షాద్‌నగర్:
నిత్యం తాగి వేధింపులకు గురిచేస్తుండటంతో అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తితో కలసి పథకం పన్ని కట్టుకున్న భర్తను హతమార్చిన కేసులో నిందితులను షాద్‌నగర్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ మేరకు షాద్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఏసీపీ శ్రీనివాస్ నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి వివరాలు వెల్లడించారు. మహబూబ్‌నగర్ జిల్లా కోయిలకొండ మండలం వీరంపల్లి గ్రామానికి చెందిన కావలి ఆంజనేయులు ఆటో నడుపుతూ జీవనం సాగించేవాడు. తాగుడుకు బానిసైన ఆంజనేయులు నిత్యం తన భార్య లక్ష్మిని వేధించేవాడు. ఈ నేపథ్యంలోనే గ్రామానికి చెందిన కావలి హన్మంతుతో అక్రమ సంబంధం పెట్టుకున్న లక్ష్మి భర్తను కడతేర్చాలని పథకం పన్నింది. ఆర్మీ జవాన్‌గా పని చేస్తున్న హన్మంతుతో లక్ష్మి విషయాన్ని చెప్పడంతో విధులకు సెలవు పెట్టి హన్మంతు జూన్14న హైదరాబాద్‌కు చేరుకున్నాడు.
అనంతరం లక్ష్మి భర్త ఆంజనేయులుకు ఫోన్ చేసి వెంటనే గ్రామానికి వెళ్లే పని ఉందని ఆటో తీసుకురావాలని చెప్పాడు. తాగుడుకు బానిసైన ఆంజనేయులు హైదరాబాద్ నుంచి ఆటోలో హన్మంతుతో కలసి రాత్రి 11 గంటలకు గ్రామానికి బయలుదేరాడు. పథకం ప్రకారం ఆంజనేయులును కడతేర్చాలని వచ్చిన హన్మంతు ఫరూఖ్‌నగర్ మండలం బూర్గుల గ్రామ సరిహద్దులోనికి చేరుకోగానే ఆటోను నిలిపి తన వెంట తెచ్చుకున్న మద్యాన్ని సేవించి బయలు దేరుదామని చెప్పాడు. దీంతో అక్కడే ఆటో నిలిపి వేసి మద్యం సేవించిన అనంతరం మత్తులో ఉన్న ఆంజనేయులును బూటు కాల్లతో తన్ని , గొంతు నులిమి హత్య చేసి హన్మంతు అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ మేరకు షాద్‌నగర్ సీఐ శ్రీనివాసచారి కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపగా అనుమానం వచ్చిన పోలీసులు మృతుడి భార్య లక్ష్మితో పాటు, కావలి హన్మంతును విచారించారు. ఈ మేరకు నిందితులు చేసిన తప్పును అంగీకరించడంతో పోలీసులు వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
ఈ కేసు దర్యాప్తులో చురకుగా వ్యవహరించి నిందితులను పట్టుకున్న పట్టణ సీఐ శ్రీనివాస చారితో పాటు ఐడి పార్టీ సిబ్బంది అబ్దుల్లా, వెంకటేష్, శేఖర్, రవికుమార్, గురు ప్రసాద్, నవీన్‌కుమార్, శివకుమార్‌లను ఏసీపీ ప్రత్యేకంగా అభినందించారు. సమావేశంలో షాద్‌నగర్ ఎస్‌ఐ దాసు, ఐడి పార్టీ సిబ్బంది పాల్గొన్నారు.
ప్రియుడితో కలిసి భర్తను కడతేర్చిన భార్య
Published Sat, Jul 1 2017 8:08 AM | Last Updated on Mon, Jul 30 2018 8:37 PM
Advertisement
Advertisement