
ఎన్‌పీకుంట:(అనంతపురం) ఉమ్మబోయిన ఓ మహిళ అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయింది. పోలీసులు తెలిపిన మేరకు.. ఎన్‌పీకుంట మండలం ఎదురుదొన పంచాయతీ దాసరివాండ్లపల్లికి చెందిన డేరంగుల శివమ్మ (50) శనివారం ఉదయం రెక్కమానుకు బయలుదేరింది.
పల్లెనాయినివారిపల్లి వద్ద ఆటో ఎక్కిన ఆమె గూటిబైలు జెడ్పీ ఉన్నత పాఠశాల సమీపంలోకి చేరుకోగానే ఉమ్మడానికి తల బయటపెట్టింది. ఆదే సమయంలో ఎదురుగా అతి వేగంగా వచ్చిన బొలెరో వాహనం సైడ్ మిర్రర్ తలకు బలంగా తగలడంతో అక్కడికక్కడే ఆమె మృతి చెందింది. ఘటనపై ఎన్‌పీకుంట ఎస్‌ఐ వెంకటేశ్వర్లు కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment