పాత కక్ష్యల నేపథ్యంలో ఓ వ్యక్తిని అతి దారుణంగా కత్తులతో నరికి హత్య చేశారు.
నగరం: పాత కక్ష్యల నేపథ్యంలో ఓ వ్యక్తిని అతి దారుణంగా కత్తులతో నరికి హత్య చేశారు. ఈ సంఘటన గుంటూరు జిల్లా నగరం మండలం పూడివాడ పడమటి పాలెం గ్రామంలో గురువారం వెలుగు చూసింది. వివరాలు.. గ్రామానికి చెందిన మోర్ల వెంకటసాంబశివరావు(55) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ రోజు గ్రామ శివారులో సాంబశివరావు మృత దేహమై కనిపించాడు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. హత్య జరిగి దాదాపు రెండు రోజులై ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.