హత్యకూ హోమానికి లింక్‌ ఏంటి? | Sai Pallavi's Karu Movie release on February 9 | Sakshi

హత్యకూ హోమానికి లింక్‌ ఏంటి?

Dec 17 2017 1:16 AM | Updated on Dec 17 2017 1:16 AM

Sai Pallavi's Karu Movie release on February 9  - Sakshi

గౌరవమే ఆస్తిగా భావించే కుటుంబం అది. కొత్తగా పెళ్లైన దంపతులు. అంతలోనే వాళ్లను ఓ మర్డర్‌ మిస్టరీ వెంటాడుతుంది. ఆపై హోమాలు. ఈ మర్డర్‌కి, హోమాలకీ సంబంధం ఏమిటి? ఈ పరిస్థితుల నుంచి ఆ కుటుంబం ఎలా బయటపడగలిగింది? అని తెలుసుకోవాలంటే మా సినిమా చూడాల్సిందే అంటున్నారు ‘కరు’ చిత్రబృందం.

నాగశౌర్య, సాయి పల్లవి జంటగా ఏఎల్‌ విజయ్‌ దర్శకత్వంలో తమిళ, తెలుగులో రూపొందిన చిత్రం ‘కరు’. తెలుగులో ‘కణం’ పేరుతో విడుదల కానుంది. లైకా ప్రొడక్షన్స్‌ పతాకంపై సుభాష్‌ కరణ్‌ నిర్మిస్తున్న ఈ సినిమాను ఫిబ్రవరి 9న రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు. ‘‘నాగశౌర్య, సాయి పల్లవి బాగా నటించారు. ఫిబ్రవరి 9న సినిమా రిలీజ్‌ అవుతుంది. డైరెక్టర్‌ విజయ్‌ ఈజ్‌ రెడీ టు గివ్‌ బర్త్‌’’ అని నిర్మాతలు పేర్కొన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ఎస్‌. ప్రేమ్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement