
అందమైన అమ్మాయిని చూసినప్పుడు అబ్బాయిల మనసు పడి పడి లేస్తుంది. శర్వానంద్‌కి కూడా ఓ అమ్మాయి కనిపించింది. అందమైన ఆ అమ్మాయి లేత బుగ్గపై ఉన్న మొటిమలు తనకు ముత్యాల్లా అనిపించాయి. అమ్మాయి మనసు కూడా అబ్బాయికి ఫిదా అవుతుంది. మరి.. ఈ ఇద్దరి ప్రేమకథ ఎంతవరకూ వచ్చిందంటే కోల్‌కత్తాలో మొదలై ప్రస్తుతానికి హైదరాబాద్ వచ్చింది.
శర్వానంద్, సాయి పల్లవి జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రసాద్ చుక్కపల్లి, సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న సినిమా ‘పడి పడి లేచె మనసు’. బుధవారం హీరోయిన్ సాయి పల్లవి పుట్టినరోజు సందర్భంగా సినిమాలోని ఓ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ చిత్రం కోసం కోల్‌కతాలో కీలక సన్నివేశాలు తీశారు. ‘‘టిపికల్ యూత్‌ఫుల్ లవ్‌స్టోరీ మూవీ ఇది. హైదరాబాద్‌లో ప్లాన్ చేసిన భారీ షెడ్యూల్ ఈ నెల 11న మొదలవుతుంది’’ అని పేర్కొన్నారు చిత్రబృందం. ఈ చిత్రానికి సంగీతం: విశాల్ చంద్రశేఖర్.
Comments
Please login to add a commentAdd a comment