నాని సినిమా కోసం హైదరాబాద్‌లో కోల్‌కత్తా | Massive set under construction for Nani Shyam Singha Roy | Sakshi
Sakshi News home page

నాని సినిమా కోసం హైదరాబాద్‌లో కోల్‌కత్తా

Published Mon, Apr 19 2021 6:32 AM | Last Updated on Mon, Apr 19 2021 8:39 AM

Massive set under construction for Nani Shyam Singha Roy - Sakshi

కోల్‌కత్తా నగరం హైదరాబాద్‌కి వచ్చింది.. ఆశ్చర్యంగా ఉంది కదూ? ఇంతకీ విషయం ఏంటంటే.. నాని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘శ్యామ్‌ సింగరాయ్‌’. ఈ సినిమా కోసమే హైదరాబాద్‌లో కోల్‌కత్తాని సృష్టించారు. రాహుల్‌ సంకృత్యాన్‌ దర్శకత్వంలో వెంకట్‌ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రంలో సాయిపల్లవి, కృతీ శెట్టి, మడోనా సెబాస్టియన్‌ కథానాయికలు. ఈ సినిమా కోసం ఆర్ట్‌ డైరెక్టర్‌ అవినాష్‌ కొల్ల కోల్‌కత్తాను తలపించే భారీ సెట్‌ను హైదరాబాద్‌లో సృష్టించారు. ఆరున్నర కోట్లతో పదెకరాల్లో నిర్మించిన ఈ భారీ సెట్‌లో ఫైనల్‌ షెడ్యూల్‌ షూటింగ్‌ జరుగుతోంది.

నాని సహా ముఖ్యతారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ‘‘ఓ యునిక్‌ కాన్సెప్ట్‌తో రాహుల్‌ సంకృత్యాన్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో తన గత చిత్రాలకు భిన్నమైన సరికొత్త గెటప్స్‌లో నాని కనిపిస్తారు. కోల్‌కత్తా సన్నివేశాలు సినీ ప్రియులకి ఒక కొత్త అనుభూతిని పంచుతాయి’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జే మేయర్, కెమెరా: సను జాన్‌ వర్గీస్, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ఎస్‌. వెంకటరత్నం (వెంకట్‌).

చదవండి: పాయల్‌ నెంబర్‌ చెప్పండంటూ ఆమె ప్రియుడికి రిక్వెస్ట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement