అమితాబ్, సారిక జోడీగా! | Sarika pairs up with Amitabh Bachchan | Sakshi
Sakshi News home page

అమితాబ్, సారిక జోడీగా!

Published Sun, Apr 20 2014 10:40 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

Sarika pairs up with Amitabh Bachchan

అమితాబ్ బచ్చన్, సారిక జంటగా నటిస్తున్నారా? బాలీవుడ్ వార్తల ప్రకారం ఔననే చెప్పాలి. అయితే, ఈ ఇద్దరూ కలిసి నటిస్తున్నది వెండితెర కోసం కాదు. బుల్లితెరపై ఈ జోడీ కనిపించనుంది. 30, 35 ఎపిసోడ్స్‌గా సాగే ఓ ధారావాహికలో ఈ ఇద్దరూ నటిస్తున్నారు. ఇందులో అమితాబ్‌కు ఇద్దరు భార్యలు ఉంటారట. మొదటి భార్యకు దూరమైనప్పటికీ,  ఆ తర్వాత తమ కుమార్తె ద్వారా దగ్గరవుతారట అమితాబ్. ఆ మొదటి భార్య పాత్రను సారిక చేస్తున్నారు. ఈ ధారావాహికకు అమితాబ్ ఓ నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. ఈ ఏడాది చివర్లో ఈ ధారావాహిక ప్రసారం కానుందని సమాచారం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement