రాజయ్య కోడలు మరణం; అన్ని కోణాల్లో దర్యాప్తు | police probe all angles in siricilla rajaiah daughter-in-law death case | Sakshi
Sakshi News home page

రాజయ్య కోడలు మరణం; అన్ని కోణాల్లో దర్యాప్తు

Published Wed, Nov 4 2015 2:02 PM | Last Updated on Tue, Nov 6 2018 4:04 PM

రాజయ్య కోడలు మరణం; అన్ని కోణాల్లో దర్యాప్తు - Sakshi

రాజయ్య కోడలు మరణం; అన్ని కోణాల్లో దర్యాప్తు

వరంగల్: కాంగ్రెస్ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక, మనవళ్లు మరణించిన ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని ఐజీ నవీన్ చంద్ తెలిపారు. దర్యాప్తు పూర్తయ్యే వరకు ఘటన ఎలా జరిగిందో చెప్పలేమన్నారు. డీఐజీ మల్లారెడ్డితో కలిసి రాజయ్య ఇంటిని ఆయన పరిశీలించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ... తెల్లవారుజామున 4 గంటలకు ఈ ఘటన జరిగిందని, 5 గంటలకు పోలీసులకు సమాచారం అందిందని తెలిపారు. రాజయ్య కోడలు, ముగ్గురు మనవళ్లు మృతి చెందారని చెప్పారు. క్లూస్ టీమ్, ఫోరెన్సిక్ నిపుణులు వివరాలు సేకరించారని చెప్పారు. రాజయ్య కోడలు, మనవళ్లు మృతి చెందిన గదిలో గ్యాస్ సిలెండర్ మాత్రమే ఉందన్నారు. ఘటన జరిగినప్పుడు సారిక భర్త అనిల్ ఎక్కడున్నారనే దానిపై దర్యాప్తు చేస్తున్నట్టు నవీన్ చంద్ తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement