Stormy Daniel
-
శిక్షాకాలం లేకుండా తీర్పిస్తా
న్యూయార్క్: అమెరికా రాజకీయ చరిత్రలో గతంలో ఎన్నడూ కనివినీ ఎరుగని వింత ఘట్టానికి న్యాయమూర్తి జువాన్ ఎం.మర్చన్ తెరలేపారు. క్రిమినల్ కేసులో దోషిగా తేలిన వ్యక్తిని శిక్షిస్తానంటూనే శిక్షాకాలం విధించబోనని చెప్పి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. అమెరికా అధ్యక్షునిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణంచేయడానికి సరిగ్గా పది రోజుల ముందు జనవరి పదో తేదీ ఉదయం 9.30 గంటలకు సంబంధిత తీర్పు చెప్తానని జడ్జి ప్రకటించారు. నీలిచిత్రాల తార స్టార్మీ డేనియల్‌కు అనైతిక నగదు చెల్లింపుల కేసులో దోషిగా తేలిన ట్రంప్‌కు పదో తేదీన శిక్ష ఖరారుచేస్తానని శుక్రవారం న్యూయార్క్‌లోని మాన్‌హట్టన్ కోర్టు జడ్జి వెల్లడించారు. ‘‘కారాగారంలో జైలుశిక్ష అనుభవించాల్సిన అవసరంలేకుండా ట్రంప్‌ను బేషరతుగా వదిలేస్తూ, కేసుకు ముగింపు పలుకుతూ తీర్పు రాస్తా. అన్‌కండీషనల్ డిశ్చార్జ్ తీర్పు వినేందుకు ట్రంప్ కుదిరితే ప్రత్యక్షంగా లేదంటే వర్చువల్‌గా కోర్టు ఎదుట హాజరవ్వాల్సి ఉంటుంది. ట్రంప్‌కు ఎలాంటి ప్రొబేషన్ పిరియడ్, జరిమానా విధించబోను’’అని జడ్జి చెప్పారు. గతంలో తనతో శృంగారం జరిపిన విషయం ఎవరికీ చెప్పకుండా దాచేందుకు స్టార్మీ డేనియల్‌కు ట్రంప్ తన లాయర్ ద్వారా 2016 ఏడాదిలో 1,30,000 డాలర్లు ఇచ్చారు. ఈ నగదును లెక్కల్లో తప్పుగా చూపారు. ఈమెకు నగదు ఇచి్చన విషయాన్ని దాచి ఆ నగదును ఎన్నికల జమా ఖర్చు కింద మార్చిరాశారు. ఈ అనైతిక చెల్లింపును ‘హష్ మనీ’గా పేర్కొంటారు. ఎన్నికల విరాళాలను ఇలా అక్రమంగా దుర్వినియోగం చేశారని ట్రంప్‌పై కేసు నమోదైంది. ఈ కేసులో 34 అంశాల్లో ట్రంప్ దోషిగా తేలిన విషయం విదితమే. జూలై 11వ తేదీనే ట్రంప్ కేసు ముగింపుకొచ్చినా అధ్యక్షునిగా గెలిచిన వ్యక్తికి క్రిమినల్ కేసు విచారణ నుంచి మినహాయింపు ఉంటుందంటూ ట్రంప్ న్యాయవాదులు ఇన్నాళ్లూ వాదిస్తూ వచ్చారు. ఎట్టకేలకు ఇవన్నీ చెల్లవంటూ న్యాయమూర్తి తన తీర్పున వెలువరించేందుకు సిద్ధమయ్యారు. క్రిమినల్ కేసులో దోషిగా తేలి శిక్షను ఎదుర్కోబోతున్న మొట్టమొదటి అమెరికా మాజీ, కాబోయే అధ్యక్షుడిగా ట్రంప్ చరిత్రలో నిలవబోతున్నారు. తీర్పు వచ్చాక న్యూయార్క్ చట్టాల ప్రకారం ట్రంప్ తన డీఎన్ఏ శాంపిల్‌ను రాష్ట్ర నేర డేటాబ్యాంక్కు అందించాల్సి ఉంటుంది. ఒకవేళ ట్రంప్‌కు జడ్జి శిక్ష విధిస్తే పదిరోజుల తర్వాత అధ్యక్షుడి హోదాలో తనకు తాను క్షమాభిక్ష ప్రసాదించుకునే అవకాశం ట్రంప్ లేదని అమెరికా రాజ్యాంగం చెబుతోంది. దేశ స్థాయిలో శిక్షలకు మాత్రమే అధ్యక్షుడు క్షమాభిక్ష ప్రసాదించగలడు. న్యూయార్క్ రాష్ట్ర కోర్టు ఇచ్చే తీర్పులకు ఇది వర్తించదు.ఇదీ చదవండి: డాలర్ డ్రీమ్స్‌పై మరో పిడుగు -
Hush money case: డొనాల్డ్ ట్రంప్ దోషి
న్యూయార్క్/వాషింగ్టన్: ఒక కేసులో దోషిగా తేలిన అమెరికా తొలి మాజీ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్(77) అప్రతిష్ట మూటగట్టుకున్నారు. పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్‌కు 1.30 లక్షల డాలర్లు అక్రమంగా చెల్లించి, బిజినెస్ రికార్డులు తారుమారు చేసిన కేసులో న్యూయార్క్ కోర్టు ఆయనను దోషిగా తేలి్చంది. ట్రంప్‌పై నమోదైన 34 తీవ్ర అభియోగాలన్నీ రుజువయ్యాయని వెల్లడించింది. జూలై 11న న్యాయస్థానం తుది తీర్పు ఇవ్వడంతోపాటు శిక్ష ఖరారు చేయనుంది. ఈ వ్యవహారంలో ట్రంప్‌కు జైలు శిక్ష లేదా జరిమానా విధించే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. శిక్ష పడినప్పటికీ.. మరో ఆరు నెలల్లో జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థిగా ట్రంప్ పోటీ చేసేందుకు ఎలాంటి ఇబ్బందులు కాబోవని అంచనా వేస్తున్నారు. న్యూయార్క్ కోర్టు తీర్పుపై డొనాల్డ్ ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది తమకు ఆమోదయోగ్యం కాదన్నారు. కోర్టు బయట ఆయన మీడియాతో మాట్లాడారు. ఓ న్యాయమూర్తి అవినీతికి పాల్పడి తప్పుడు తీర్పు ఇచ్చారని విమర్శించారు. ఇక్కడేం జరిగిందో ప్రజలకు తెలుసని చెప్పారు. అసలైన తీర్పును నవంబర్ 5న అధ్యక్ష ఎన్నికల్లో అమెరికా ప్రజలు ఇవ్వబోతున్నారని స్పష్టం చేశారు. తాను నిజాయతీపరుడినని, ఎలాంటి తప్పూ చేయలేదని పేర్కొన్నారు. అమెరికా కోసం, అమెరికా రాజ్యాంగం కోసం పోరాటం కొనసాగిస్తానని వెల్లడించారు. ఈ పోరాటంలో అంతిమ విజయం తనదేనని ధీమా వ్యక్తం చేశారు. హష్ మనీ కేసులో దోషిగా తేలిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ నిబ్బరంగానే కనిపించారు. కోర్టులో నిశ్శబ్దంగా ఉండిపోయారు. తుది తీర్పు వచ్చేదాకా బెయిల్‌పై బయటే ఉంటారు. జూలై 11న శిక్ష ఖరారు కానుంది. నవంబర్‌లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున ట్రంప్ అభ్యర్థిత్వం ఇప్పటికే ఖరారైంది. జూలై 15న మిల్వాకీలో రిపబ్లికన్ జాతీయ సదస్సులో ట్రంప్ అభ్యరి్థత్వాన్ని అధికారికంగా ప్రకటించబోతున్నారు. అంతా అనుకున్నట్లు జరిగితే అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్(81)తో డొనాల్డ్ ట్రంప్ తలపడతారు. కోర్టు తీర్పుపై బైడెన్–కమలా హారిస్ ప్రచార విభాగం ప్రతినిధి, కమ్యూనికేషన్స్ డైరెక్టర్ మైఖేల్ టైలర్ హర్షం వ్యక్తం చేశారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదని న్యూయార్క్ కోర్టు తేల్చిచెప్పిందని అన్నారు ఏమిటీ కేసు? శృంగార తార స్టార్మీ డేనియల్‌తో ట్రంప్ సన్నిహితంగా గడిపినట్లు వార్తలొచ్చాయి. 2016 అధ్యక్ష ఎన్నికల సమయంలో ఆమె నోరు విప్పితే తనకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉండడంతో ట్రంప్ అడ్డదారి ఎంచుకున్నారు. ఆమె నోరు మూయించేందుకు 1.30 లక్షల డాలర్లు తన లాయర్ ద్వారా చెల్లించారు. ఎన్నికల ప్రచారం కోసం పారీ్టకి అందిన విరాళాల నుంచే ఈ సొమ్మును స్టార్మీ డేనియల్‌కు చేరవేశారు. అక్రమ చెల్లింపులను కప్పిపుచ్చడానికి బిజినెస్ రికార్డులను తారుమారు చేశారు. ఈ వ్యవహారమంతా బహిర్గతం కావడంతో అమెరికాలో గగ్గోలు మొదలైంది. ట్రంప్‌పై విచారణ అధికారులు 34 అభియోగాలు నమోదు చేశారు. ఈ కేసులో న్యూయార్క్ కోర్టులో సుదీర్ఘంగా విచారణ జరిగింది. 22 మంది సాక్షులను న్యాయస్థానం ప్రశ్నించింది. ఎన్నికల చట్టాన్ని ట్రంప్ ఉల్లంఘించారని, పోర్న్ స్టార్‌కు చెల్లించిన సొమ్మును కోర్టు ఖర్చుల కింద చూపించారని ప్రాసిక్యూటర్లు వాదించారు. ట్రంప్ తనతో ఏకాంతంగా గడిపిన మాట నిజమేనని స్టార్మీ డేనియల్ కోర్టుకు ఇచి్చన వాంగ్మూలంలో అంగీకరించారు. గురువారం 12 మంది న్యాయమూర్తుల ప్యానెల్ చరిత్రాత్మక తీర్పు వెలువరించింది.ఎన్నికల్లో ట్రంప్ పోటీ చేయొచ్చా? న్యూయార్క్ కోర్టు తీర్పు నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టి ట్రంప్ భవితవ్యంపై పడింది. కోర్టు ఆయనకు జైలు శిక్ష గానీ, జరిమానా గానీ విధిస్తే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తారా? చట్టపరంగా అది సాధ్యమేనా? అనే సందేహాలు తలెత్తుతున్నాయి. అమెరికా రాజ్యాంగం ప్రకారం చూస్తే నేరస్థులు ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకొనే నిబంధన ఏదీ లేదని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోరి్నయాకు చెందిన న్యాయశాస్త్ర ప్రొఫెసర్ రిచర్డ్ ఎల్.హసెన్ చెప్పారు. చట్టపరంగా ఇప్పుడు ట్రంప్ అభ్యరి్థత్వానికి వచ్చే ముప్పేమీ లేదని అన్నారు.కారాగారమా? గృహ నిర్బంధమా? ⇒ ట్రంప్‌పై 34 అభియోగాలు రుజువయ్యాయి. ఒక్కో అభియోగానికి గరిష్టంగా నాలుగేళ్ల చొప్పున జైలుశిక్ష, 5 వేల డాలర్ల దాకా జరిమానా విధించే అవకాశం ఉంది. ⇒ జైలు శిక్ష కాకుండా జరిమానా, ప్రొబేషన్/సామాజిక సేవను శిక్షగా విధించవచ్చు. ప్రొబేషన్ శిక్ష విధిస్తే ప్రొబేషన్ అధికారి ఎదుట ట్రంప్ తరచుగా హాజరు కావాల్సి ఉంటుంది. కండీషనల్ డిశ్చార్జి అనే శిక్ష వేస్తే ప్రొబేషన్ అధికారి ఎదుట హాజరు కావాల్సిన అవసరం ఉండదు. ⇒ గృహ నిర్బంధం విధించే అవకాశం సైతం లేకపోలేదు. అప్పుడు ట్రంప్ తన ఇంటికే పరిమితం కావాల్సి ఉంటుంది. ఆయన చుట్టూ ఎల్రక్టానిక్ నిఘా పెడతారు. హౌజ్ అరెస్టు అయితే ట్రంప్ నాలుగు గోడల మధ్య నుంచే ఎన్నికల ప్రచారం చేయాలి. ⇒ ట్రంప్ జైలుకెళ్తారా? అంటే కచ్చితంగా చెప్పలేమని న్యాయ నిపుణులు అంటున్నారు. రాబోయే అధ్యక్ష ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కోర్టు ఆయనకు జైలుశిక్ష విధించకుండా కేవలం జరిమానాతో సరిపెట్టే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. రాజకీయ దురుద్దేశాలతోనే నాకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారు. ఇది హష్మనీ వ్యవహారం కాదు. ఇది బహిర్గతం చేయకూడదనే ఒక ఒప్పందం మాత్రమే. పూర్తిగా చట్టబద్ధంగానే జరిగింది. ఇలాంటివి అమెరికాలో సర్వసాధారణమే. ప్రత్యర్థులు నన్ను ఇలా ఇరికించారంటే వారు ఇక ఎవరినైనా ఇరికించగలరు. నాపై తప్పుడు కేసు పెట్టి, ఇబ్బందులకు గురిచేయాలని చూస్తున్నారు. వారి ఆటలు సాగవు – డొనాల్డ్ ట్రంప్ -
ఈసారి ఉల్లంఘిస్తే జైలే: ట్రంప్‌కు కోర్టు హెచ్చరిక
న్యూయార్క్: నీలిచిత్రాల తార స్టార్మీ డేనియల్‌తో సంబంధం విషయం బయటకు పొక్కకుండా ఉండేందుకు ఆమెకు తన లాయర్ ద్వారా అనైతిక మార్గంలో నగదు పంపించిన(హష్ మనీ) కేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ కోర్టు ఆగ్రహానికి గురయ్యారు. జడ్జీలు, సాక్షులపై వ్యాఖ్యానాలు చేయొద్దని, సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టొద్దన్న గ్యాగ్ ఉత్తర్వులను మళ్లీ ఉల్లంఘించినందుకు 1,000 డాలర్ల జరిమానాను న్యాయస్థానం విధించింది. మరోసారి ఉల్లంఘిస్తే జైల్లో పడేస్తామని సోమవారం జడ్జి జువాన్ ఎం.మెర్చాన్ హెచ్చరించారు. ఇప్పటికే తొమ్మిదిసార్లు ఉల్లంఘించినందుకు గత వారమే ట్రంప్‌నకు 9,000 డాలర్ల జరిమానా విధించడం విదితమే. -
బయటపడుతున్న ట్రంప్ అక్రమ సంబంధాలు!
న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వివాహేతర సంబంధాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇప్పటికే పోర్న్ స్టార్ స్టార్మీ డానియెల్ ట్రంప్‌పై దావా వేయగా.. ఇప్పుడు మరో మాజీ మోడల్ ఆయనపై కోర్టుకు ఎక్కింది. ట్రంప్‌తో తనకు ఎఫైర్ ఉందని, ఈ వ్యవహారంపై నోరు మెదపకుండా ఉండేందుకు చేసుకున్న లీగల్ ఒప్పందం నుంచి తనకు విముక్తి కల్పించాలని ప్లేబాయ్ మాజీ మోడల్ కరెన్ మెక్‌డౌగల్ లాస్ ఏంజిల్స్ సుపీరియర్ కోర్టులో దావా వేశారు. ట్రంప్‌తో ఎఫైర్ గురించి బయటకు వెల్లడించవద్దంటూ నేషనల్ ఎంక్వైరర్ పత్రిక ప్రచురణ సంస్థ అయిన అమెరికన్ మీడియా ఇంక్ 2016లో తనకు లక్ష 50వేల డాలర్లు చెల్లించిందని ఆమె తన దావాలో పేర్కొన్నారు. ఈ మీడియా సంస్థ అధిపతి డేవిడ్ పెకర్ గతంలో ట్రంప్ తన వ్యక్తిగత స్నేహితుడని ప్రకటించారు. ఈ క్రమంలో ట్రంప్‌తో మెక్‌డౌగల్ ఎఫైర్ గురించి కథనాన్ని ప్రచురించే హక్కులను ఆమె నుంచి అమెరికన్ మీడియా సంస్థ కొనుగోలు చేసినప్పటికీ.. అది ఇప్పటివరకు ప్రచురించలేదని న్యూయార్కర్ మ్యాగజీన్ గత నెల వెల్లడించింది. ఈ నేపథ్యంలో మెక్ డౌగల్ ట్రంప్‌పై దావా వేయడం గమనార్హం. ఇప్పటికే ట్రంప్ ఇద్దరు మహిళల నుంచి కేసులు ఎదుర్కొంటున్నారు. ట్రంప్‌తో తనకు లైంగిక సంబంధాలు ఉన్నాయని, వీటి గురించి బయటకు వెల్లడించవద్దంటూ ట్రంప్ లాయర్ తనతో ఒప్పందం చేసుకున్నారని, ఈ ఒప్పందం నుంచి తనకు విముక్తి కల్పించాలని పోర్న్‌స్టార్ స్టార్మీ డానియెల్ కేసు వేసిన సంగతి తెలిసిందే. మరోవైపు ట్రంప్ ఆధ్వర్యంలో నడిచిన రియాలిటీ షో ‘అప్రెంటిస్’ కంటెస్టెంట్ అయిన సమ్మర్ జెరోస్ కూడా ఆయనపై దావా వేశారు. ఈ షోలో పాల్గొంటున్న సమయంలో ట్రంప్ తనను లైంగికంగా వేధించాడని ఆమె ఆరోపించారు. ఈ కేసులో ట్రంప్ విచారణ ఎదుర్కోవాల్సిందేనని న్యూయార్క్ స్టేట్ న్యాయమూర్తి ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో తాజా కేసు వెలుగుచూడటం అధ్యక్షుడిగా మరో ఎదురుదెబ్బగా మారింది. 10 నెలలపాటు... 2006-07 మధ్యకాలంలో పది నెలలపాటు ట్రంప్ తనతో ‘వివాహేతర ప్రణయ సంబంధాన్ని’ కొనసాగించాడని మెక్‌డౌగల్ దావాలో పేర్కొన్నారు. ఈ సమయంలోనే ట్రంప్ పోర్న్ స్టార్ స్టార్మీ డానియెల్‌తో కూడా ఎఫైర్ నడిపించారు. ఆ సమయంలో ట్రంప్ భార్య మెలానియా గర్భవతిగా ఉండి.. తమ చిన్న కొడుకు బ్యారన్‌కు జన్మనిచ్చింది. 2016 అధ్యక్ష ఎన్నికల సందర్భంగా తన లాయర్ కీత్ డేవిడ్సన్తో.. ట్రంప్ వ్యక్తిగత లాయర్ మైఖేల్ కోహెన్ రహస్యంగా సంప్రదింపులు జరిపారని ఆమె తెలిపారు. స్టార్మీ డానియెల్తోనూ ఇదేవిధంగా సంప్రదింపులు జరిపి.. ఆమె ఈ బాగోతాన్ని బయటపెట్టకుండా చెల్లింపులు జరిపినట్టు కోహెన్ అంగీకరించిన సంగతి తెలిసిందే. ట్రంప్‌పై న్యాయపోరాటం చేస్తున్న ముగ్గురు మహిళలు సమ్మర్ జెరోస్.. పోర్న్‌స్టార్ స్టార్మీ డానియెల్ ప్లేబాయ్ మాజీ మోడల్ కరెన్ మెక్‌డౌగల్ -
చెప్పకూడని విషయం 20సార్లు చెప్పింది
న్యూయార్క్ : తనకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌తో శారీరక సంబంధం ఉందంటూ ఆరోపించిన పోర్న్‌స్టార్ స్టామీ డానియెల్‌పై ట్రంప్ వ్యక్తిగత న్యాయవాది ఒకరు రంగంలోకి దిగారు. రహస్యంగా ఉంచాల్సిన ఓ విషయాన్ని పదేపదే బయటపెట్టి అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పరువు తీసేందుకు ప్రయత్నించిన డానియెల్‌పై కోర్టులో ఈ మేరకు ఓ దావా వేశారు. దాదాపు 20సార్లు ఆమె అదే విషయాన్ని బయటకు చెప్పి ఒప్పంద ఉల్లంఘనకు పాల్పడ్డారని, అందుకుగాను ఆమె నుంచి 20 మిలియన్ డాలర్లు తీసుకొనే హక్కు తమకు ఉందని, ఆ మేరకు ఆదేశించాలంటూ కోర్టును కోరారు. అంతేకాకుండా అలాంటి విషయాలు ప్రైవేటువని, అవి బహిరంగం చేయాల్సినవి కావని ఈ మేరకు డానియెల్‌కు నొక్కి చెప్పాలని కూడా పేర్కొన్నారు. రహస్యంగా జరగాల్సిన ప్రొసీడింగ్స్‌ను మధ్యవర్తిత్వానికి అప్పగించేందుకు కూడా తాను సిద్ధమని తెలిపారు. అయితే, మైకెల్ అవెనట్టి అనే డానియెల్ తరుపు న్యాయవాది నష్టం పేరిట తమ క్లెయింట్ నుంచి పెద్ద మొత్తంలో డబ్బు లాగేసుకునేందుకు ట్రంప్, ఆయన న్యాయవాది కొహెన్ ఒత్తిడి పెంచే యత్నం చేస్తున్నారని, ఈ ఒత్తిడి సాయంతో అసలు నిజాన్ని తొక్కిపట్టొచ్చని బయటకు రానివ్వకుండా చేయొచ్చన్నది వారి వ్యూహం అని ఆరోపించారు. 'అమెరికా ప్రజలకు తెలియకుండా నిజం దాచేందుకే వారు ఈ పనిచేస్తున్నారు. ఏం జరిగిందో ప్రజలకు చెప్పడం తప్పే కాదు.. దానిని తప్పుగా చూపించి బోగస్ నష్టం పేరిట 20 మిలియన్ డాలర్లు అడుగుతున్నారు. బహుశా మన దేశ చరిత్రలోనే ఇలాంటిది జరగలేదు. ఏది ఏమైనా మేం భయపడబోం. ఎవరి బెదిరింపులకు వెనక్కి తగ్గబోం' అని డానియెల్ తరుపు న్యాయవాది చెప్పారు. -
ఆయనకు డ్రెస్ కూడా ఆమెనే సరిచేసేది
న్యూయార్క్ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ట్రంప్‌కు పోర్న్‌స్టార్ స్టామీ డానియెల్‌కు శారీరక సంబంధం ఉన్నట్లు మరోసారి స్పష్టమైంది. డానియెల్ సన్నిహిత మిత్రుడు కెయిత్ మున్యాన్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. తమ అక్రమ సంబంధాన్ని ఎట్టి పరిస్థితుల్లో బయటపెట్టొద్దని చేసుకున్న ఒప్పందంలో మున్యాన్కు కూడా భాగస్వామ్యం ఉంది. డానియెల్ మాత్రమే కాకుండా మొత్తం నలుగురు వ్యక్తులు మున్యాన్, డానియెల్ మేనేజర్ గినా రోడ్రిగ్వెజ్, డానియెల్ మాజీ భర్త మైక్ మోస్నీ, మరో పోర్న్‌స్టార్ జెస్సికా ఈ ఒప్పందంలో సంతకం చేశారు. ఇప్పటికే తమ బంధాన్ని గురించి రెండు మూడు ఇంటర్వ్యూల్లో డానియెల్ చెప్పినప్పటికీ శ్వేతసౌదం ఆ విషయాలను కొట్టిపారేసింది. ట్రంప్ కూడా అవన్నీ ఒట్టిమాటలే అని కొట్టిపారేశారు. ఈ నేపథ్యంలో ఈ విషయంపై వివరాలకోసం ఓ చానెల్ తీవ్రంగా ప్రయత్నించగా మున్యాన్ ఫోన్ ద్వారా కొన్ని వివరాలు చెప్పారు. ఇతడు పోర్న్ స్టార్ల ఫొటోలు తీస్తుంటాడు. 'నేను లాస్ ఎంజెల్స్‌లోని ఓ లోయ ప్రాంతంలో ఓ ఇల్లు అద్దెకు తీసుకొని 2006 నుంచి 2008వరకు ఉన్నాను. నాకు బాగా గుర్తుంది. ట్రంప్ తొలిసారి 2006లో డానియెల్‌కు ఫోన్ చేశాడు. ఆ సమయంలో ఎవరు మాట్లాడేదంటూ డానియెల్ ప్రశ్నించింది. ఆ సమయంలో హెడ్‌సెట్‌లోని చెరో స్పీకర్ పెట్టుకొని వినే వాళ్లం. ట్రంప్ మాటలు చాలా చిత్రంగా ఉండేవి. తనకు అలాంటిది ఇష్టం లేదని డానియెల్ చెప్పింది. కానీ, ట్రంప్ మాత్రం ఫోన్ చేస్తూనే ఉండేవాడు. నేను మొత్తం ఓ ఏడుసార్లు ఆయన మాటలు విన్నాను. అన్ని పిచ్చిమాటలే మాట్లాడేవారు. అయితే క్రమంగా వారిద్దరు దగ్గరయ్యారు. ట్రంప్‌కు సరిగా డ్రెస్ వేసుకోవడం కూడా తెలియదు. ఇద్దరు కలిసి కొన్ని పార్టీలకు కూడా వెళ్లేవారు. అయితే, డ్రెస్ సరిగా వేసుకోవాలని డానియెల్ సర్దేది. ఇక ఒప్పందం విషయంపై మాత్రం పూర్తి వివరాలు వెల్లడించలేను. వారిద్దరికి శారీరక సంబంధం ఉంది మాత్రం నిజం' అని మున్యాన్ స్పష్టం చేశారు.