
అనురూప్ రెడ్డి, దేవా మలిశెట్టి, సారిక, మానస ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ప్రేమించొద్దు’. శిరిన్ శ్రీరామ్ దర్శక నిర్మాణంలో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా తెరకెక్కుతుంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్నట్లు మేకర్స్ తెలిపారు. పాన్ ఇండియా చిత్రంగా ఐదు భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం తెలుగు వెర్షన్‌ని జూన్ 7న విడుదల కానుంది.
ఈ సందర్భంగా చిత్ర దర్శకనిర్మాత శిరిన్ శ్రీరామ్ మాట్లాడుతూ ‘‘యువతలో చాలా మంది నిజమైన ప్రేమకు, ఆకర్షణకు తేడా తెలియకుండా తప్పటడుగులు వేస్తున్నారు. ఇది వారి జీవితాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోందనే కోణం లో ‘ప్రేమించొద్దు’ అనే శీర్షిక తో ఈ సినిమాను తెరకెక్కించాం.
ఇది పాన్ ఇండియాలో రిలీజ్ అవుతోన్న వాస్తవ సంఘటనల ఆధారంగా తీసిన చిత్రం. అందరికీ కనెక్ట్ అయ్యే కథాంశంతో వస్తోన్న సినిమా కావటంతో సినిమాను జూన్ 7న విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నాం. అలాగే తెలుగు లో విడుదల చేసిన తర్వాత, త్వరలో తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ చేయటానికి కూడా ప్లాన్ చేస్తున్నాం’అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment