
మహదేవ్‌పూర్ పోలీసులకు హైకోర్టు ఆదేశం
‘మేడిగడ్డ’పై డ్రోన్ ఎగరేసిన కేసులో ఊరట
సాక్షి, హైదరాబాద్: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహదేవ్‌పూర్ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసులో ఈ నెల 12 వరకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావును అరెస్టు చేయవద్దని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. ట్రయల్ కోర్టులో హాజరు నుంచి కూడా మినహాయింపు ఇచి్చంది. గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పొడిగిస్తూ కేటీఆర్‌తోపాటు గండ్ర వెంకటరమణారెడ్డి, బాల్క సుమన్‌లకు ఊరటనిచి్చంది. కేసులో కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది.
గతేడాది జూలై 26న మేడిగడ్డ బరాజ్‌ను సందర్శించిన కేటీఆర్, వెంకటరమణారెడ్డి, సుమన్.. ఎటువంటి సమా చారం, అనుమతి లేకుండా డ్రోన్ కెమెరాతో వీడియో చిత్రీకరించారంటూ మేడిగడ్డ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోలీసులకు ఫిర్యా దు చేశారు. దీంతో వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే తప్పు చేయకున్నా తప్పుడు కేసు పెట్టారని.. విచారణ సహా తదుపరి చర్యలు నిలిపివేయడంతోపాటు ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేయాలంటూ కేటీఆర్, వెంకటరమణారెడ్డి, సుమన్ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్ విచారణ చేపట్టి ఈ మేరకు ఆదేశాలిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment