వివాహితను అత్యాచారం చేశాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడిని ఢిల్లీ కోర్టు నిర్దోషిగా ప్రకటించింది.
వివాహితను అత్యాచారం చేశాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడిని ఢిల్లీ కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. పెళ్లి చేసుకుంటానని చెప్పి బాధితురాలిపై మోతి నగర్కు చెందిన 25 సమీర్ పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్టు అభియోగాలు మోపారు. అయితే కేసును క్షుణ్ణంగా విచారించిన న్యాయస్థానం.. నిందితుడిపై అత్యాచార ఆరోపణలను కొట్టివేసింది. ఇది రేప్ కేసు కాదని, వివాహేతర సంబంధానికి సంబంధించిన అంశమని పేర్కొంది.
నలుగురు పిల్లల తల్లైన బాధితురాలు.. నిందితుడిపై తప్పుడు ఆరోపణలు చేసిందని నిర్ధారించింది. తమ సంబంధం గురించి భర్తకు తెలియడంతో ఆమె ఈ పని చేసిందని తేల్చింది. భర్తను తనను ఏలుకోడన్న భయంతో ఆమె రేప్ కేసు పెట్టిందని తెలిపింది. వివాహేతర సంబంధాలు పెట్టుకున్న వారు అత్యాచార కేసులు వేయడం పెరిగిపోయిందని న్యాయస్థానం పేర్కొంది. తోడు కోసం ఒకరిని పెళ్లి చేసుకుని మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకోవడం నైతికం కాదని అడిషనల్ సెషన్స్ న్యాయమూర్తి నివేదిత అనిల్ శర్మ పేర్కొన్నారు.