మాది నక్సలైట్ల, అంబేద్కర్ ఎజెండా
మావోయిస్టులతో చర్చలు జరుపుతాం
బాబు వూటలన్నీ అధికారం కోసమే
హన్మకొండ సభలో ఎంఎస్‌పీ అధ్యక్షుడు మంద కృష్ణ
వరంగల్, న్యూస్‌లైన్: మావోయిస్టులు, అంబేద్కర్ ఎజెండాయే మహాజన సోషలిస్ట్ పార్టీ లక్ష్యమని ఆ పార్టీ అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ స్పష్టం చేశారు. తావుు అధికారంలోకి వస్తే మావోయిస్టు పార్టీపై నిషేధం ఎత్తివేసి, బేషరతుగా చర్చలు జరుపుతామని ప్రకటించారు. హన్మకొండలో మంగళవారం రాత్రి జరిగిన ఎంఎస్పీ సింహగర్జన సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. సామాజిక న్యాయం, ఆర్థిక సమానత్వం, రాజ్యాధికారం కోసం ఎంఎస్పీ ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
నక్సలైట్ల ఎజెండా కూడా ఇదే అరుునప్పటికీ వారు సాయుధ పోరాట మార్గాన్ని ఎంచుకున్నారని, అంబేద్కర్ రాజకీయ ప్రజాస్వామ్యం ద్వారా సాధించే మార్గాన్ని రాజ్యాంగంలో చూపెట్టారని అన్నారు. రాజకీయ ఖైదీల విడుదలపై విరసం నేత వరవరరావు టీడీపీ నేత చంద్రబాబు వద్దకు వెళ్లడం సరికాదన్నారు. నక్సలైట్లే దేశభక్తులని చెప్పిన ఎన్టీఆర్.. అధికారంలోకి రాగానే వరంగల్ జిల్లాలో మామిడాల హరిభూషణ్‌ను ఎన్‌కౌంటర్‌లో చంపలేదా? చంద్రబాబు నక్సలైట్ నేతలను వరుస ఎన్‌కౌంటర్లు చేయించలేదా అని ప్రశ్నించారు. చంద్రబాబు సామాజిక తెలంగాణ, బీసీ ముఖ్యమంత్రి అంటూ సీమాంధ్రలో అధికారంలోకి వచ్చేందుకు యత్నిస్తున్నారని విమర్శించారు.
మాటతప్పితే బోర్డర్ దాటిస్తం
ఉద్యమ సమయంలో దళితున్ని ముఖ్యమంత్రి, ముస్లింను డిప్యూటీ సీఎం చేస్తానంటూ వూట్లాడిన కేసీఆర్.. ఇప్పుడు ఆ పరిస్థితిలేదంటూ మాటమార్చే యత్నం చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా, మైనార్టీలపై ఆధిపత్యం చెలాయించిన దొరలను గడీల నుంచి తరిమితే హైదరాబాద్ చేరుకున్నారని, ఇప్పుడు కేసీఆర్ మాటమార్చితే హైదరాబాద్ నుంచి తెలంగాణ బోర్డర్ దాటిస్తామని హెచ్చరించారు. ఈ సభకు భారీ సంఖ్యలో జనం హాజరయ్యారు. కళాకారుల ఆటాపాటలతో సభ హోరెత్తింది.