పింఛన్ల కోసం డిసెంబర్‌లో ఉద్యమం
ఆదిలాబాద్ కల్చరల్/ఇచ్చోడ(బజార్‌హత్నూ ర్) : అర్హులైన వారికి కేసీఆర్ ప్రభుత్వం తొల గించిన పింఛన్లపై డిసెంబర్‌లో ఉద్యమించి వాటి సాధనకు కృషి చేస్తానని మహాజన సోషలిస్టు పార్టీ(ఎంఎస్‌పీ) రాష్ట్ర అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ ప్రకటించారు. మంగళవారం ఆది లాబాద్ మండలం బాలాజీనగర్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో, బజార్‌హత్నూర్ మండ ల కేంద్రంలో నిర్వహించిన బోథ్ నియోజకవర్గ ఎమ్మార్పీఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.
వర్గీకరణతోనే మాదిగలకు న్యాయం జరుగుతుందని, ఇందుకోసం మరోమారు ఉద్యమించనున్నట్లు చెప్పారు. ఎస్సీ వర్గీకరణతోనే జిల్లాలో 219 మంది ఉపాధ్యాయులకు ఉద్యోగాలు వచ్చాయని చెప్పా రు. భవిష్యత్‌లో ఉద్యోగాలు కావాలంటే ఉద్యమించాల్సిందేనని అన్నారు. తెలంగాణ, ఆం ధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు అఖిలపక్షంతో ఢిల్లీకి వెళ్తే వర్గీకరణ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. అంతకుముందు ఉద్యమంలో కీలకపాత్ర పో షించి మృతిచెందిన జిల్లా వాసి రాధకు సంతా పం వ్యక్తం చేశారు.
ఈ సమావేశాల్లో ఎంఎస్‌పీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రజీహైదర్, ఎమ్మార్పీఎస్ జిల్లా కోఆర్డినేటర్ కుడాల స్వామిమాదిగ, జిల్లా అధ్యక్షుడు జి.శంకర్, మాదిగ ఎంప్లాయ్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కాంపెల్లి ఊశన్న, ఎంఎస్‌పీ నాయకలు ఇస్లామొద్దీన్, ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పెర్క రాజేశ్వర్, నాయకులు నజ్మ, సవిత, ప్రేంరాజ్, రాజు, సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.