న్యూయార్క్ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ట్రంప్‌కు పోర్న్‌స్టార్ స్టామీ డానియెల్‌కు శారీరక సంబంధం ఉన్నట్లు మరోసారి స్పష్టమైంది. డానియెల్ సన్నిహిత మిత్రుడు కెయిత్ మున్యాన్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. తమ అక్రమ సంబంధాన్ని ఎట్టి పరిస్థితుల్లో బయటపెట్టొద్దని చేసుకున్న ఒప్పందంలో మున్యాన్‌కు కూడా భాగస్వామ్యం ఉంది. డానియెల్ మాత్రమే కాకుండా మొత్తం నలుగురు వ్యక్తులు మున్యాన్, డానియెల్ మేనేజర్ గినా రోడ్రిగ్వెజ్, డానియెల్ మాజీ భర్త మైక్ మోస్నీ, మరో పోర్న్‌స్టార్ జెస్సికా ఈ ఒప్పందంలో సంతకం చేశారు. ఇప్పటికే తమ బంధాన్ని గురించి రెండు మూడు ఇంటర్వ్యూల్లో డానియెల్ చెప్పినప్పటికీ శ్వేతసౌదం ఆ విషయాలను కొట్టిపారేసింది. ట్రంప్ కూడా అవన్నీ ఒట్టిమాటలే అని కొట్టిపారేశారు. ఈ నేపథ్యంలో ఈ విషయంపై వివరాలకోసం ఓ చానెల్ తీవ్రంగా ప్రయత్నించగా మున్యాన్ ఫోన్ ద్వారా కొన్ని వివరాలు చెప్పారు. ఇతడు పోర్న్ స్టార్‌ల ఫొటోలు తీస్తుంటాడు.
'నేను లాస్ ఎంజెల్స్‌లోని ఓ లోయ ప్రాంతంలో ఓ ఇల్లు అద్దెకు తీసుకొని 2006 నుంచి 2008వరకు ఉన్నాను. నాకు బాగా గుర్తుంది. ట్రంప్ తొలిసారి 2006లో డానియెల్‌కు ఫోన్ చేశాడు. ఆ సమయంలో ఎవరు మాట్లాడేదంటూ డానియెల్ ప్రశ్నించింది. ఆ సమయంలో హెడ్‌సెట్‌లోని చెరో స్పీకర్ పెట్టుకొని వినే వాళ్లం. ట్రంప్ మాటలు చాలా చిత్రంగా ఉండేవి. తనకు అలాంటిది ఇష్టం లేదని డానియెల్ చెప్పింది. కానీ, ట్రంప్ మాత్రం ఫోన్ చేస్తూనే ఉండేవాడు. నేను మొత్తం ఓ ఏడుసార్లు ఆయన మాటలు విన్నాను. అన్ని పిచ్చిమాటలే మాట్లాడేవారు. అయితే క్రమంగా వారిద్దరు దగ్గరయ్యారు. ట్రంప్‌కు సరిగా డ్రెస్ వేసుకోవడం కూడా తెలియదు. ఇద్దరు కలిసి కొన్ని పార్టీలకు కూడా వెళ్లేవారు. అయితే, డ్రెస్ సరిగా వేసుకోవాలని డానియెల్ సర్దేది. ఇక ఒప్పందం విషయంపై మాత్రం పూర్తి వివరాలు వెల్లడించలేను. వారిద్దరికి శారీరక సంబంధం ఉంది మాత్రం నిజం' అని మున్యాన్ స్పష్టం చేశారు.
ఆ పిచ్చి మాటలు మేం ఇద్దరం వినేవాళ్లం
Published Wed, Mar 14 2018 9:18 AM | Last Updated on Sat, Aug 25 2018 7:52 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment