liji
-
ఫిలింఫేర్ అవార్డ్స్ హంగామా
జియో 65 సౌత్ ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో దక్షణాది ఇండస్ట్రీలకు సంబంధించిన పలువురు తారలు పాల్గొని అవార్డులను అందుకున్నారు. ఈ ఈవెంట్‌ను సందీప్ కిషన్, రాహుల్ రవీంద్రన్ హోస్ట్ చేశారు. రకుల్ ప్రీత్‌సింగ్, రెజీనా డ్యాన్స్ పర్ఫార్మెన్స్లు హైలైట్‌గా నిలిచాయి. ఉత్తమ తెలుగు చిత్రంగా ‘బాహుబలి: ది కన్‌క్లూజన్’, ఉత్తమ దర్శకుడు : రాజమౌళి (బాహుబలి: ది కన్‌క్లూజన్) ఉత్తమ నటుడిగా విజయ్ దేవరకొండ (అర్జున్ రెడ్డి), విమర్శకుల ఉత్తమ నటుడు వెంకటేశ్ (గురు), ఉత్తమ నటి: సాయి పల్లవి (ఫిదా), విమర్శకుల ఉత్తమ నటి : రితికా సింగ్ (గురు), ఉత్తమ సహాయ నటుడు : రానా దగ్గుబాటి (బాహుబలి: ది కన్‌క్లూజన్ ), ఉత్తమ సహాయ నటి : రమ్యకృష్ణ (బాహుబలి: ది కన్‌క్లూజన్), ఉత్తమ సంగీత దర్శకుడు, సాహిత్యం : కీరవాణి (బాహుబలి: ది కన్‌క్లూజన్), ఉత్తమ తొలి చిత్ర కథానాయిక : కల్యాణి ప్రియదర్శన్, ఉత్తమ ఛాయాగ్రాహకుడు: సెంథిల్ కుమార్ (బాహుబలి: ది కన్‌క్లూజన్), ఉత్తమ కొరియోగ్రాఫర్: శేఖర్ (ఖైది నెం:150, ఫిదా), జీవిత సాఫల్య పురస్కారాన్ని కైకాల సత్యనారాయణ అందుకున్నారు. తమిళం ఉత్తమ చిత్రం: ఆరమ్, మలయాళంలో ఉత్తమ నటుడిగా ఫాహిద్ ఫాజల్, కన్నడంలో పునీత్ రాజ్ కుమార్ అవార్డులను కైవసం చేసుకున్నారు. రానా, విజయ్, శోభు యార్లగడ్డ -
మరో వారసురాలి తెరంగేట్రం
తమిళసినిమా: మరో నట వారసురాలు కథానాయకిగా తెరంగేట్రం చేయడానికి రెడీ అవుతోందన్నది తాజా సమాచారం. ప్రముఖ మలయాళ దర్శకుడు ప్రియదర్శన్, నటి లిజీ కూతురు కల్యాణి కథానాయకిగా తెరంగేట్రానికి రంగం సిద్ధమైంది. దర్శకుడు ప్రియదర్శన్, లిజీలకు కల్యాణి, సిద్ధార్థ్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా రెండేళ్ల కిందట ప్రియదర్శన్, లిజీ మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. అయితే పిల్లలు లిజీ సంరక్షణలోనే పెరుగుతున్నారు. న్యూయార్క్‌లో చదువు పూర్తి చేసిన కల్యాణి సినీరంగంపై ఆసక్తి కనబరుస్తోంది. ఇప్పటికే విక్రమ్, నయనతార జంటగా నటించిన ఇరుముగన్ చిత్రానికి సహాయదర్శకురాలిగా పని చేసింది. కాగా కల్యాణిని కథానాయకి చేసే పనిలో ఆమె తల్లి లిజీ ముమ్మరంగా ఉన్నట్లు సమాచారం. తాజాగా దర్శకుడు విక్రమ్‌కుమార్ దర్శక్వతం వహిస్తున్న తెలుగు చిత్రంలో యువ నటుడు అఖిల్‌కు జంటగా కల్యాణి ఎంపికయినట్లు తాజా సమాచారం. నాగార్జున నిర్మించనున్న ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. మరో పది రోజుల్లో కల్యాణి ఈ షూటింగ్లో జాయిన్ కానున్నట్లు సినీవర్గాల సమాచారం. కాగా విక్రమ్‌కుమార్ కల్యాణి తండ్రి, దర్శకుడు ప్రియదర్శన్ శిష్యుడన్నది గమనార్హం. అదే విధంగా కల్యాణి మరో మలయాళ చిత్రంలో నటించే విషయమై చర్చలు జరుగుతున్నాయని తెలిసింది.