అది టీఆర్‌ఎస్ మాదిగ సభ
ఎమ్మార్పీఎస్ అన్యాయాన్ని ప్రశ్నిస్తుంది
రాజయ్య ఎవరి పక్షాన ఉంటారో తేల్చుకోవాలి
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ
హన్మకొండ : హన్మకొండలో ఎమ్మార్పీఎస్ ముసుగులో జరిగిన సభ టీఆర్‌ఎస్ మాదిగల సభ అని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ ఆరోపించా రు. ఎమార్పీఎస్ అన్యాయూన్ని ప్రశ్నిస్తుందని.. ఎవరికి వంతపాడదని.. ఎవరి వెంట పడి పరిగెత్తదని పేర్కొన్నా రు. హన్మకొండ నయూంనగర్‌లోని సూర్య హైస్కూల్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంద కృష్ణమాదిగ మాట్లాడారు. రాష్ర్టంలోని అన్ని పా ర్టీల నాయకులు.. మాదిగలు తమ వెంట ఉండాలని కోరుకుంటున్నారని, అలాంటప్పుడు మాదిగలకు పదవు లు ఉండాలని ఎందుకు కోరుకోవడం లేదని ప్రశ్నించా రు. తెలంగాణ మంత్రి వర్గంలో అగ్రవర్ణాలకు చెందిన ముగ్గురిని తొలగించి మాదిగ, మాల మహిళలకు మంత్రి పదవులు ఇవ్వాలన్నారు. మాదిగజాతిని రాజకీయంగా హత్యచేసిన కిరాతకుడు, దళితులను నమ్మించి మోసం చేసిన మోసగాడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని ధ్వజమెత్తారు. మంత్రి వర్గం నుం చి తొలగించబడిన డాక్టర్ రాజయ్య మాదిగల పక్షాన ఉంటారో... కేసీఆర్ వైపు ఉంటారో తేల్చుకోవాలన్నా రు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రు లు అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వంపై వత్తిడి పెంచి ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టి చట్ట బద్ధత కల్పించినప్పుడే తాము విశ్వసిస్తామన్నారు. ఈనెల 7వ తేదీ నుంచి జరుగునున్న ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో వర్గీకరణ బిల్లును ఆమోదించాలని ఆయన డిమాండ్ చేశా రు. ప్రత్యేక హైకోర్టుపై తెలంగాణ సీఎం కేసీఆర్, పార్లమెంట్‌లో టీఆర్‌ఎస్ ఎంపీలు మాట్లాడుతున్నట్లుగానే.. వర్గీకరణ అంశంపై పార్లమెం ట్‌లో టీఆర్‌ఎస్ ఎంపీలు మాట్లాడాలన్నారు. రెండు రాష్ట్రాల సీఎంలు అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని డిమాండ్ చేస్తూ ఈనెల 18వ తేదీన రెండు రాష్ట్రాల అసెంబ్లీలను ముట్టడించనున్నట్లు మంద కృష్ణమాదిగ చెప్పారు. సమావేశంలో మహాజన సోషలిస్టు పార్టీ జాతీయ అధికార ప్రతినిధి తీగల ప్రదీప్‌గౌడ్, జిల్లా అధ్యక్షుడు మంద కుమార్‌మాదిగ, నాయకు లు తిప్పారపు లక్ష్మణ్, పుట్ట రవి, నకిరకంటి యాకయ్య, వేల్పుల వీరన్న, గోవింద్ నరేష్, బుర్రి సతీష్, బొర్ర బిక్షపతి, మంద భాస్కర్ పాల్గొన్నారు.