
హీరోయిన్ సాయిపల్లవి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. అందంతో పాటు అభినయంతోనూ ఎంతో మంది అభిమానాన్ని సొంతం చేసుకుందీ భామ. ఇటీవలె శ్యామ్‌సింగరాయ్‌తో హిట్టు కొట్టిన సాయిపల్లవి త్వరలోనే విరాటపర్వం సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతోంది. ఇదిలా ఉండగా సాయిపల్లవి తమిళంలో ఓ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
శివ కార్తికేయన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాను కమల్‌హాసన్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి 'మావీరన్' అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. కమల్‌హాసన్ నిర్మిస్తున్న ప్రాజెక్ట్ కావడం, ఇందులో సాయిపల్లవి నటించనుండంతో ఇప్పటికే ఈ చిత్రంపై హైప్ క్రియేట్ అయ్యింది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment