మాట్లాడుతున్న మురళీమనోహర్‌రెడ్డి
నిర్మల్‌టౌన్ : పదో తరగతి ప్రశ్నపత్రం లీకేజీ నిందితులను కఠినంగా శిక్షించాలని టీయూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మురళీమనోహర్‌రెడ్డి, నాంపల్లి నాగభూషన్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని సంఘ భవనంలో సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో పలు జిల్లాల్లో చోటు చేసుకుంటున్న పదో తరగతి ప్రశ్నపత్రం లీకేజీ ఘటనల్లో నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పదో పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు పూర్తిస్థాయిలో చర్యలు తీసుకున్నామని జిల్లా విద్యాశాఖాధికారులు పేర్కొంటున్నా కార్యరూపం దాల్చడం లేదని విమర్శించారు. విద్యార్థులు కష్టపడి పరీక్షలు రాస్తుంటే కొన్ని ప్రైవేట్ పాఠశాలల యాజ మన్యాలు ర్యాంకుల కోసం ఇలాంటి చర్యలకు పాల్ప డుతున్నాయని ఆరోపించారు. దీనికి కేవలం ప్రభుత్వ ఉపాధ్యాయులనే నిందితులుగా పేర్కొనకుండా అస లు నిందితులను బయటకు తేవాలన్నారు. ఇలాంటి ఘటనల్లో రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా లోతుగా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర సహాధ్యక్షుడు లక్ష్మీప్రసాద్‌రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తోడిశెట్టి రవికాంత్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment