సాక్షి ఇండియా స్పెల్‌బీ పోటీలకు రిజిస్ట్రేషన్లు ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: సాక్షి ఇండియా స్పెల్ బీ (ఇంగ్లిష్ పదాల స్పెల్లింగ్)-2013 పోటీలకు రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొనవచ్చు. వారిని నాలుగు కేటగిరీలుగా విభజించి పోటీలు నిర్వహిస్తారు. నవంబర్ మొదటివారంలోగా పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
ఈ పోటీల్లో తొలిరౌండ్‌ను పాఠశాలల తరఫున రిజిస్టర్ చేసుకున్నవారికి నవంబర్ 22న వారి పాఠశాలల్లో, వ్యక్తిగతంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నవారికి నవంబర్ 24న నిర్ధారిత ప్రాంతాల్లో నిర్వహిస్తారు. ఈ పోటీలు నిర్వహించే వేదికలు, సమయం తదితర వివరాలను ఈ-మెయిల్ ద్వారా అందజేస్తామని నిర్వాహకులు ప్రకటించారు. పోటీల్లో విజేతలకు ట్రోఫీతో పాటు నగదు బహుమతులు అందజేస్తామని వెల్లడించారు. పోటీల్లో పాల్గొన్న ప్రతీ విద్యార్థికి ప్రశంసా పత్రము అందజేస్తామని చెప్పారు. మరిన్ని వివరాలకు www.indiaspellbee.inలో లేదా 040-23322330, 040- 23256134లో సంప్రదించవచ్చని పేర్కొన్నారు.