గుంటూరు జిల్లా రెంటచింతల పట్టణంలోని ఓ మద్యం దుకాణంలో బుధవారం రాత్రి చోరీ జరిగింది. గుర్తు తెలియని దుండగులు విజయా థియేటర్ సమీపంలోని కల్యాణి వైన్స్ పైకప్పు రేకులను తొలగించి లోపలికి ప్రవేశించారు. క్యాష్ కౌంటర్‌లో ఉన్న రూ.85 వేల విలువైన నగదును ఎత్తుకుపోయారు. గురువారం ఉదయం నిర్వాహకుల ఫిర్యాదు మేరకు ఏఎస్సై సాంబశివరావు సంఘటన స్థలాన్ని పరిశీలించి, వివరాలు తెలుసుకున్నారు. డాగ్ స్క్వాడ్‌ను రప్పించారు.