భూతగాదా ఉన్న వ్యక్తికి మద్దతుగా నిలిచాడన్న కోపం.. తన భార్యతో సన్నిహితంగా ఉంటున్నాడన్న అనుమానం.. అతడిని విచక్షణ కోల్పోయేలా చేశాయి.. అలిగి సోదరి ఇంటికి వెళ్లిన భార్య ఇక కాపురం చేయనని స్పష్టం చేయడంతో తట్టుకోలేకపోయాడు.. అన్నింటికీ ఆ..‘పెద్దమనిషే’ కారణమని కక్షపెంచుకున్నాడు.. పూటుగా తాగాడు.. ఆదమరచి నిద్దరోతున్న పెద్దమనిషిని విచక్షణారహితంగా నరికి హత్య చేశాడు.. ఇవీ.. ఈ నెల 9వ తేదీన మునుగోడు మండలం చోల్లేడు గ్రామంలో కనకాల యాదయ్య హత్యోదంతం వెనుక ఉన్న కారణాలు.
-మునుగోడు
చొల్లేడు గ్రామానికి చెందిన కనగాల యాదయ్య హత్య కేసులో నిందితుడిని అరెస్ట్ చేసినట్టు చండూ రు సీఐ సుబ్బిరామిరెడ్డి తెలిపారు. శనివారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో హత్యకు గల కారణాలు, నింది తుడి వివరాలను సీఐ వివరించారు. గ్రామానికి చెందిన జనిగల హనుమంతుకు సర్వేనంబర్ 216లోని అసైండ్ భూ విషయంలో అదే గ్రామంలోని ఓ పార్టీకి చెందిన వ్యక్తి తో తగాదాలు ఉన్నాయి. పలుమార్లు పెద్ద మనుషు ల సమక్షంలో పంచాయితీలు కూడా పెట్టుకున్నారు. అయితే గ్రామంలో పెద్దమనిషిగా చలామణి అవుతున్న యాదయ్య హనుమంత్‌కు తగాదా ఉన్న వ్యక్తికి మద్దతుగా నిలిచాడు.
తనను తిట్టి.. భార్యతో సన్నిహితంగా ఉంటున్నాడని..
భూతగాదా విషయంలో కనకాల యా దయ్య పలుమార్లు హనుమంతును తాట్టాడు. కానీ హనుమంత్ భార్యతో మాత్రం మామూలుగానే మాట్లాడుతుండేవాడు. ఇది పలుమార్లు గమనించిన హనుమంతు తన భార్యతో యాదయ్య వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడనే అనుమానం మొ దలైంది. మూడు నెలల క్రితం హనుమతంతు భార్య మర్రిగూడ మం డలం లెంకలపల్లి గ్రామంలో జరిగిన పండగకు తన బంధువుల ఇంటికి వెళ్లింది. అక్కడికి యాదయ్య కూడా వెళ్లినట్టు కొందరు హనుమం తు చెవిలో వేశారు. అంతే కాకుండా నెల రోజుల క్రితం ఓ వివాహంలో హనుమంతు భార్య వంట చేస్తుండగా యాదయ్య కొంగుపట్టి లాగడం హనుమంతు కంట పడడంతో అనుమానం రెట్టింపైంది. అన్నింటినీ దృష్టిలో పె ట్టుకుని ఈ నెల 7న హనుమంతు భార్యను చితకబాదాడు. దీంతో ఆమె అలిగి పిల్లలను తీసుకుని చీకటిమామిడిలో ఉంటున్న తన సొందరి ఇంటికి వెళ్లింది. మరుసటి రోజు హనుమంతు అక్కడికి వెళ్లి భార్యను రమ్మని కోరగా ససేమిరా అంది.
పూటుగా మద్యం తాగి..
భార్య ఇక కాపురం చేయనని స్పష్టం చేయడంతో హనుమంతు జీర్ణించుకోలేకపోయాడు. యాదయ్యతో వివాహే తర సంబంధం కొనసాగిస్తూ ఈ నిర్ణయం తీసుకుందని అతడిలో బల మైన అనుమానాలు మొదలయ్యా యి. పైగా భూతగాదాలో కూడా యా దయ్య ప్రత్యర్థి వర్గానికి మద్దతుగా ఉంటుండడాన్ని హనుమంతు తట్టుకోలేకపోయాడు. ఇటు కాపురం.. అటు భూ తగాదాలో అడ్డుగా ఉన్న యాదయ్యను ఎలాగైనా అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. ఈ ఆలోచనలతోనే అతడు పూటుగా మద్యం తాగాడు. ఆపై తన ఇంట్లో ఉన్న గొడ్డలిని తీసుకొని ఇంటి ఆరుబయట ఆదమరచి నిద్రపోతున్న యాదయ్యను ఏడు సార్లు విచక్షణారహితంగా నరికి హత్య చేశాడు.
గొడ్డలిని ఇసుకమేటలో దాచి..
యాదయ్యను హత్య చేసేందుకు ఉపయోగించన గొడ్డలిని హనుమంతు కల్వకుంట్ల గ్రామంలోని కల్వర్టు వద్ద వాగులోని ఇసుకమేటలో దాచిపెట్టాడు. అనంతరం బైక్‌పై తన అత్తగారు ఊరైన నారయణపురం మం డలం ఆరెగూడెం వెళ్లి బావమరిది వ్యవసాయ భూమిలో బైక్‌ను కూడా దాచిపెట్టాడు. అక్కడ నుంచి హైదరాబాద్, మహబూనగర్ జిల్లాలో తలదాచుకున్నాడు. తిరిగి గురువారం రాత్రి అత్తగారి ఇంటికి వచ్చాడు. విషయం తెలుసుకున్న ఐడీ పార్టీ సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకుని విచారిం చగా నేరం అంగీకరించాడు. అతడిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చినట్టు సీఐ వివరించారు. సమావేశంలో ఎస్‌ఐ బి.డానియల్‌కుమార్, ఏఎస్‌ఐ రామయ్య, కానిస్టేబుల్స్ మురళి, క్రిష్ణ, రాహుఫ్, సత్యనారయణరెడ్డి ఉన్నారు.
భార్యతో సన్నిహితంగా ఉంటున్నాడని..
Published Sat, May 16 2015 11:53 PM | Last Updated on Fri, Jul 27 2018 2:18 PM
Advertisement