Nirmal Town
-
ఇంటి యజమాని కొడుకుతో వివాహేతర సంబంధం.. భర్తకు తెలిసి
సాక్షి, నిర్మల్‌టౌన్: జిల్లా కేంద్రం నిర్మల్‌లో గురువారం సంచలనం సృష్టించిన జుబేర్‌ఖాన్ హత్యకు వివాహేతర సంబంధమే కారణమని డీఎస్పీ ఉపేంద్రరెడ్డి తెలిపారు. శుక్రవారం స్థానిక పట్టణ పోలీసుస్టేషన్లో నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టి వివరాలు వెల్లడించారు. పట్టణంలోని గాజులపేటకు చెందిన ముంతాజ్‌ఖాన్ నివాసంలో మహమ్మద్ ఫయాజ్(40) తన రెండో భార్యతో అద్దెకు ఉంటూ పాల వ్యాపారం చేస్తున్నాడు. వీరికి ముగ్గురు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. అద్దె ఇంటి యజమాని ముంతాజ్‌ఖాన్ పెద్ద కుమారుడు జుబేర్‌ఖాన్(22) ఫయాజ్ రెండో భార్యతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. దీంతో ఫయాజ్ పలుమార్లు జుబేర్‌ను మందలించాడు. సమావేశంలో వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ ఉపేంద్రరెడ్డి వారి ఇంటిని ఖాళీ చేసి సమీపంలోని గంజ్‌బక్ష్ ఏరియాలో అద్దెకు తీసుకున్నాడు. అయినా జుబేర్ ప్రవర్తనలో మార్పు రాలేదు. పలుమార్లు పెద్దలతో చెప్పించినా, ఆయన సిమ్‌కార్డు తీసుకున్నా.. అలాగే కొనసాగించాడు. భార్య, పిల్లలు తనకు దక్కరని ఫయాజ్ భావించాడు. జుబేర్‌ను చంపేందుకు నిర్ణయించుకున్నాడు. ఐదురోజుల క్రితమే భార్యాపిల్లలను హైదరాబాద్‌లో ఉంటున్న తన తల్లి వద్దకు పంపించాడు. తన భార్య టైలర్ కత్తెర తీసుకొని స్కూటీలో పెట్టుకున్నాడు. గురువారం సాయంత్రం స్థానిక బైల్‌బజార్ దాటిన తర్వాత పెట్రోల్‌బంక్ వద్ద జుబేర్‌ను చూశాడు. మాట్లాడేది ఉందంటూ పెట్రోల్ బంకు పక్కన గల రాయల్ ట్రాన్స్పోర్ట్ ముందుకు తీసుకెళ్లాడు. చదవండి: (Hyderabad: అపార్ట్మెంట్లో వ్యభిచారం.. పోలీసుల దాడి) తన భార్యతో సంబంధం వదులుకోవాలని ఎంత హెచ్చరించినా జుబేర్ వినలేదని, కోపోద్రిక్తుడైన ఫయాజ్ తన వెంట తెచ్చుకున్న కత్తెరతో ముందుగా జుబేర్ గొంతు కోశాడని డీఎస్పీ తెలిపారు. ఆ తర్వాత అందరూ చూస్తుండగానే గుండెలో, కడుపులో విచక్షణారహితంగా పొడిచి చంపాడని, అనంతరం పోలీస్‌స్టేషన్‌కు వచ్చి లొంగిపోయాడని వివరించారు. సమావేశంలో పట్టణ సీఐ శ్రీనివాస్, ఎస్సైలు ఉన్నారు. -
‘పది’ లీకేజీ నిందితులను కఠినంగా శిక్షించాలి
నిర్మల్‌టౌన్ : పదో తరగతి ప్రశ్నపత్రం లీకేజీ నిందితులను కఠినంగా శిక్షించాలని టీయూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మురళీమనోహర్‌రెడ్డి, నాంపల్లి నాగభూషన్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని సంఘ భవనంలో సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో పలు జిల్లాల్లో చోటు చేసుకుంటున్న పదో తరగతి ప్రశ్నపత్రం లీకేజీ ఘటనల్లో నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పదో పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు పూర్తిస్థాయిలో చర్యలు తీసుకున్నామని జిల్లా విద్యాశాఖాధికారులు పేర్కొంటున్నా కార్యరూపం దాల్చడం లేదని విమర్శించారు. విద్యార్థులు కష్టపడి పరీక్షలు రాస్తుంటే కొన్ని ప్రైవేట్ పాఠశాలల యాజ మన్యాలు ర్యాంకుల కోసం ఇలాంటి చర్యలకు పాల్ప డుతున్నాయని ఆరోపించారు. దీనికి కేవలం ప్రభుత్వ ఉపాధ్యాయులనే నిందితులుగా పేర్కొనకుండా అస లు నిందితులను బయటకు తేవాలన్నారు. ఇలాంటి ఘటనల్లో రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా లోతుగా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర సహాధ్యక్షుడు లక్ష్మీప్రసాద్‌రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తోడిశెట్టి రవికాంత్ తదితరులు పాల్గొన్నారు. -
నిర్మల్‌లో ఉద్రిక్తత
నిర్మల్/నిర్మల్‌టౌన్ : జిల్లాకేంద్రంలో ఆదివారం నిర్వహిస్తున్న శ్రీరామ రథయాత్ర సందర్భంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. యాత్ర ముగింపు సమయంలో స్థానిక పెద్దమార్కెట్లో ప్రాంతంలో ఓ వర్గం ప్రార్థన మందిరంపై మరో వర్గం రాళ్లు రువ్వారంటూ ఒక్కసారిగా ఆందోళనకు దిగారు. ఇరు వర్గాలకు చెందిన వందలాది మంది రాళ్లు రువ్వుకున్నారు. ఈ ఆందోళనలను సద్దుమనుగింపజేయడానికి వచ్చిన ఏఎస్పీ దక్షిణమూర్తి, క్యూఆర్టీ కానిస్టేబుల్‌కు రాళ్లు తగలడంతో తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం పోలీసులు లాఠీచార్జీ, బాష్పవాయు ప్రయోగం చేయడంతో పరిస్థితి కాస్త సద్దుమణిగింది. జిల్లా ఇన్చార్జి ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ సంఘటనకు కారకులైన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. అన్ని వర్గాల ప్రజలు సంయమనం పాటించాలని, శాంతియుతంగా ఉండాలని కోరారు. -
విచ్ఛిన్నమవుతున్న కుటుంబాలు
సారంగాపూర్ :వివాహేతర సంబంధాలు, అనుమానాల కారణంగా ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి. దీని కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులు.. ప్రేమ, వాత్సల్యానికి దూరమవుతూ అనాథలుగా మిగిలిపోతున్నా రు. క్షణికావేశం, మితిమీరిన అహంకారం వారి పిల్లలకు శాపంగా మారుతోందని గ్రహించని స్థి తిలో ఏం చేయడానికైనా తెగిస్తూ తమ జీవితం, పిల్లల భవిష్యత్తును చిదిమేస్తున్నారు. దీనికి నిదర్శనం సారంగాపూర్ మండలంలో ఇదివరకు జ రిగిన ఘాతుకాలే. శుక్రవారం రాత్రి సైతం మం డలంలోని జామ్ గ్రామంలో వివాహేతర సం బంధం వద్దని.. మనకు పిల్లలున్నారని వారించి న పాపానికి ప్రియురాలితో కలిసి కట్టుకున్న భార్యనే కడతేర్చాడో ప్రబుద్ధుడు. ఈ ఘాతుకానికి ఆ కుటుంబం చిన్నాభిన్నమైంది. ఇలా జరిగింది... జామ్ గ్రామానికి చెందిన పబ్బు అల్లమయ్యతో నిర్మల్ పట్టణం బంగల్‌పేట్‌కు చెందిన పుష్పలత(ప్రేమల)కు 25 ఏళ్లక్రితం వివాహం జరి గింది. వారి వైవాహిక బంధానికి ప్రతీకగా వారి కి నలుగురు ఆడపిల్లలు జన్మించారు. అయితే వివాహానంతరం నుంచే అల్లమయ్య మద్యం తాగుతూ, వివాహేతరర సంబంధాలు కొనసాగిస్తూ జల్సాలకు అలవాటు పడ్డాడు. ఇదే సమయంలో అల్లమయ్య తండ్రి అయిన లింగమ య్య బాధ్యత లేని కొడుకుపై నమ్మకం లేక ము గ్గురు పిల్లలకు తన కష్టార్జితంతో వివాహం జరి పించాడు. వివాహాలు చేసిన తన తండ్రి, భార్యలను డబ్బుల కోసం తరచూ వేధించేవాడు అల్లమయ్య. ఈ వేధింపులు తాళలేక భార్య పుష్పల త, తండ్రి లింగమయ్య పలుమార్లు అల్లమయ్య పై పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయినా తనలో మార్పు రాలేదు. మార్పు రాకపోగా మళ్లీ వివాహేతర సంబంధాలను కొనసాగించాడు. శుక్రవారం రాత్రి నిర్మల్ మండలం మేడిపెల్లి గ్రామానికి చెందిన ఓ మహిళను వెంట తెచ్చుకు ని వచ్చి తన ఇంట్లోనే కార్యకలాపాలు సాగించా డు. అది గమనించిన ఆయన భార్య దానిని అ డ్డుకునేందుకు ప్రయత్నిస్తే చిన్నకూతురు రుచిత ను, భార్యను చితకబాదాడు. అంతటితో ఊరుకోకుండా ముందుగా తన వెంట తెచ్చిన పురుగుల మందును అల్లమయ్య, తన ప్రియురాలు ఇద్దరు కలిసి పుష్పలత నోట్లో బల వంతంగా పోశారు. దీంతో తీవ్ర అస్వస్థతకు గురైన ఆమె ను స్థానికులు కాపాడేందుకు గాను 108కు ఫోన్ చేశారు. అంబులెన్స్ వచ్చే లోపే పుష్పలత తుది శ్వాస విడిచింది. దీంతో అల్లమయ్య కటకటాల పాలు కాగా.. తల్లి మరణించడంతో తన 12 ఏళ్ల కుమార్తె రుచిత తల్లిదండ్రులు లేని అనాథగా మిగిలిపోయింది. అల్లమయ్యను గ్రామస్తులు బ ట్టలూడదీసి చితకబాది పోలీసులకు అప్పగించా రు. ప్రస్తుతం ఆయనపై కేసు నమోదు చేశారు. అనుమానమే అనాథలను చేసింది మండలంలోని జామ్ గ్రామానికి చెందిన ఆరె గంగాధర్-వజ్రమాల అనే దంపతులను అనుమానం అనే భూతం కాటేసింది. మహారాష్ట్రలోని మలక్ జామ్ గ్రామానికి చెందిన గంగాధర్ జామ్ గ్రామానికి చెందిన వజ్రమాలను వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు వినీల, విజయ్ జన్మించారు. అయితే వారికి అప్పట్లో 12 ఏళ్లు వచ్చాక వారి తల్లి అయిన ఆరె వజ్రమాలను 2010 ఏప్రిల్ మూడో తేదీన తండ్రి గంగాధర్ వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో కత్తితో గొంతు కోసి చంపేశాడు. అనంతరం తన ఇద్దరు పిల్లల గురించి ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే గంగాధర్ సైతం గ్రామ చివరన పంట పొలాల్లో ఉరేసుకుని తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో ఆ దంపతుల సంతానం వినీల, విజయ్లిద్దరూ అనాథలయ్యారు. అప్పటి నుంచి అమ్మమ్మ కోర్వ లక్ష్మి, తాతయ్య భోజన్నలే వారి ఆలనాపాలనా చూస్తున్నారు. ఇలా అనుమానాలు క్షణికావేశాలతో ఎంతో మంది అనాథలవుతున్నారు. ఒక్క క్షణం ఆలోచించండి అనుమానం వస్తే కనీసం ఐదు నిమిషాలైనా ఆలోచించండి. క్షణికావేశం తమ జీవితాన్నే కాక తమపై ఆధారపడే వారి జీవితాలను చిన్నాభిన్నం చేస్తుందని గ్రహించాలి. వచ్చిన ఆవేశాన్ని ఆ ఐదు నిమిషాలు ఆపుకుంటే సమస్య పరిష్కారానికి మార్గం కనిపిస్తుంది. నిండు జీవితం మీతోనే ఉంటుంది. -
రూ.500 కోసం హత్య
రూ.500 కోసం హత్య నిర్మల్ టౌన్, : రూ.500.. ఓ వృద్ధురాలి తీసేలా చేసింది. మహిళను కటకటాల్లోకి నెట్టింది. అవసరానికి డబ్బులు ఇవ్వలేదనే అక్కసుతో వృద్ధురాలిని అతి కిరాతకంగా హతమార్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. నిర్మల్ మండలం వెంగ్వాపేట గ్రామంలో జరిగిన వృద్ధురాలి హత్య కేసును పోలీసులు 23 రోజుల్లో ఛేదించారు. నిందితురాలిని అరెస్టు చేశారు. నిర్మల్ డీఎస్పీ ఎస్వీ.మాధవరెడ్డి, రూరల్ సీఐ ఎ.రఘు మంగళవారం తెలిపిన వివరాల ప్రకారం.. వెంగ్వాపేట గ్రామంలో ఉడుత భూమవ్వ(60) ఒంటరిగా జీవిస్తుండేది. ఆమె తో ఉన్న పరిచయం కారణంగా నిర్మల్ పట్టణంలోని ఆదర్శనగర్‌కు చెందిన ఎన్.జుమున అప్పుడప్పుడు ఇంటికి వచ్చి వెళ్లేది. జమున కూడా ఆదర్శనగర్‌లో ఒంటరిగానే ఉంటోంది. గత నెల 26న భూమవ్వ ఇంటికి వెళ్లింది. తనకు రూ.500 అవసరం ఉన్నాయని, ఇవ్వాలని కోరింది. తన వద్ద డబ్బులు లేవని, తిని వెళ్లూ అంటూ భూమవ్వ చెప్పింది. దీంతో ఆ రోజు రాత్రి ఇద్దరూ కలిసి విందు చేసుకున్నారు. మద్యం సేవించారు. భూమవ్వ వద్ద రూ.500 ఉండడాన్ని గమనించిన జమున ఆమెను చంపి డబ్బులు తీసుకెళ్లాలని భావించింది. మద్యం మత్తులో ఉన్న భూమవ్వపై జమున బరిశె, కొడవలితో విచక్షణారహితంగా దాడి చేసి హతమార్చింది. డబ్బులు తీసుకుని పారిపోయింది. విచారణ చేపట్టిన పోలీసులు స్థానికులు ఇచ్చిన సమాచారంతో కేసును ఛేదించారు. మంగళవారం జమునను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. నిందితురాలిని అదుపులోకి తీసుకున్న కె.చిన్నయ్య, ఎస్.భోజాగౌడ్లను డీఎస్పీ, సీఐ అభినందించారు. -
కేంద్రం ఆదేశాల మేరకే సీఎం డ్రామా
నిర్మల్: తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఉనికిని కాపాడుకునేందుకు కేంద్రం ముఖ్యమంత్రి కిరణ్‌తో నాటకాలు ఆడిస్తోందని మహాజన సోషలిస్టు పార్టీ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించే క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పూనుకోవటం దారుణమన్నారు. ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ పట్టణంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కేంద్రం కిరణ్‌తో చేయించిన కుట్రలు, కుతంత్రాలు జూలై 30 నుంచి జనవరి 30 వరకు సాగాయని, ఇందుకు నిదర్శనమే అసెంబ్లీ సమావేశాల్లో జరిగిన పరిణామాలని పేర్కొన్నారు. ఏదేమైనా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కాక తప్పదని చెప్పారు. లోక్‌సభ, రాజ్యసభలలో ఎస్సీ, ఎస్టీలకు కల్పిస్తున్న రిజర్వేషన్ల మాదిరే శాసనమండలి, శాసనసభలలో కూడా కల్పించాలని కోరారు. ఇది లేకపోవడంతో ఎంతో మంది ఎస్సీ, ఎస్టీలు నష్టపోతున్నారని చెప్పారు.