కేంద్రం ఆదేశాల మేరకే సీఎం డ్రామా | Kiran Kumar Reddy Drama according to Centre, says Manda Krishna Madiga | Sakshi
Sakshi News home page

కేంద్రం ఆదేశాల మేరకే సీఎం డ్రామా

Published Thu, Jan 30 2014 7:54 PM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM

కేంద్రం ఆదేశాల మేరకే సీఎం డ్రామా - Sakshi

కేంద్రం ఆదేశాల మేరకే సీఎం డ్రామా

నిర్మల్: తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఉనికిని కాపాడుకునేందుకు కేంద్రం ముఖ్యమంత్రి కిరణ్‌తో నాటకాలు ఆడిస్తోందని మహాజన సోషలిస్టు పార్టీ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించే క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పూనుకోవటం దారుణమన్నారు. ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ పట్టణంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు.

కేంద్రం కిరణ్‌తో చేయించిన కుట్రలు, కుతంత్రాలు జూలై 30 నుంచి జనవరి 30 వరకు సాగాయని, ఇందుకు నిదర్శనమే అసెంబ్లీ సమావేశాల్లో జరిగిన పరిణామాలని పేర్కొన్నారు. ఏదేమైనా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కాక తప్పదని చెప్పారు. లోక్‌సభ, రాజ్యసభలలో ఎస్సీ, ఎస్టీలకు కల్పిస్తున్న రిజర్వేషన్ల మాదిరే శాసనమండలి, శాసనసభలలో కూడా కల్పించాలని కోరారు. ఇది లేకపోవడంతో ఎంతో మంది ఎస్సీ, ఎస్టీలు నష్టపోతున్నారని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement