బయటపడుతున్న ట్రంప్‌ అక్రమ సంబంధాలు! | Former Model Sues To Break Silence On Trump Affair | Sakshi
Sakshi News home page

Published Wed, Mar 21 2018 9:57 AM | Last Updated on Sat, Aug 25 2018 7:52 PM

Former Model Sues To Break Silence On Trump Affair - Sakshi

న్యూయార్క్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ వివాహేతర సంబంధాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇప్పటికే పోర్న్‌ స్టార్‌ స్టార్మీ డానియెల్‌ ట్రంప్‌పై దావా వేయగా.. ఇప్పుడు మరో మాజీ మోడల్‌ ఆయనపై కోర్టుకు ఎక్కింది. ట్రంప్‌తో తనకు ఎఫైర్‌ ఉందని, ఈ వ్యవహారంపై నోరు మెదపకుండా ఉండేందుకు చేసుకున్న లీగల్‌ ఒప్పందం నుంచి తనకు విముక్తి కల్పించాలని ప్లేబాయ్‌ మాజీ మోడల్‌ కరెన్‌ మెక్‌డౌగల్‌ లాస్‌ ఏంజిల్స్‌ సుపీరియర్‌ కోర్టులో దావా వేశారు. ట్రంప్‌తో ఎఫైర్‌ గురించి బయటకు వెల్లడించవద్దంటూ నేషనల్‌ ఎంక్వైరర్‌ పత్రిక ప్రచురణ సంస్థ అయిన అమెరికన్‌ మీడియా ఇంక్‌ 2016లో తనకు లక్ష 50వేల డాలర్లు చెల్లించిందని ఆమె తన దావాలో పేర్కొన్నారు. ఈ మీడియా సంస్థ అధిపతి డేవిడ్‌ పెకర్‌ గతంలో ట్రంప్‌ తన వ్యక్తిగత స్నేహితుడని ప్రకటించారు.

ఈ క్రమంలో ట్రంప్‌తో మెక్‌డౌగల్‌ ఎఫైర్‌ గురించి కథనాన్ని ప్రచురించే హక్కులను ఆమె నుంచి అమెరికన్‌ మీడియా సంస్థ కొనుగోలు చేసినప్పటికీ.. అది ఇప్పటివరకు ప్రచురించలేదని న్యూయార్కర్‌ మ్యాగజీన్‌ గత నెల వెల్లడించింది. ఈ నేపథ్యంలో మెక్‌ డౌగల్‌ ట్రంప్‌పై దావా వేయడం గమనార్హం. ఇప్పటికే ట్రంప్‌ ఇద్దరు మహిళల నుంచి కేసులు ఎదుర్కొంటున్నారు. ట్రంప్‌తో తనకు లైంగిక సంబంధాలు ఉన్నాయని, వీటి గురించి బయటకు వెల్లడించవద్దంటూ ట్రంప్‌ లాయర్‌ తనతో ఒప్పందం చేసుకున్నారని, ఈ ఒప్పందం నుంచి తనకు విముక్తి కల్పించాలని పోర్న్‌స్టార్‌ స్టార్మీ డానియెల్‌ కేసు వేసిన సంగతి తెలిసిందే. మరోవైపు ట్రంప్‌ ఆధ్వర్యంలో నడిచిన రియాలిటీ షో ‘అప్రెంటిస్‌’ కంటెస్టెంట్‌ అయిన సమ్మర్‌ జెరోస్‌ కూడా ఆయనపై దావా వేశారు. ఈ షోలో పాల్గొంటున్న సమయంలో ట్రంప్‌ తనను లైంగికంగా వేధించాడని ఆమె ఆరోపించారు. ఈ కేసులో ట్రంప్‌ విచారణ ఎదుర్కోవాల్సిందేనని న్యూయార్క్‌ స్టేట్‌ న్యాయమూర్తి ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో తాజా కేసు వెలుగుచూడటం అధ్యక్షుడిగా మరో ఎదురుదెబ్బగా మారింది.

10 నెలలపాటు...
2006-07 మధ్యకాలంలో పది నెలలపాటు ట్రంప్‌ తనతో ‘వివాహేతర ప్రణయ సంబంధాన్ని’ కొనసాగించాడని మెక్‌డౌగల్‌ దావాలో పేర్కొన్నారు. ఈ సమయంలోనే ట్రంప్‌ పోర్న్‌ స్టార్‌ స్టార్మీ డానియెల్‌తో కూడా ఎఫైర్‌ నడిపించారు. ఆ సమయంలో ట్రంప్‌ భార్య మెలానియా గర్భవతిగా ఉండి.. తమ చిన్న కొడుకు బ్యారన్‌కు జన్మనిచ్చింది. 2016 అధ్యక్ష ఎన్నికల సందర్భంగా తన లాయర్‌ కీత్‌ డేవిడ్‌సన్తో‌.. ట్రంప్‌ వ్యక్తిగత లాయర్‌ మైఖేల్‌ కోహెన్‌ రహస్యంగా సంప్రదింపులు జరిపారని ఆమె తెలిపారు. స్టార్మీ డానియెల్‌తోనూ ఇదేవిధంగా సంప్రదింపులు జరిపి.. ఆమె ఈ బాగోతాన్ని బయటపెట్టకుండా చెల్లింపులు జరిపినట్టు కోహెన్‌ అంగీకరించిన సంగతి తెలిసిందే.

ట్రంప్‌పై న్యాయపోరాటం చేస్తున్న ముగ్గురు మహిళలు

సమ్మర్‌ జెరోస్‌..

 పోర్న్‌స్టార్‌ స్టార్మీ డానియెల్‌

ప్లేబాయ్‌  మాజీ మోడల్‌ కరెన్‌ మెక్‌డౌగల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement