![Nirmal Town Stress Tension - Sakshi](/styles/webp/s3/article_images/2018/03/26/POLI.jpg.webp?itok=NQ_3hTeQ)
రాళ్లు పడకుండా కూరగాయల ట్రేలను అడ్డుపెట్టుకున్న పోలీసులు. గాయంతో ఏఎస్పీ దక్షిణమూర్తి
నిర్మల్/నిర్మల్‌టౌన్ : జిల్లాకేంద్రంలో ఆదివారం నిర్వహిస్తున్న శ్రీరామ రథయాత్ర సందర్భంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. యాత్ర ముగింపు సమయంలో స్థానిక పెద్దమార్కెట్‌లో ప్రాంతంలో ఓ వర్గం ప్రార్థన మందిరంపై మరో వర్గం రాళ్లు రువ్వారంటూ ఒక్కసారిగా ఆందోళనకు దిగారు. ఇరు వర్గాలకు చెందిన వందలాది మంది రాళ్లు రువ్వుకున్నారు. ఈ ఆందోళనలను సద్దుమనుగింపజేయడానికి వచ్చిన ఏఎస్పీ దక్షిణమూర్తి, క్యూఆర్టీ కానిస్టేబుల్‌కు రాళ్లు తగలడంతో తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం పోలీసులు లాఠీచార్జీ, బాష్పవాయు ప్రయోగం చేయడంతో పరిస్థితి కాస్త సద్దుమణిగింది. జిల్లా ఇన్‌చార్జి ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ సంఘటనకు కారకులైన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. అన్ని వర్గాల ప్రజలు సంయమనం పాటించాలని, శాంతియుతంగా ఉండాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment