
IFA Shield Football Tournament- కల్యాణి (పశ్చిమ బెంగాల్): భారత్‌లో రెండో అతి పురాతనమైన ఫుట్‌బాల్ టోర్నమెంట్ ఐఎఫ్‌ఏ షీల్డ్ ఫుట్‌బాల్ టోర్నీలో హైదరాబాద్‌కు చెందిన శ్రీనిధి డెక్కన్ ఫుట్‌బాల్ క్లబ్ (ఎస్‌డీఎఫ్‌సీ) జట్టు ఫైనల్లోకి దూసుకెళ్లింది. అదనపు సమయం వరకు జరిగిన సెమీఫైనల్లో శ్రీనిధి డెక్కన్ ఎఫ్‌సీ జట్టు 2–1 గోల్స్ తేడాతో రైల్వేస్ ఫుట్‌బాల్ క్లబ్‌పై గెలిచింది.
శ్రీనిధి డెక్కన్ జట్టు తరఫున ఫాల్గుణి సింగ్ రెండో నిమిషంలో... 118వ నిమిషంలో మల్సాజువాలా ఒక్కో గోల్ చేశారు. రైల్వే జట్టు తరఫున 14వ నిమిషంలో కెల్విన్ కెల్లీ గోల్ చేశాడు. మరో సెమీఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ రియల్ కశ్మీర్ ఎఫ్‌సీ 2–1తో గోకులం కేరళ జట్టును ఓడించి బుధవారం శ్రీనిధి ఎఫ్‌సీతో ఫైనల్ పోరుకు సిద్ధమైంది.
చదవండి: Max Verstappen: ఆఖరి బంతికి సిక్స్ కొట్టేశాడు; ఇది అతి పెద్ద తప్పిదం!