Minister KTR Sensational Comments Over Bandi Sanjay Arrest - Sakshi
Sakshi News home page

బండి సంజయ్‌ అరెస్ట్‌.. కేటీఆర్‌ సంచలన కామెంట్స్‌

Published Wed, Apr 5 2023 12:14 PM | Last Updated on Wed, Apr 5 2023 12:35 PM

Minister KTR Sensational Comments Over Bandi Sanjay Arrest - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పదో తరగతి పేపర్‌ లీక్‌ వ్యవహారంలో భాగంగా తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సంజయ్‌పై బీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో బీజేపీ చెలగాటం ఆడుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అవసరమైతే సంజయ్‌పై పీడీ యాక్ట్‌ నమోదు చేయాలని డిమాండ్‌​ చేస్తున్నారు. 

ఈ సందర్బంగా కేటీఆర్‌ ట్విట్టర్‌ వేదికగా సంచలన కామెంట్స్‌ చేశారు. 

కేటీఆర్‌ ట్విట్టర్‌లో ‘పిచ్చోని చేతిలో రాయి ఉంటే.. వచ్చి పోయేటోళ్ళకే ప్రమాదం...!! 

కానీ అదే పిచ్చోని చేతిలో ఒక పార్టీ ఉంటే
ప్రజాస్వామ్యానికే ప్రమాదం...!!!

తమ స్వార్థ రాజకీయాల కోసం ప్రశ్నా పత్రాలు లీకు చేసి  అమాయకులైన  విద్యార్ధుల, నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న బీజేపి నాయకులు’ అంటూ వ్యాఖ్యలు చేశారు. 

కాగా, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ మాట్లాడుతూ.. తెలంగాణలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా బీజేపీ కుట్ర చేస్తోంది. టెన్త్‌ పేపర్‌ లీకేజీలో కుట్రదారుడు బండి సంజయ్‌. పేపర్‌ లీక్‌ నిందితులతో బీజేపీ పెద్దలకు సంబంధాలున్నాయి. టీఎస్‌పీఎస్సీ నిందితులకు సునీల్‌ బన్సల్‌తో సంబంధాలున్నాయి. ఢిల్లీ పెద్దల కనుసన్నల్లోనే సంజయ్‌ పేపర్‌ లీకులు చేయిస్తున్నాడు. మా ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికే ఢిల్లీ పెద్దలు కుట్ర చేస్తున్నారు. ఢిల్లీ పెద్దల డైరెక్షన్‌లోనే తెలంగాణలో పేపర్‌ లీకేజీలు. టెన్త్‌ పేపర్‌ను వైరల్‌ చేసిన ప్రశాంత్‌ బీజేపీ కార్యక‍ర్త అని తెలిపారు. 

ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి మాట్లాడుతూ.. పేపర్‌ లీకేజీలో బండి సంజయ్‌ కుట్రదారుడు. సంజయ్‌ ఆదేశాలతోనే పేపర్‌ లీక్‌ జరుగుతోంది. విద్యార్థుల భవిష్యత్తుతో బీజేపీ చెలగాటం ఆడుతోంది. అవసరమైతే సంజయ్‌పై పీడీ యాక్ట్‌ నమోదు చేయాలి. మాతో పోటీపడలేక ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయాలని చూస్తున్నారు. బండి సంజయ్‌ కుట్రలను ప్రజలు గమనిస్తున్నారు అంటూ కామెంట్స్‌ చేశారు.  

ఇది కూడా చదవండి: అసలేం జరిగింది.. బండి సంజయ్‌ అరెస్ట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement