సరికొత్తగా కల్యాణి రీ ఎంట్రీ.. నటిగా మాత్రం కాదు.. | Actor Kalyani Re Entry As a Director In Movie | Sakshi
Sakshi News home page

సరికొత్తగా కల్యాణి రీ ఎంట్రీ.. నటిగా మాత్రం కాదు..

Published Sat, May 1 2021 2:30 PM | Last Updated on Sat, May 1 2021 4:29 PM

Actor Kalyani Re Entry As a Director In Movie - Sakshi

జీవిత రాజశేఖర్‌ హిట్‌ మూవీ ‘శేషు’తో హీరోయిన్‌గా తెలుగు తెరకుపరిచమైంది నటి కల్యాణి. ఆ తర్వాత ఆమె నటించిన రెండో చిత్రం ‘జౌను.. వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు’కు ఉత్తమ నటిగా నంది అవార్డును అందుకుంది. ఇందులో ఆమె రవితేజ సరసన నటించిన సంగతి తెలిసిందే. దీంతో టాలీవుడ్‌లో వాంటెడ్‌ హీరోయిన్‌గా మారిన కల్యాణి తెలుగు, తమిళ, కన్నడ బాషల్లో కూడా నటించింది.

ఈ నేపథ్యంలో ఆమెకు సినిమా అవకాశాలు తగ్గడంతో బిగ్‌బాస్‌ ఫేం సూర్య కిరణ్‌ను పెళ్లి చేసుకుని సెటిలైయిపోయింది. పెళ్లి తర్వాత కూడా ఆమె వదిన వంటి క్యారెక్టర్లు చేసినప్పటికి అంతగా గుర్తింపు రాలేదు. దీంతో ఆమె సినిమాలకు పూర్తిగా బ్రేక్‌ ఇచ్చింది. అయితే తన భర్తతో కలిసి ఆమె మైదాస్‌ టచ్‌ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇటూ ఇంటి పనులను అటూ నిర్మాణ సంస్థ పనులను చూసుకుంటున్న కల్యాణి సరికొత్తగా సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వనుంది.

తన నిర్మాణ సంస్థలో కల్యాణి ఓ మూమీని డైరెక్ట్‌ చేస్తున్నట్లు గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.  తన డైరెక్షన్‌లో చేతన్‌ శ్రీను అనే యంగ్‌ హీరోను పరిచయం చేయనుంది ఆమె. ఇక ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన పొస్ట్‌ప్రొడక్షన్‌ పనులు కూడా పూర్తి కావడంతో త్వరలోనే షూటింగ్‌ ప్రారంభించేందుకు ఆమె సన్నాహాలు చేస్తుంది. ప్రస్తుత కరోనా పరిస్థితులు సాధారణ స్థితికి రాగానే ఈ మూవీని పట్టాలెక్కించనుందట. అయితే హోలీ పండుగ సందర్భంగా విడుదలైన ఈ మూవీ ఫస్ట్‌లుక్‌ పాజిటివ్‌ రెస్పాన్స్‌ అందుకుంది. అందరి నటినటుల్లా కాకుండా కల్యాణి కాస్తా డిఫరెంట్‌ రీ ఎంట్రీతో డైరెక్టర్‌గా పరిచయం కానుంది.

చదవండి:
నేను హ్యాంగ్‌ అవుట్‌ అయ్యేది అక్కడే : అల్లు శిరీష్
నా కోసం రామ్‌చరణ్‌ అలా చేయడం సంతోషాన్నిచ్చింది :అనసూయ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement