల్‌బీకి విశేష స్పందన
హైదరాబాద్: సాక్షి మీడియా గ్రూప్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 'సాక్షి ఇండియా స్పెల్ బీ 2013 - పవర్డ్ బై పెప్‌స్సోడెంట్' జోనల్ రౌండ్స్ విజయవంతంగా పూర్తయ్యాయి. టెలివిజిన్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా సాక్షి మీడియా గ్రూప్ విద్యార్థులకు లైవ్‌లో రాతపరీక్ష నిర్వహించింది. ఈ జోనల్ రౌండ్స్‌లో అర్హత సాధించిన విద్యార్థులు సెమీఫైనల్స్‌కు చేరతారు. అతి త్వరలోనే సెమీఫైనల్స్ నిర్వహిస్తారు. ఈ స్పెల్‌బీ పరీక్షకు కరీంనగర్లో మంచి స్పందన లభించింది. కరీంనగర్లో జరిగిన జోనల్ టెస్ట్‌కు కరీంనగర్‌తో పాటు వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి విద్యార్థులు హజరయ్యారు. మొత్తం 250 మంది విద్యార్థులు పాల్గొన్నారు. మొత్తం నాలుగు కేటగిరీల్లో పరీక్ష నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో అశేష స్పందన లభించింది. వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఈ పోటీ పరీక్షలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఫ్యూచర్ కిడ్స్ స్కూల్లో పరీక్ష నిర్వహించారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి 494 మంది విద్యార్థులు పాల్గొన్నారు. -
సాక్షి ఇండియా స్పెల్‌బీ 2012 విజేతలతో చిట్‌చాట్
-
సాక్షి ఇండియా స్పెల్‌బీ పోటీలకు రిజిస్ట్రేషన్లు ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: సాక్షి ఇండియా స్పెల్ బీ (ఇంగ్లిష్ పదాల స్పెల్లింగ్)-2013 పోటీలకు రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొనవచ్చు. వారిని నాలుగు కేటగిరీలుగా విభజించి పోటీలు నిర్వహిస్తారు. నవంబర్ మొదటివారంలోగా పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పోటీల్లో తొలిరౌండ్‌ను పాఠశాలల తరఫున రిజిస్టర్ చేసుకున్నవారికి నవంబర్ 22న వారి పాఠశాలల్లో, వ్యక్తిగతంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నవారికి నవంబర్ 24న నిర్ధారిత ప్రాంతాల్లో నిర్వహిస్తారు. ఈ పోటీలు నిర్వహించే వేదికలు, సమయం తదితర వివరాలను ఈ-మెయిల్ ద్వారా అందజేస్తామని నిర్వాహకులు ప్రకటించారు. పోటీల్లో విజేతలకు ట్రోఫీతో పాటు నగదు బహుమతులు అందజేస్తామని వెల్లడించారు. పోటీల్లో పాల్గొన్న ప్రతీ విద్యార్థికి ప్రశంసా పత్రము అందజేస్తామని చెప్పారు. మరిన్ని వివరాలకు www.indiaspellbee.inలో లేదా 040-23322330, 040- 23256134లో సంప్రదించవచ్చని పేర్కొన్నారు. -
Sakshi India Spell bee 2013
-
సెప్టెంబర్ నుంచి సాక్షి స్పెల్‌బీ పోటీలు