ఆదిలాబాద్ క్రైం, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బందోబస్తు ప్రక్రి య పోలీసులకు పెనుసవాలుగా మారింది. ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్ నేపథ్యంలో అక్కడి మావోలు జిల్లాలో కార్యకలాపాలు సాగిస్తున్నారనే సమాచారంతో ఈ పరిస్థితి మరింత తీవ్రతరమైంది. ఈ నేపథ్యంలో రెండు నెల లుగా సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. అయినా మావోయిస్టు యాక్షన్ టీం కదలికలు ఏమాత్రం ఆగలేదు. ఛత్తీస్‌గఢ్ ఘటన నుం చి ఇప్పటివరకు జిల్లాలో మావోల కదలికలు పెద్ద ఎత్తున్న జరుగుతున్నట్లు సమాచారం. ఈ ఎన్నికల్లో తమ ఉనికిని చాటేందుకు మావో లు పక్కా ప్రణాళికతో ఉన్నట్లు తెలుస్తోంది. పది రో జులుగా జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో మావోలు సంచరించడాన్ని పోలీసులు గుర్తించినట్లు సమాచారం.
మొత్తం 20 మంది..!
జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలైన కడెం, మంగి, తిర్యాణి అటవీ ప్రాంతాల్లో ఇటీవల 20 మంది మావోయిస్టుల కదలికలను పోలీసులు గుర్తించినట్లు సమాచారం. వా రం రోజులుగా ఈ కదలికలు ఉన్నట్లుగా వారు భావిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మా వోయిస్టుల ప్రభావం జిల్లాలో ఉంటుందని ఇదివరకే రాష్ట్ర డీజీపీ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జిల్లా అటవీ ప్రాంతాల్లో మావోలు సంచరిస్తున్నట్లు తెలియడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా వాంకి డి, సిర్పూర్, బెజ్జూరు, దహెగాం, ఈద్గావ్, తిర్యాణి, నెన్నెల, కోటపల్లి, కౌటాల, సిర్పూర్-టి, చెన్నూరు, నీల్వాయి, భీమినీ, లింగాపూర్, పెంబి, కడెం, ఖానాపూర్ ప్రాంతాల్లో మావోయిస్టుల ప్రభావం తీవ్రంగా ఉంది. జిల్లా నుంచి 37 మంది మావోయిస్టులు ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒడిస్సా రాష్ట్రాల్లో మావోయిస్టు కా ర్యకలాపాల్లో ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. మావోల ప్రభావం ఉండడంతోనే జిల్లాకు ప్రత్యేక హెలిక్యాప్టర్, కేంద్ర బలగాలను పంపించినట్లు తెలుస్తోంది.
రాజకీయ నాయకులే టార్గెట్
సార్వత్రిక ఎన్నికలకు మావోయిస్టుల నుంచి ముప్పు ఉందని రాష్ట్ర డీజీపీ ప్రసాద్‌రావు వెల్లడించడంతో ఆ ప్రభావం జిల్లాలో ఎక్కువగా ఉంటుందని తెలుస్తోం ది. జిల్లాలో మావోయిస్టు యాక్షన్ టీంలు రెక్కీలు ని ర్వహించే ప్రమాదం ఉందని రాష్ట్ర పోలీసు శాఖ ఇది వరకే జిల్లా పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలి సింది. ఎన్నికల్లో మావోయిస్టులు స్పెషల్ యాక్షన్ టీంలను ఏర్పాటు చేసి రాజకీయ నాయకులనే టార్గె ట్ చేసినట్లు సమాచారం. దీంతో ఏజెన్సీ ప్రాంతాల్లోని అభ్యర్థులకు మావోల కదలికలు పెద్ద తలనొప్పిగా మారాయి. ఎన్నికల్లో విస్తృత ప్రచారం చేసిన నాయకులు ఇప్పుడు ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటారో లేదోననే భయపడుతున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న నాయకులకు భద్రత కల్పించేందుకు పోలీసులు కట్టుదిట్టమైన ఏ ర్పాట్లు చేస్తున్నారు. 79 మావోయిస్టు ప్రభావిత ప్రాం తాల్లో గ్రేహౌండ్స్ బలగాలు, బీఎస్‌ఎఫ్ బలగాలతో కూంబింగ్ నిర్వహిస్తున్నారు.
పోలింగ్ తగ్గే అవకాశాలు
జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో మావోయిస్టుల కదలికలతో గిరిజన గ్రామాల ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. మావోల భయంతో ప్రజలు ఓటు వే సేందుకు ముందుకు రావడానికి మొగ్గుచూపే అవకాశాలు చాలా తక్కువగానే ఉన్నాయి. దీంతో ఈ ప్రాం తాల్లో పోలింగ్ శాతం తగ్గే అవకాశాలు ఉన్నాయి. వీటన్నింటి నేపథ్యంలో జిల్లాలో బుధవారం పోలింగ్ మేరకు కొనసాగుతుందనేది వేచి చూడాల్సిందే.
అన్నల అలికిడి
Published Wed, Apr 30 2014 12:40 AM | Last Updated on Tue, Oct 9 2018 2:47 PM
Advertisement
Advertisement