చెన్నై : మలయాళంలో 'ప్రేమమ్' సినిమాతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ సాయిపల్లవి. కాలేజీ లెక్చరర్‌గా ఆమె పోషించిన పాత్రతో దేశవ్యాప్తంగా అభిమానులను తన సొంతం చేసుకుంది. మలయాళ కుట్టి అయినప్పటికీ.. ఫిదా సినిమాలో అచ్చ తెలంగాణ అమ్మాయిలా నటించి ఇటు తెలుగు వారి మనసుకు దగ్గరైపోయింది. ప్రస్తుతం కణం సినిమాతో మరోసారి తెలుగు ప్రజలను అలరించబోతుంది. అయితే ఆమె నటించిన తొలి సినిమా దగ్గరి నుంచి సాయిపల్లవి మేకప్ వేసుకోకుండా నటించడం మనం చూస్తూ ఉన్నాం. ఆమె మేకప్‌కు ప్రాధాన్యత ఇవ్వదని ఇట్టే తెలిసిపోతుంది. తాను మేకప్ వేసుకోకుండా నటించడానికి గల కారణాన్ని సాయిపల్లవి టైమ్స్ ఆఫ్ ఇండియాకు రివీల్ చేసింది.
ముఖంపై మొటిమలు చూసి భయపడిన టీనేజర్లలో తానూ ఉన్నానని, కొన్నిసార్లు నా ముఖాన్ని చున్నీతో దాచుకునే దాన్ని అని తెలిపింది. అయితే 'ప్రేమమ్' షూటింగ్ సమయంలో తన ఆలోచనలో మార్పు వచ్చిందని, ప్రేమమ్ డైరెక్టర్ ఆల్ఫోన్స్ పుతరెన్, తనను కాస్మోటిక్స్ వాడకుండా సహజంగా నటించడానికి ప్రోత్సహించారని ఆమె చెప్పింది. ఇలా డైరెక్టర్లందరూ తనలో ఆత్మవిశ్వాసాన్ని నింపడానికి, మేకప్ వాడకుండా నటించడానికి ప్రోత్సహించారని పేర్కొంది. తనలాంటి అమ్మాయిలందరికీ ఆత్మస్థైరాన్ని నింపడానికి ఇది ఒక ప్రయత్నమని సాయిపల్లవి తెలిపింది. భవిష్యత్తులో కూడా మేకప్ లేకుండా నటించడానికే ఇష్టపడతానని చెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment