ఎంఎస్‌పీ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ
హన్మకొండ సిటీ, న్యూస్‌లైన్ : టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ బీసీలను మోసం చేశాడని మహాజన సోషలిస్టు పార్టీ(ఎంఎస్‌పీ) అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ అన్నారు. బుధవారం హన్మకొండలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. 2004లో కాంగ్రెస్ ప్రభుత్వంలో చేరినపుడు బీసీ ఎమ్మెల్యేలున్నా మంత్రి పదవులివ్వలేదు.. బీసీ సంక్షేమ శాఖ ను అగ్రవర్ణాలకు కట్టబెట్టాడు.. ఇప్పుడేమో పరకాల టికెట్ మొలుగూరి బిక్షపతిని కాదని సహోదర్‌రెడ్డికిచ్చాడు.
పార్టీ బలంగా ఉందని చెపుతున్న కేసీఆర్ బిక్షపతి గెలవడనే సాకుతో తప్పించడం సరికాదన్నారు. టీఆర్‌ఎస్ బలంగా లేని సమయంలో బలమైన అభ్యర్థి కొండా సురేఖపై పోటీ చేసి గెలిచినపుడు, పార్టీ బలంగా ఉండి, బలమై న ప్రత్యర్థి లేని సమయంలో బిక్షపతి ఎందుకు గెలవడని నిలదీశారు. మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి కనీసం ఇద్దరికి కూడా టికెట్ ఇవ్వలేదని, ఇచ్చిన ఒకటి కూడా టీఆర్‌ఎస్ గెలవదనే ఉద్ధేశంతో ఇచ్చారని ఆరోపించాడు.
దళిత, గిరిజన, బీసీ, మైనారిటీలను ఏకం చేసి కేసీఆర్ వైఖరిని ఎండగట్టి తగిన గుణపాఠం చెబుతామన్నారు. పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రియాజ్ మాట్లాడుతూ ఈ ఎన్నికలు నిజమైన తెలంగాణ వాదులు, టీఆర్‌ఎస్ వంటి సూడో తెలంగాణవాదుల కు మధ్య జరుగుతున్నవని, విద్యార్థులు, యువకులు అలోచించి ఓటు వేయాలని కోరారు. ఈ సందర్భంగా మంద కృష్ణ జీవి త చరిత్ర(అన్న మనోడే)పై పార్టీ జిల్లా అధికార ప్రతినిధి తీగల ప్రదీప్ రాసిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. సమావేశంలో నాయకులు రఫీ, నవీద్, రాకేష్, అఫ్జల్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు
బీసీలను మోసం చేసిన కేసీఆర్
Published Thu, Apr 10 2014 4:19 AM | Last Updated on Wed, Aug 15 2018 9:06 PM
Advertisement