
వివాహేతర బంధాన్ని బయట పెట్టిందని...
విజయవాడ: వివాహేతర సంబంధాన్ని బయట పెట్టిందన్న కక్షతో విజయవాడలో సునీత అనే బ్యూటీ పార్లర్ నిర్వాహకురాలిపై సుభానీఖాన్ అనే వ్యక్తి దాడి చేశాడు. స్థానికంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 20 రోజుల క్రితం సుభానీఖాన్ మరో అమ్మాయితో బ్యూటీ పార్లర్ కు వచ్చాడు.
ఈ విషయాన్ని సుభానీఖాన్ భార్యకు సునీత చెప్పింది. దీంతో కక్ష పెంచుకున్న సుభానీఖాన్ శనివారం రాత్రి కత్తితో సునీతపై దాడికి పాల్పడ్డాడు. గాయపడిన సునీతను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. నిందితుడు సుభానీఖాన్ పరారీలో ఉన్నాడు. అతడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.