
అమ్మయినా.. అమ్మాయైనా!
మహిళలు సగం కాదు.
మహిళలు సగం కాదు... ఇంకా ఎక్కువే అంటున్నాయి బ్యాంకులు, ఆర్థిక సంస్థలు. ఎస్‌బీఐ, బజాజ్ అలయంజ్ జనరల్ వంటి సంస్థలు మహిళల కోసం ప్రత్యేక శాఖలను ప్రారంభించినా... కేంద్ర ప్రభుత్వం మహిళల కోసం ఏకంగా బ్యాంకునే సృష్టించినా... అవన్నీ వారికిస్తున్న ప్రాధాన్యాన్ని తెలిపేవే. వీటన్నిటికీ తోడు ప్రత్యేక పథకాలు ఎటూ ఉన్నాయి. అదే ఈవారం ప్రత్యేకం...
పాలసీలు...
బజాజ్ అలయంజ్
క్రిటికల్ ఇల్‌నెస్ కవర్..
మహిళలు ప్రధానంగా ఎదుర్కొనే ఎనిమిది రకాల వ్యాధులకు రక్షణ కల్పించేలా బజాజ్ అలయంజ్ క్రిటికల్ ఇల్‌నెస్ కవర్‌ను అందిస్తోంది. రొమ్ము కేన్సర్, గర్భాశయ కేన్సర్ వంటి వివిధ కేన్సర్లతో పాటు, గాయాలకు కూడా దీనిద్వారా బీమా రక్షణ లభిస్తుంది. ఇది మెడిక్లెయిమ్ పాలసీకాదు. దీన్లో పేర్కొన్న వ్యాధులకు గాను చికిత్స కోసం చేరితే చికిత్సా వ్యయంతో సంబంధం లేకుండా మొత్తం సొమ్మును ఇవ్వడం జరుగుతుంది.
హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ స్మార్ట్ ఉమన్ యులిప్...
ఇది యులిప్ పాలసీ. ఇందులో నాలుగు రకాల ఫండ్స్ అందుబాటులో ఉన్నాయి. సాధారణ యులిప్స్‌లా కాకుండా ఇది మహిళల జీవితంలో వివిధ సందర్భాలకు అనుగుణమైన కవరేజిని అందిస్తుంది. ప్రసవం, తీవ్రమైన అనారోగ్యం, జీవిత భాగస్వామి ఆకస్మిక మరణం వంటి సమయాల్లో ఈ పాలసీ కవరేజీ ఉపయోగపడుతుంది.
టాటా ఏఐజీ వెల్‌ష్యూరెన్స్ ఉమన్..
ఇటు హాస్పిటలైజేషన్ ప్రయోజనాలతో పాటు క్రిటికల్ ఇల్‌నెస్ కవరేజి కూడా ఇది కల్పిస్తుంది.కేన్సర్, గుండెపోటు సహా 11 రకాల అనారోగ్యాలు తలెత్తిన పక్షంలో ఏకమొత్తంగా కవరేజి సొమ్ము చెల్లిస్తుంది. అదే కేన్సర్ అయితే అధిక బీమా రక్షణను కల్పిస్తోంది.
సేవింగ్స్ ఖాతాలు...
400 రోజుల డిపాజిట్...
స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ మహిళల కోసం పరిమిత కాలానికి 400 రోజుల డిపాజిట్ పథకాన్ని కొత్తగా ప్రకటించింది. ఈ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అత్యధికంగా 9.25 శాతం వార్షిక వడ్డీని ఆఫర్ చేస్తోంది. ఇక సీనియర్ సిటిజన్లయితే వడ్డీ 9.55 శాతంగా ఉంది. ఈ ప్రత్యేక ఆఫర్ మార్చి 7 నుంచి 10 వరకు మాత్రమేనని ఎస్‌బీహెచ్ బుధవారం ప్రకటించింది.
అడ్వాంటేజ్ ఉమన్ సేవింగ్స్ ఖాతా
రూ. 2000 రికరింగ్ డిపాజిట్‌తో (ఆర్‌డీ) ఉచితంగా జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ ఖాతా.
మహిళల కోసం ప్రత్యేకమైన ఇంటర్నేషనల్ ఉమన్ డెబిట్ కార్డులు. లాక్మే సెలూన్, తారా జ్యుయలర్స్ వంటి సంస్థల్లో వీటిని ఉపయోగించినప్పుడు 15 శాతం మేర డిస్కౌంట్లు.ర్‌డీ కొనసాగించినంత కాలం సేవింగ్స్ ఖాతాకు జీరో బ్యాలెన్స్ విధానం వర్తిస్తుంది. ఆర్‌డీ ఆపేస్తే కనీస బ్యాలెన్స్ నిబంధనలు వర్తిస్తాయి.
సూపర్ శక్తి
జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ ఖాతాపద్దెనిమిదేళ్ల లోపు పిల్లలు ఇద్దరికి ఉచిత ఖాతాలు నిబంధనలను బట్టి లాకర్ సర్వీసులపై 25% వరకూ డిస్కౌంటు షేర్ల లావాదేవీలకు ఉపయోగపడే డీమ్యాట్ ఖాతా వార్షిక చార్జీల్లో 50%డిస్కౌంటుఇతర బ్యాంకుల ఏటీఎంలలో పది దాకా ఉచిత లావాదేవీలకు వెసులుబాట మహిళల కోసం ప్రత్యేక ఇంటర్నేషనల్ ఏటీఎం కమ్ డెబిట్ కార్డు
ప్రత్యేక గృహ రుణాలు...
ఎస్‌బీఐ మహిళలకిచ్చే గృహ రుణాలపై 0.05 శాతం తక్కువ వడ్డీ వసూలు చేస్తోంది. రూ.75 లక్షల లోపు రుణాలపై 10.10 శాతం, అంతకు మించితే 10.25 శాతం మేర వడ్డీ రేటు వసూలు చేస్తోంది. ఇతరులకు ఈ వడ్డీ రేటు 10.15-10.30 శాతంగా ఉంది.
ఐసీఐసీఐ బ్యాంకు కూడా ఎస్‌బీఐ మాదిరిగానే మహిళలకు 0.05 శాతం మేర తక్కువ వడ్డీకి గృహ రుణాలిస్తోంది. ప్రాధాన్యతా రంగం కింద రూ.25 లక్షల దాకా ఇచ్చే గృహ రుణాలపై 10.10 శాతం, అంతకు మించితే 10.20 శాతం మేర వడ్డీ రేటు వసూలు చేస్తోంది. ఇదే మొత్తానికి ఇతరులకైతే 10.15 -10.25 శాతం స్థాయిలో ఉంటోంది.
రుణాలు...
వనితా వాహన్...
కార్లు, ద్విచక్ర వాహనాలు తీసుకునే మహిళలకు ఆంధ్రాబ్యాంక్ ‘వనితా వాహన్’ పేరిట ప్రత్యేక రుణ పథకాన్ని ప్రవేశపెడుతోంది. ఈ రుణాలపై ఎలాంటి ప్రాసెసింగ్ ఛార్జీలూ ఉండవు. క్రమం తప్పకుండా బకాయిలు చెల్లిస్తే వడ్డీరేటులో 0.5 శాతం రాయితీ కూడా ఉంటుంది. కొత్త వాహనాలతో పాటు, సెకండ్ హ్యాండ్ వాహనాలపై కూడా రుణాలు లభిస్తాయి. సంపాదన ఉన్న వారికి వారి ఆదాయాన్ని బట్టి రుణం మంజూరు చేస్తారు. గృహిణులకైతే భర్త జీతంలో సగం ఆదాయాన్ని తీసుకొని రుణ విలువను లెక్కిస్తారు. అయితే రుణం తీసుకునే మహిళలకు తప్పనిసరిగా డ్రైవింగ్ లెసైన్స్ ఉండాలి.
సెంట్ కళ్యాణి
ఒకరిపై అధారపడకుండా సొంతగా జీవించాలనుకునే మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ‘సెంట్ కళ్యాణి’ పేరుతో వ్యాపార రుణాలను అందిస్తోంది. చిన్న చిన్న క్యాంటీన్లు, మొబైల్ రెస్టారెంట్లు, గార్మెంట్స్, వృత్తి నిపుణులు, చిన్న తరహా కుటీర పరిశ్రమలతో పాటు దాదాపు అన్ని రకాల వ్యాపారాలకూ రుణాలిస్తోంది. వ్యవసాయ సంబంధిత వ్యాపారాలకు కూడా ఈ రుణాలు లభిస్తాయి.
అర్వింద్, మహిమా...
{V>Ò$× ప్రాంతాల్లో ఉన్న మహిళలకు ఆర్థికంగా తోడ్పాటునిచ్చే విధంగా ప్రభుత్వరంగ విజయా బ్యాంక్... అర్వింద్, మహిమా పేరుతో రెండు రకాల రుణ పథకాలను అందిస్తోంది. వ్యవసాయేతర ఉత్పత్తులను తయారు చేసే మహిళలకి లేదా మహిళా సంఘాలకు ఈ రుణాలు మంజూరు చేస్తోంది. ఇలా తయారు చేసిన వస్తువులను విక్రయించడానికి స్వచ్ఛంద సంస్థలు, సేవా సంస్థలకు కూడా రుణాలిస్తోంది. ఈ రుణాలకు నాబార్డు 100 శాతం రీ-ఫైనాన్స్ చేస్తోంది. వ్యక్తిగతంగా గరిష్టంగా రూ.50,000 వరకు, అదే 20 మంది సభ్యులున్న సంఘాలకైతే రూ.10